సున్నితంగా చెబితేనే సంతోషం...
close
Published : 23/07/2021 01:07 IST

సున్నితంగా చెబితేనే సంతోషం...

ఆలుమగల అనుబంధానికి ప్రత్యేక సూత్రాలేమీ ఉండవు. సందర్భం, పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. ఇష్టాయిష్టాలను పంచుకోవాలి.అప్పుడే సంతోషంగా సాగిపోతుంది ఆ కాపురం.

క్కోసారి చిన్న విషయాలూ ఆలుమగల మధ్య పెద్ద దుమారం లేపుతుంటాయి. మీరు చిన్నది అనుకున్న విషయం అవతలి వారికి పెద్దదిగా కనిపించొచ్చు... వీలైనంత వరకూ అన్నింటా పారదర్శకంగా ఉండండి. ఏదైనా తప్పక దాచాల్సి వచ్చినా... వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించుకోండి. అప్పుడే అపోహలూ, అపార్థాలూ ఉండవు.

* కోపంతో సాధించలేని ఎన్నో పనులు ప్రేమతో చేయొచ్చు. ఎదుటివారిలో మార్పు కోరుకున్నప్పుడు మీరు చెప్పాలనుకునే విషయం కోపంతోనో, ఆవేశంతోనో కాకుండా సున్నితంగా చెప్పిచూడండి. ఉద్వేగాలతో ఎదుటి వారి కాళ్లకు బంధనాలు వేయడం వల్ల... ఇద్దరి మధ్యా అగాథం పెరిగే ప్రమాదం ఉంది. ప్రేమను వ్యక్తం చేయడంలో అందరి తీరూ ఒకేలా ఉండక పోవచ్చు. అర్థం చేసుకుని అడుగులేస్తే ఆనందమే.

* ఎందరిలో ఉన్నా... ఎంత దూరంలో ఉన్నా మీ బంధానికి ప్రాధాన్యం ఇవ్వడం మరిచిపోవద్దు. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే.. నలుగురిలోనూ మీ మర్యాదా నిలబడుతుందని గమనించండి. అలాకాకుండా చులకన చేయడం, కొట్టి పారేయడం...వద్దు. ఏ విషయమైనా గుట్టుగా మాట్లాడుకుని ఒక తాటిపై నిలబడితేనే సంసారం సంతోషంగా సాగిపోతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని