బొమ్మల పుస్తకాలతో బోర్‌ కొట్టదు!
close
Published : 27/09/2021 00:42 IST

బొమ్మల పుస్తకాలతో బోర్‌ కొట్టదు!

పిల్లలను చదివించడం, వారితో హోంవర్క్‌లు చేయించడం ఓ పెద్ద ప్రహసనం. చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగించాలన్నా, వాళ్లంతట వాళ్లుగా చదువుకునేలా చేయాలన్నా... ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

బొమ్మల పుస్తకాలతో... మీ చిన్నారి దృష్టిని చదువుపై మళ్లించాలంటే ముందు అది వారి కళ్లను ఆకట్టుకునేలా ఉండాలి. ఇందుకు బొమ్మలు, రంగులు, గ్రాఫిక్స్‌తో ఉన్న కథల పుస్తకాలు ఉపయోగపడతాయి. విషయమూ త్వరగా అర్థమవుతుంది.

ప్రకటనలూ చదివించండి... చదువంటే తరగతికి సంబంధించిన పుస్తకాలే కాదు... పత్రికలు, కథలు, బ్రోచర్‌లు, కార్టాన్స్‌, సైన్‌బోర్డులపై కనిపించేవి ఏవైనా కావొచ్చు. వాటితో మొదలుపెడితే... తమ ఉత్సాహాన్ని ఆపుకోలేరు. అంతేకాదు అప్పుడప్పుడూ ఇతర పిల్లలతో వాటిని వేగంగా ఉచ్ఛరించడం, తప్పులు పట్టుకోవడం వంటి సరదా పోటీలు పెట్టండి. అప్పుడు ఉత్సాహంగా అలవాటు చేసుకుంటారు. పాఠ్యాంశాలనూ సులువుగా ఒంటపట్టించుకుంటారు.

మీరూ వారితో పాటే.... ఏదో ఒక పుస్తకం ఫలానా సమయానికల్లా పూర్తిచేయాలనే నియమం పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడానికి మీతోడు అవసరం. చిన్నారికి కథలను, పాఠ్యాంశాలను వివరించి చెప్పండి. ఉత్సుకతను పెంచే ప్రశ్నలు వేయండి. వారంతట వారు చదువు కొంటుంటే... మీరూ ఓ మంచి పుస్తకం చదవండి. అవి చూసి పిల్లలకు క్రమశిక్షణ, బాధ్యత అలవడతాయి.

లైబ్రరీ ఏర్పాటు.... పిల్లల్లో పఠనాసక్తిని పెంచడానికి వారికి నచ్చే పాత్రలు, కథల పుస్తకాలను సేకరించండి. వారికోసం ఓ చిన్నపాటి లైబ్రరీని ఏర్పాటు చేయండి. అప్పుడప్పుడూ వారిని దగ్గర్లోని గ్రంథాలయానికీ, వారు మెచ్చే బుక్స్‌ కొనుక్కునేందుకు పుస్తకాల షాపునకీ తీసుకెళ్లండి. ఇవన్నీ వారికి ఉత్సాహాన్నిస్తాయి.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని