తోబుట్టువుల తగాదాలు తీర్చేద్దాం!
close
Published : 15/08/2021 01:13 IST

తోబుట్టువుల తగాదాలు తీర్చేద్దాం!

అమ్మా చూడు తమ్ముడు నా పెన్సిల్‌ తీసుకున్నాడు. ఇమ్మంటే కొడుతున్నాడు. ఓ చిచ్చర పిడుగు కంప్లైట్‌. కాదమ్మా అక్కే నన్ను కొడుతోంది... అంటూ ఓ చెల్లి ఫిర్యాదు. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పోట్లాటలు సర్వసాధారణం. ఇలాంటప్పుడు వారికెలా సర్దిచెప్పాలో సూచిస్తున్నారు మానసిక నిపుణులు.

పిల్లలు గొడవపడుతుంటే... దాన్ని ఆపడానికి వారిని కొట్టడం, తిట్టడం చేయొద్దు. ముందు తగాదాకు కారణం తెలుసుకోండి. తర్వాతే పరిష్కారాన్ని సూచించండి. చిన్నవాడనో, పెద్దదనో పక్షపాతంగా తీర్పులివ్వొద్దు. తప్పెవరిదో వారు సరిదిద్దు కోవాల్సిందే అని సున్నితంగానే హెచ్చరించండి.

* చిన్నారుల గొడవలకు, అసూయలకు తల్లిదండ్రులూ ఒక్కోసారి కారణం అవుతుంటారు. ప్రతి చిన్న విషయానికీ మరొకరితో పోల్చడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం ఉంది. అలానే అభద్రతతో, అసహనంతో అకారణంగా పోట్లాటకు దిగొచ్చు. అందుకే అలా చేయొద్దు. ‘అక్క నీకు సాయం చేస్తుంది... నువ్వూ త్వరగా నేర్చుకోవచ్చు’ అనో, ‘తమ్ముడికి నువ్వంటే ఎంతిష్టమో నీతో కలిసి చేస్తానంటున్నాడనో’ నచ్చజెప్పండి. సంతోషంగా వారిని స్వీకరిస్తారు.

* పిల్లలకు ఒంటరిగా ఉన్నామనే భావన వస్తే అభద్రతకు లోనవుతారు. చిరాకు, కోపం లాంటి లక్షణాల ద్వారా ఆ అశక్తతను ప్రదర్శిస్తారు. కాబట్టి  రోజూ వీలైనంత సమయాన్ని వారితో గడపటానికి ప్రయత్నించండి. ఏ విషయాన్నైనా ప్రేమతో, ఓర్పుతో అర్థమయ్యేలా చెప్పండి. ఇద్దరినీ అన్ని విషయాల్లో సమానంగా చూడటం తప్పనిసరి. ఇక, కొందరు పిల్లలు గొడవపడరనే ఆలోచనతో... ఏం కొన్నా ఒకేలాంటివి తెస్తుంటారు. అలాకాకుండా... వారికి నచ్చేవి కొనివ్వండి. ఎవరి వస్తువుని వారు భద్రంగా ఉంచుకోకపోతే... మరోసారి ఎంచుకునే అవకాశం ఇవ్వనని చెప్పండి. గొడవ పడకుండా సర్దుబాటు చేసుకుంటారు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని