మాటలతో.. గాయపరచొద్దు!
close
Published : 02/09/2021 01:04 IST

మాటలతో.. గాయపరచొద్దు!

వివాహబంధం సున్నితమైంది. సంసారమన్నాక చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. అంత మాత్రాన కోపం, ఆవేశం లాంటి వాటిని ఎదుటి వారిపై చూపొద్దు. కోపంలో లేదా హేళనగా మీరనే ఓ చిన్నమాట భాగస్వామి మనసును నొప్పించొచ్చు. ఇది కొనసాగితే మీ బంధం బలహీనమవ్వొచ్చు.

నువ్వు నాకు నచ్చలేదు...
చాలా జంటలు గొడవలు పడ్డప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడుకుంటారు. మీరూ ఆ కోవకి చెందిన వారా.. అయితే ఇప్పటి నుంచైనా అలాంటి మాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాట భాగస్వామి మనసును గాయపరుస్తుంది. ఇదే మీ బంధాన్ని పెళుసుబారుస్తుంది.

నేను లేకపోతే నువ్వేమీ చేయలేవు...

అంటూ కొందరు ఎదుటివారిని తేలిక చేసి మాట్లాడతారు. ఇది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడు నీడగా అడుగులు వేసినప్పుడే ఆ బంధం మరింత దృఢమవుతుంది. కాబట్టి నేను లేకపోతే నువ్వు లేవు... లాంటి భారీ డైలాగులొద్దు. ఏదైనా సందర్భంలో భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటమో లేదా ఆ ప్రదేశం నుంచి కాసేపు దూరంగా వెళ్లడమో చేయాలి. లేదా ఇద్దరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి.

లోపాలు చూపొద్దు...

పెళ్లయిన కొత్తలో ఒకరికొకరు అద్భుతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కొన్నాళ్లకు ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. భాగస్వామి బలాలతోపాటు బలహీనతలనూ అంగీకరించాలి. వాటి నుంచి వారు బయటపడటానికి మీ వంతు సహకారం అందించాలే తప్ప ఎత్తి చూపుతూ కించపరచొద్దు. లోపాలున్నా భాగస్వామికి  గౌరవం, మర్యాద ఇవ్వాల్సిందే.

అన్నింటికీ ఏడుపే...

‘అనే మాటలన్నీ అనేసి చివరకు ఏడుస్తావేంటి’ అంటూ చాలామంది భాగస్వామిపై నిందలేస్తారు. సంతోషాలని అందరూ అందరితో పంచుకుంటారు. అయితే బాధ, దుఃఖం లాంటి వాటిని మాత్రమే మన అనుకున్న వారి దగ్గర ప్రస్తావిస్తాం. అలా మీ పార్ట్‌నర్‌ తన బాధను చెప్పినప్పుడు గొడవ జరిగిన సందర్భంలోనో, మరో సందర్భంలోనో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ హేళన చేయ కూడదు. అది సంస్కారం కాదు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని