గొంతునొప్పికి ఇంటి చిట్కా...
close
Published : 14/10/2021 14:04 IST

గొంతునొప్పికి ఇంటి చిట్కా...

వర్షాకాలం జలుబు, దగ్గు వంటివి ఇట్టే దాడి చేస్తాయి. ప్రతిసారీ మాత్రలు మింగేయకుండా... ఇంట్లో ఉన్నవాటితో కూడా చిట్కావైద్యం చేసి చూడండి..

* కప్పు నీటిలో అరచెంచా మిరియాలపొడి వేసి మరిగించిన కషాయంలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగితే గొంతులో కఫం తగ్గుతుంది.

* రెండు కప్పుల నీళ్లల్లో చెంచా వాము వేసి మరిగించి నోరు పుక్కిలిస్తే ఈ కాలంలో వచ్చే గొంతు సమస్యలను నివారించవచ్చు.

* వర్షంలో తడిసి గొంతు నొప్పి బాధిస్తున్నప్పుడు రెండు చెంచాల తులసి రసంలో చెంచా తేనె చేర్చి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

* రోజూ రెండు ఉసిరికాయలను తింటే, వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉండదు.మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని