పిల్లలు ఎదురు చెబుతున్నారా...
close
Published : 08/07/2021 00:36 IST

పిల్లలు ఎదురు చెబుతున్నారా...

పిల్లలు ఎదురుచెప్పడం అనేది చాలా ఇళ్లల్లో సాధారణం అయ్యింది. ఇల్లాలి ఒత్తిడి పెంచే అంశాల్లో ఇదొకటి. మరి దీనికి పరిష్కారమేంటి?! అసలు చిన్నారులకు కోపతాపాలెందుకు వస్తాయంటే సైకాలజిస్టులు చెబుతున్న కారణాలివి...

టీనేజ్‌ వచ్చేసరికి పిల్లలు తామిక పెద్దయిపోయామని స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. దాంతో అమ్మానాన్నలు ఒక మాట అనగానే తమకు ఘోర అవమానం జరిగినట్లుగా భావించేసి గబుక్కున ఎదురుచెప్తారు.

* భార్యాభర్తలు పరస్పరం తూలనాడుకుంటే పిల్లలకు అదే అలవాటై ఎదురుచెప్తారు. పెద్దల్ని వాళ్లు అనుకరిస్తారని మర్చిపోకూడదు.

* అనారోగ్యం, అలసటలతో ఎదురుచెప్తారు.

* చదువులో వెనకబడటం, టీచర్లు మందలించడం, తోటి పిల్లలతో పేచీలు, స్నేహితులు దూరమవ్వడం, అడిగినవేవో పెద్దలు కొనివ్వకపోవడం లాంటి కారణాలతో నిరాశకు లోనైనప్పుడు ఎదురుచెప్తారు.

ఈ పరిస్థితిని మార్చుకోవడానికి నిపుణులు ఏం చెబుతున్నారంటే...

* మార్కెట్టుకు వెళ్లి కూరగాయలు తెమ్మనడం లాంటి పనులు చేయనని ఎదురుచెప్తే దాన్ని రాద్ధాంతం చేయనవసరం లేదు

* పిల్లల ముందు పెద్దలు అరచుకోవడం, వాదించుకోవడం మానేయాలి. ఆ ప్రభావం వాళ్లమీద విపరీతంగా ఉంటుందని గ్రహించాలి.

* చిన్నారులు ఎందుకు అశాంతిగా ఉన్నారో తెలుసుకుని ఆ పరిస్థితిని మార్చగలిగితే సమస్య అదే పరిష్కృతమవుతుంది.

* పిల్లల అవసరాలు తీర్చడమే కాదు, వారికి ప్రేమ, లాలన చాలా ముఖ్యం. అది కరవైతే వాళ్లలో అలజడి కలిగి ఇంట్లో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంటుంది.

* పిల్లలు ఎదురుచెప్పినప్పుడు కోప్పడి, కొట్టడం కంటే మాట్లాడ్డం ఆపేయడంవల్ల పరివర్తన వస్తుంది. క్షమించమని అడుగుతారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని