చలికాలంలో..సులువుగా జీర్ణమయ్యేలా
close
Updated : 06/12/2021 19:15 IST

చలికాలంలో..సులువుగా జీర్ణమయ్యేలా


 

అసలే అంతంత మాత్రంగా ఉండే అమ్మలు, అమ్మాయిల తిండి చలికాలంలో ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. దీంతోపాటు ఇమ్యూనిటీ కూడా. దీన్ని ఎలా అధిగమించాలంటే...

రోజూ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, ఎండుఫలాలు, పాల ఉత్పత్తులు, గింజధాన్యాలు, ఆకు కూరలు, నెయ్యి వంటివి ఉండాలి. ఇవి జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు జీవక్రియలనూ సమన్వయం చేస్తాయి.
చలిగాలికి బద్ధకం, నిద్ర లాంటివి ఆవరిస్తాయి. ఇది కూడా అజీర్తికి కారణమే. కాబట్టి, లోపలి నుంచి వెచ్చదనాన్ని అందించే ఎండు ఫలాలు, గింజలు, పప్పులు, నువ్వులు వంటివాటికి ప్రాధాన్యమివ్వాలి. మాంసం, చేపలు, తృణధాన్యాలతోపాటు ప్రొటీన్లు, మంచి కొవ్వులున్న ఆహారమూ ఇందుకు తోడ్పడేదే. క్యారెట్‌, బంగాళాదుంప, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, చిలగడదుంప, బీట్‌రూట్‌తోపాటు పాలకూర, మెంతికూర వంటివాటిలో ఉండే పోషకవిలువలు శరీరానికి శక్తిని అందించి ఈ కాలంలో ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.

ఆవాలు, ఇంగువ, నల్ల మిరియాలు, మెంతులు, వాము వంటి సుగంధ ద్రవ్యాలన్నీ దగ్గు, జ్వరం, జలుబు వంటి సీజనల్‌ ఇన్ఫెక్షన్లను దరిచేరకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియలు సవ్యంగా జరిగేలా చేస్తాయి. అలాగే కీళ్లు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాదు, తులసి, అల్లం ఆరోగ్యాన్ని నిత్యం పరిరక్షిస్తాయి. ఉదయం నిద్రలేవగానే కప్పు అల్లం టీ లేదా అల్లం వేసి మరిగించిన వేడినీటిని తాగితే జీర్ణవ్యవస్థ సవ్యంగా పని చేస్తుంది.

 


Advertisement


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి