బాధ్యత తెలిస్తేనే బంధం పదిలం
close
Published : 19/08/2021 02:57 IST

బాధ్యత తెలిస్తేనే బంధం పదిలం

ఆలుమగలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, పనుల ఒత్తిడి ఇద్దరి మధ్య అలకల్ని, అపార్థాల్ని పెంచుతాయి. ఇలాంటప్పుడు తప్పొప్పులు ఎంచుకోవడం కంటే... బాధ్యత తెలుసుకుని మసలితే మేలంటున్నారు నిపుణులు.

భార్యాభర్తలు ప్రేమాభిమానాలు చూపించుకోవడం ఎంత ముఖ్యమో... ఎవరి బాధ్యతల్ని వారు అర్థం చేసుకోవడమూ అంతే అవసరం. బాధ్యత అనగానే బరువైనదిగా భావించొద్దు. ఇంటి అవసరాలను, కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకోవడమూ బాధ్యతే. ఆలుమగల మధ్య అభద్రత మొదలైతే.... ఇది ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకుని సాగిపోవాలి.

పని ఒత్తిడి మీ జీవన శైలిలో భాగం కావొచ్చు. అలాగని దీర్ఘకాలం ఆ ప్రభావం ఉంటే... ఒకరికొకరు భారంగా మారతారు. అందుకే దాన్ని క్రమబద్ధీకరించుకోండి. పని విభజన చేసుకోండి. ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికాబద్ధంగా అడుగులేయండి. ఇవన్నీ మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి.

ఇంటిపనైనా, ఆఫీసు ఉద్యోగమైనా ఎవరిస్థాయికి వారికి అవి ముఖ్యం అని మరిచిపోకుండా ప్రవర్తించండి. అవతలివారిని తక్కువ చేసి మాట్లాడకండి. మీకు నచ్చినట్లు మీరు ఉండాలనుకుంటున్నట్లే... ఎదుటివారికీ అభిప్రాయాలు ఉంటాయని గుర్తించండి. వాటిని గౌరవిస్తే...సమస్యలు దరిచేరవు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని