కొత్త కోడలిగా... అత్తగారింట!
close
Published : 18/08/2021 01:07 IST

కొత్త కోడలిగా... అత్తగారింట!

నవ వధువుగా అడుగుపెట్టిన అమ్మాయికి అత్తగారింటి పరిస్థితులు అలవాటు కావడానికి, ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోవడానికి కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా అత్తమామలను అర్థం చేసుకోవడానికి కొంత టైమ్‌ కావాల్సిందే. మీరూ కొత్త కోడలా...అయితే ఈ చిట్కాలు మీకోసమే...

సానుకూల వైఖరి...  కొత్తకోడలిగా మీకెంత కొత్తగా ఉంటుందో.. అప్పుడే వచ్చిన అత్తగారి హోదా కూడా ఆమెకు సరి కొత్తగానే ఉంటుంది. కాబట్టి తనతో సానుకూలంగానే వ్యవహరించండి. వేరే వాళ్ల మాటలు విని ఆమెను విరోధిలా చూడొద్దు. ఆమె కూడా మీతో కలివిడిగా ఉండటానికే ప్రయత్నిస్తుంది.
సమానత్వం... మీ అమ్మ లానే ఆమెనూ ప్రేమగా చూడండి. తన పుట్టినరోజు/ పెళ్లి రోజు, మరేదో వేడుక సందర్భంగా బహుమతితో ఆమెను సర్‌ప్రైజ్‌ చేయండి. ఒకవేళ మీరు తనకి దూరంగా ఉంటున్నట్లయితే వారానికో, రెండు వారాలకో లేదా వీలున్నప్పుడల్లా కలిసి రండి. అప్పుడే బంధాలు బలపడతాయి.
గొడవలొద్దు... కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి చిన్న వాడిలానే కనిపిస్తాడు. పెళ్లయిన కూడా ఆమెకు పసివాడే. అలాంటి మాతృమూర్తితో మీ భర్తకు సంబంధించి ఏ విషయంలో పోటీ, గొడవ వద్దు. చిన్నప్పటి నుంచి బిడ్డ బాగోగులు చూడటం, తనే ప్రపంచంగా పెంచుకున్న అత్తమ్మను అర్థం చేసుకుని మెలగాలి.
మర్యాద... అత్తగారిని గౌరవించండి. ఆమె వయసుకు, పెద్దరికానికి ఎదురు చెప్పొద్దు. ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండొచ్చు. కుటుంబం, పిల్లల పాలన... ఇలా ఆమె పడిన కష్టాలను తెలుసుకోండి. అత్తగారికి అపార జీవితానుభవం ఉంటుంది. కాబట్టి ముఖ్య విషయాల్లో ఆమె సలహాలు, సూచనలు తీసుకోండి. అవి నచ్చక పోయినా, వాటిని పాటించకపోయినా ఫరవాలేదు.  అయితే పెద్దావిడగా ఆమెకు గౌరవం మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆమె చెప్పేది వినండి. మీకు నచ్చని విషయాలను సమయం, సందర్భం చూసుకుని, సానుకూలంగా సున్నితంగా చెప్పండి. ఆవిడా అర్థం చేసుకుంటారు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని