ఇతరులతో చెడుగా చెప్పొద్దు!
close
Published : 11/06/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇతరులతో చెడుగా చెప్పొద్దు!

భార్యాభర్తల మధ్య తగాదాలు సహజమే కానీ...మూడో వ్యక్తికి మాట్లాడే అవకాశం కల్పించడం పొరబాటు. తర్వాత ఆ గొడవ సద్దుమణిగినా...ఒకరిపై మరొకరు చేసుకున్న ఫిర్యాదులు తర్వాత సమస్యలుగా మారుతుంటాయి. ఇద్దరి మధ్యా అగాథాన్ని సృష్టిస్తుంటాయి. మరి అలాకాకూడదంటే...

వాదనలు జరిగినప్పుడు మాటకు పదిమాటలు అనడం చేయొద్దు.  అలానే గొడవ జరిగిన ప్రతిసారీ భాగస్వామి లోపాల్ని ఎత్తి చూపుతూ స్నేహితులు, ఇతర కుటుంబీకులతో చెప్పే అలవాటుకు స్వస్తి పలకండి. వీలైతే ఇద్దరూ కలిసి కూర్చుని చర్చించుకోండి. లేదంటే కొంత సమయం సహనం పాటించండి.

నమ్మకం... కొన్ని జంటల్లో చాలా చిన్నచిన్న విషయాలకే గొడవలు మొదలవుతాయి. ఇది కేవలం ఇరువురి మధ్య ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడమే. దీంతో భర్త తనను దూరం పెడుతున్నాడని, లేదా తన భార్య తనకు విలువనివ్వడం లేదంటూ సమస్యలతో బాధపడిపోతుంటారు. దానికి మూడోవ్యక్తి చెప్పే సలహాలు కొన్నిసార్లు సమస్యను మరింతగా జటిలం చేస్తాయి. అలాకాకుండా మీరే మీ భాగస్వామి అభద్రతను దూరం చేస్తే ఈ పరిస్థితే ఎదురుకాదు.

మన్నించండి: భిన్ననేపథ్యాలు ఉన్న వ్యక్తుల అభిరుచులు, వ్యవహారం అన్నీ వేర్వేరుగా ఉంటాయి ప్రతి వాదనలోనూ నాదే పై చేయి కావాలనుకోవడం పొరబాటు. ఎదుటివారి అభిప్రాయాలు, ఆలోచనలు గౌరవించండి. ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయాల్లో మీ వాదనే సరైనదని ఇతరులతో చెప్పించడానికి ప్రయత్నించొద్దు. ఈ తీరు సమస్యను మరింతగా పెంచుతుంది. అలాకాకుండా వారి భావాలను మన్నించండి. అప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా పోట్లాడుకునే అలవాటు తగ్గుతుంది. మీ దాంపత్యం సంతోషంగా సాగుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని