మీకోసమే.. ఆ సమయం!
close
Published : 09/06/2021 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీకోసమే.. ఆ సమయం!

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే... ఇంటి పనులు, వ్యక్తిగత సమయం కేటాయించుకునే  వరకూ ప్రణాళికాబద్ధంగా లేకపోతే రుసరుసలు తప్పవు. ఆ వాదనలు కాస్తా ముదిరితే ఇంటి వాతావారణం    దెబ్బతింటుంది. అలాకాకూడదంటే...
* ఇద్దరూ వేర్వేరు షిప్ట్‌ల్లో వెళ్తున్నాం.... ఇంటికొచ్చాక అలసట. దాంతో ముఖాలు చూసుకునే తీరిక కూడా ఉండట్లేదు అంటారు కొందరు. అదే మీ ఇబ్బంది అయితే వీలైతే మీ ఇద్దరి వారాంతపు లవు ఒకే రోజు ఉండేలా చూసుకోండి. కానీ చాలామందిలా మీరూ ఆ రోజుని విశ్రాంతి దినంగా భావించొద్దు. పనులు, నిద్ర అన్నీ పూర్తిచేసుకున్నాక మీ కోసం మీరు ఓ గంటా రెండు గంటలు కేటాయించుకోండి. కుదరకపోతే నెలకోసారైనా ఒకరి వారాంతం రోజున మరొకరు సెలవు పెట్టుకుని కలిసి గడపండి. ఆ సమయంలో బయట విషయాల కంటే ఇద్దరికీ సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించుకుంటే అభద్రత దరిచేరదు.
* ఇంటి పనులు, ఆర్థిక విషయాల్లో ఒక్క మాటమీద నడిస్తే మేలు. బాధ్యతల్ని పక్కవారి మీదకు నెట్టే ప్రయత్నం చేయొద్దు. పనులు విభజించుకుని పంచుకోండి. ఎవరిపనులు వారు చేస్తే మరొకరి మీద భారం పడదు. అలానే పదే పదే ఎదుటివారి పనుల్లో లోపాల్ని ఎత్తిచూపడం సరికాదు. వీలైతే... వాటిని పరిహరించడానికి మీవంతు సాయం చేయండి. ఇవన్నీ మీ జీవితం చక్కగా సాగిపోవడానికి సాయపడతాయి.
* జీవనశైలిపై ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వాటితో చాలా సమయమే వృథా అవుతుంది. అందుకే మీరు కలిసి ఉన్న సమయంలో ఓ గంట ఫోన్లను ఆఫ్‌ చేయండి. పూర్తిగా ఆఫ్‌ చేయలేకపోతే సైలెంట్‌లో పెట్టండి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లకు దూరంగా ఉండండి. అప్పుడు కచ్చితంగా భాగస్వామి కోసం నాణ్యమైన సమయాన్ని కేటాయించగలరు. అలానే ఆ సమయాన్ని కలిసి వ్యాయామం చేయడానికో, తోటపని చేయడానికో వాడితే సంతోషంగానూ ఉండగలరు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని