ఒంటరి పెంపకంలో...
close
Updated : 19/08/2021 12:47 IST

ఒంటరి పెంపకంలో...

అమ్మానాన్నలు వేర్వేరుగా ఉన్నప్పుడో లేదా ఒకరిని కోల్పోయినప్పుడో పిల్లలు రెండో వారి దగ్గరే పెరుగుతారు. ఇలాంటి పిల్లల్లో ఆత్మనూన్యత, భయం ఉంటాయనుకుంటాం. కానీ వారిలో చిన్నప్పటి నుంచి బాధ్యతాయుతమైన గుణాలు పెంపొందుతాయని ‘2019-20 యునైటెడ్‌ నేషన్స్‌ వుమెన్‌’ అధ్యయనం తేల్చింది. మన దేశంలో 4.5 శాతం తల్లి లేదా తండ్రులు ఒంటరిగానే పిల్లలను పెంచుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. మొత్తం 13 మిలియన్ల కుటుంబాలు ఈ తరహాలోనే పిల్లలను పెంచుతున్నాయి.

వ్యక్తిగతంగా

ఇంట్లో ప్రతి విషయాన్నీ తల్లి లేదా తండ్రి ఒక్కరే బాధ్యతాయుతంగా చూసుకోవడం పిల్లలు గుర్తిస్తారు. దాంతో వారికీ ప్రతి విషయంపై అవగాహన పెరుగుతుంది. ప్రతి నెలా అయ్యే ఖర్చు మొదలు వ్యక్తిగతంగా ఎంత డబ్బు అవసరం అనే అంశాల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక ఉండే కష్టాన్ని వారు తెలుసుకుంటారు. కష్టపడే తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తారు. ప్రతి కష్టాన్నీ వారితో పంచుకుంటారు. స్నేహితులుగా మెలిగే తత్వం పిల్లల్లో అలవడుతుంది. పది పన్నెండేళ్లకే తల్లికి సలహా ఇచ్చే స్థాయికి ఎదుగుతారు.

స్ఫూర్తిగా

తల్లి లేదా తండ్రి వద్ద పెరిగే పిల్లలకు వారే స్ఫూర్తి. పెద్దవాళ్లు నిర్వర్తించే బాధ్యతలను గమనిస్తూ, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని తెచ్చుకోవాలి, ఉన్నతస్థాయికెదగాలనే ఆలోచనలు వారికి చిన్నప్పటి నుంచే మొదలవుతాయి. ఇతరులతో స్నేహంగా మెలగడం, ఉన్నదాంట్లో ఎదుటివారికి పంచడం వంటి అలవాట్లను నేర్చుకుంటారు. వీరిలో దయాగుణం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుకున్నట్లుగానే చదువులో ముందంజలో ఉండి, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తారు.

సమస్యకు

ఆర్థికపరమైన లేదా సామాజికపరమైన సమస్యలకు పిల్లలు వెంటనే స్పందిస్తారు. వాటిని పరిష్కరించే దిశగా పెద్దవాళ్లకు ఆలోచన చెప్పే స్థాయికెదుగుతారు. ఎందుకంటే అందులోని సాంద్రతను అనుభవపూర్వకంగా తెలుసుకునే పరిణితి వారిలో ఉంటుంది. వేదన కలిగించే సందర్భాల్లో తల్లికి నేనున్నాననే భరోసా ఇస్తారు. ఆర్థిక ప్రణాళిక వేయడమే కాదు, ఆ దిశగా పొదుపు చేయాలనే ఆలోచన చిన్నప్పుడే పిల్లలకు అలవడుతుంది. ఒంటరిగా తనను పెంచడానికి అమ్మ పడే కష్టాన్ని అర్థం చేసుకుంటూ, దానికి తగినట్లుగా నడుచుకుంటారు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని