చిత్రకళనే చికిత్సగా..
close
Published : 03/07/2021 00:50 IST

చిత్రకళనే చికిత్సగా..

పదేళ్ల మౌనిక ఆడుకుంటున్న సమయంలో తండ్రి అకస్మాత్తుగా గుండె నొప్పితో కిందపడిపోయాడు. ఆసుపత్రికి సకాలంలో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటివరకు తల్లి ముఖంలో తీవ్ర ఆందోళనను గుర్తించింది మౌనిక. తండ్రి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మౌనిక ఎవరితోనూ మాట్లాడటం మానేసింది. తినడం తగ్గించింది. మానసిక నిపుణుల సలహామేరకు చిత్రకళ నేర్పించడం మొదలైన కొన్ని రోజులకు కోలుకుంది. పిల్లల భావోద్వేగాలు బయటికి వ్యక్తీకరించేలా చేయడానికి, వారి ఆందోళనలను దూరం చేయడానికి చిత్రకళ మంచి మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా తల్లిదండ్రులకు కొన్ని మార్గ దర్శకాలను ప్రకటించింది. కొవిడ్‌ కల్లోల ప్రభావం చిన్నారులపై పడకుండా చేయడానికి ఆర్ట్‌ థెరపీని అలవాటు చేయమని సూచించింది. 

* ఆసక్తిని పెంచాలి... మనసుకు కష్టం కలిగించే సందర్భం ఎదురైనప్పుడు పిల్లలు కుంగిపోతారు. ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోలేరు. క్రమేపీ అది భయం, ఆందోళన, కోపంగా మారుతుంది. బొమ్మలు గీయడం, వాటిని రంగులతో నింపడం, ముగ్గులు వేయడంపై పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. ఇవి వారిలో గూడు కట్టుకున్న ఆలోచనలు, భావోద్వేగాలను బయటకు తెస్తాయి.
* వర్ణాలతో... ఒత్తిడి మాత్రమే కాదు, జన్యు సమస్యలున్న చిన్నారులకూ చిత్రకళ ఉపయోగపడుతుంది. పసుపు, నీలం, ఎరుపు వంటి వర్ణాలను బొమ్మల్లో నింపుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం మెరుగుగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. బొమ్మలు గీసేటప్పుడు పిల్లల మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది. వాటర్‌ కలర్స్‌ వేస్తున్నప్పుడు ఆ రంగులు వారి ఆలోచనాశక్తిని, భావోద్వేగాలను ప్రతిఫలిస్తాయి. కోపోద్రేకాలు తగ్గుతాయి. ఈ కళ ఓ చికిత్సలా పని చేయడం మొదలు పెడుతుంది.
* ఏకాగ్రత... బొమ్మలు గీయడం, రంగులేయడం వల్ల చిన్నారులకు  ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. సహనం అలవడుతుంది. ఒత్తిడిని జయించగలుగుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు. మనసుకు నచ్చిన బొమ్మను వేయగలిగితే అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. జీవన నైపుణ్యాలను ఎలా మెరుగు పరుచుకోవాలో నేర్చుకుంటారు. వీటన్నింటివల్ల చదువులోనూ ముందుంటారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని