అంచనాలు వద్దు... ఆనందమే ముద్దు
close
Published : 16/08/2021 01:11 IST

అంచనాలు వద్దు... ఆనందమే ముద్దు

భాగస్వామి మీద కొందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఎదుటి వాళ్లు ఎప్పుడూ తమను ఆశ్చర్యపరచాలనీ, ఆనందంలో ముంచేయాలని కోరుకుంటారు. తమ అంచనాలకు తగ్గట్టుగా భాగస్వామి ప్రవర్తించకపోతే... కుంగిపోతుంటారు. నిరాశకు లోనవుతుంటారు. అలాకాకుండా మీ జీవితం హాయిగా...సంతోషంగా సాగిపోవాలంటే...

* సినిమాల్లో, పుస్తకాల్లో చూపినట్లు... జీవితంలోనూ అద్భుతాలు జరగాలని ఊహించుకోవడం సరికాదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని సంతోషాన్ని సంసారంలో నింపుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుందని గుర్తించాలి. ఒకవేళ మీ ఆశల్ని అవతలి వారు గుర్తించలేకపోతే... వాటిని తెలిసేలా చేయండి. మీకేది నచ్చుతుందో చెప్పండి. క్రమంగా వారిలో మార్పు వస్తుంది. ఎవరూ మీ మనసులోకి వెళ్లి తెలుసుకోలేరు కదా!

* అనుకున్నవన్నీ అప్పటికప్పుడు జరిగిపోవాలని ఆశించవవద్దు. వాటికోసం పట్టుపట్టొద్దు. అవతలి వారి పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా ఒప్పించడం వల్ల ఇద్దరి మధ్యా అగాథం ఏర్పడుతుంది. అన్నీ మీకు మీరే అనుకుని ఎదురు చూడటం వల్ల నిరాశే మిగులుతుంది. బదులుగా ముందుగానే... ఇద్దరూ కలిసి నిర్ణయించుకుంటే అలా బాధపడే పరిస్థితి ఎదురుకాదు.

* ఆలుమగలు అయినంత మాత్రాన... అన్నింటికీ అవతలి వారిదే బాధ్యత అన్నట్లు ప్రవర్తించడం తప్పు. భర్త ఇంటి పనులు, వంట చేసుకోవడంలో అయినా, భార్య... బయట కెళ్లి కొన్ని పనులు పూర్తి చేసుకోవడంలో అయినా... చొరవతో పాటు సర్దుబాటు, సహనం తప్పనిసరి. అప్పుడే ఆ సంసారం ఆనందంగా సాగిపోతుంది.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని