జుట్టుకు... పోషకాలు!
close
Updated : 24/10/2021 06:23 IST

జుట్టుకు... పోషకాలు!

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలా... చుండ్రు పోవాలా... వెంట్రుకలు చిట్లకుండా ఉండాలా... అయితే కొన్ని రకాల పూతలు వేయాల్సిందే మరి.

ల్లంలోని యాంటీ సెప్టిక్‌ సమ్మేళనాలు చుండ్రును తగ్గిస్తాయి. రెండు చెంచాల అల్లం రసం, మూడు చెంచాల నువ్వుల నూనె, చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. కాసేపాగి గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేయాలి. వారంలో ఒకట్రెండుసార్లు చేస్తే చుండ్రు పోతుంది. చెంచా చొప్పున అల్లం రసం, జొజొబా ఆయిల్‌ కలిపి మాడుకు చక్కగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు చక్కగా పెరుగుతుంది.

చక్కెర... షాంపూలో చెంచా పంచదార కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది మురికి, మాడుపై పేరుకు పోయిన మృతకణాలను తొలగిస్తుంది. దాంతో వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

ఉల్లిరసం... ఇందులోని ఫాస్ఫరస్‌ జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా, బలంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ మూలకం జుట్టు పెరుగుదలకు కారణమయ్యే కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది.మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి