ఇరువురికీ ఉండాలో లక్ష్యం
close
Published : 19/07/2021 01:36 IST

ఇరువురికీ ఉండాలో లక్ష్యం

ఆలుమగల అనుబంధం సంతోషంగా సాగిపోవాలంటే... భవిష్యత్తుపై స్పష్టతతో పాటు సర్దుబాట్లు ఉండాలి. కీలక సమయాల్లో ఒక్కటై నడిచే ఓర్పు, నేర్పు కావాలి. అందుకోసమే ఈ చిట్కాలు. 

గౌరవించండి... భార్యాభర్తల కుటుంబ నేపథ్యం, చదువు, అలవాట్లు వంటివన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఏడడుగులు నడిచిన తర్వాత కూడా ఇరువురి పద్ధతులు, జీవనశైలి వేరేగా ఉండొచ్చు. అయితే ఇద్దరూ జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని అనుకోవడం మాత్రం తప్పనిసరి. అది వారి ఉద్యోగానికి సంబంధించినదైనా కావొచ్చు. లేదా కుటుంబానికి చెందినదైనా అవ్వొచ్చు. ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి, ఆర్థికంగా నిలబడాలనే ఆశ వంటివి ఒకరికొకరు పంచుకోవాలి. పరస్పరం ఆశయాల సాధనలో ప్రోత్సహాన్ని అందించుకోలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.

లక్ష్యం ఉండాలి... భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. కానీ ఇద్దరూ కలిసి తమ కోసం, కుటుంబం కోసం కూడా గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే బాధ్యతలు అర్థమవుతాయి. అపార్థాలు దరిచేరవు. ఒకవేళ ఇద్దరూ కలిసి అనుకున్న ప్రణాళికలో పొరబాటు జరిగినా... ఇబ్బందులు ఎదురైనా, ఒకరినొకరు నిందించుకోవద్దు. కూర్చుని మాట్లాడుకుని సర్దుబాట్లు చేసుకోండి. అప్పుడే మీరనుకున్నది చేయగలరు.

పంచుకోండి... భార్యాభర్తలిద్దరూ సమానమే అనే భావన ఉండాలి. తమ లక్ష్యమే గొప్పదనో, లేదా తాము మాత్రమే కుటుంబం కోసం పాటు పడుతున్నామనో ఆలోచించకూడదు. కలిసి కష్టపడుతున్నది కుటుంబ క్షేమం కోసమే అనుకోవాలి. మీ మార్గాల్లో ఇబ్బందులను భాగస్వామితో పంచుకోవాలి. వాటిని సాధించగలవనే నమ్మకాన్ని ఎదుటివారికి కలిగించాలి. అప్పుడే అభద్రత దూరమై ఆ అనుబంధంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని