ఈ సంకెళ్లు ఎందుకో తెలుసా?
close
Published : 14/03/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సంకెళ్లు ఎందుకో తెలుసా?

చీటికీమాటికీ గొడవలు పడటం... విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం ఇది వాళ్లకు నచ్చలేదు. జీవితం అంతా కలిసి ఉండటానికి ఏదైనా చేయాలనుకున్నారు. ఇందుకోసమే... ఒకరినొకరు సంకెళ్లతో బంధించుకున్నారు ఉక్రెయిన్‌కి చెందిన అలెగ్జాండర్‌, విక్టోరియా దంపతులు. ఏ పనిచేసినా కలిసే చేయాలి... సంకెళ్లు వేరుచేసే ప్రసక్తే లేదు. ఇలా మూడునెలలపాటు ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో కూడా నమోదు చేసుకున్నారు. ఆ దేశంలో ఎక్కడ చూసినా హాట్‌ టాపిక్‌గా మారిన ఈ దంపతులని ఇన్‌స్టాగ్రామ్‌లో వేలమంది అభిమానులు అనుసరిస్తున్నారు. ‘ఇంతకు ముందులానే ఇప్పుడు కూడా పోట్లాడుకుంటున్నాం. కాకపోతే అప్పుడు కోపం వస్తే పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోతున్నాం. కానీ మా ప్రేమ జీవితాంతం ఇలా కలిసే ఉంటుందని నమ్ముతున్నాం’ అంటోంది విక్టోరియా.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని