పంచుకుంటే ఎంత బాగుంటుంది...
close
Published : 16/03/2021 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంచుకుంటే ఎంత బాగుంటుంది...

భార్యాభర్తలు ఇద్దరూ ‘నీదో లోకం... నాదో లోకం’ అన్నట్టుగా ఉంటే... ఆ బంధానికి విలువే ఉండదు. నిజానికి ఆలుమగలు మంచి స్నేహితుల్లా ఉండాలి. ఇదంతా వినడానికి బానే ఉందిగానీ అదెలా సాధ్యమంటారా... అయితే ఇది మీ కోసమే.
ఇద్దరూ ఉద్యోగులైతే.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన విషయాలను ఒకరికొకరు చెప్పుకోవచ్చు. మీరు ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్న విషయాలను చెప్పడం వల్ల మనసు తేలిక పడుతుంది. అంతేకాదు మీకు రాని ఆలోచన ఎదుటివారికి రావచ్చు. దాంతో మీ సమస్యా పరిష్కారం అవుతుంది.  
* ఎప్పుడూ ఎటూ తేల్చుకోలేని సీరియస్‌ విషయాలు, కుటుంబ సమస్యల గురించే  కాకుండా... సంతోషకరమైన విషయాలూ చక్కగా మాట్లాడుకోవచ్చు. మీ పనితీరును ఆఫీసరు మెచ్చుకున్నారనుకోండి. ఇదే విషయాన్ని భాగస్వామితో చెబితే.. మీ సంతోషం రెట్టింపు అవుతుంది. అలా ప్రతికూల అంశాలనే కాకుండా ప్రతిచిన్న విషయాన్ని, సానుకూల అంశాలనూ చెప్పడం అలవాటు అవుతుంది.
* ఇంట్లో ఎవరు చేయాల్సిన పనులు వాళ్లకుంటాయి. అయినా సరే కలిసి నడక, వ్యాయామాలు చేయొచ్చు. షాపింగ్‌లు, స్నేహితుల ఇళ్లకు ఎవరికివాళ్లు కాకుండా ఇద్దరూ వెళ్లొచ్చు. అలాగే కబుర్లు చెప్పుకుంటూ తోటపనులు చేసుకున్నా అసలు సమయమే తెలియదు. ఇలా కలిసి పనులు చేసుకోవడం వల్ల మీ బంధమూ బలపడుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని