భాగస్వామిని ఎంచుకోండిలా
close
Published : 05/10/2021 01:02 IST

భాగస్వామిని ఎంచుకోండిలా

కష్టాల సాగరంలో తీరం చేర్చే చుక్కానిలా.. బాధల్లో ఓదార్చే తోబుట్టువులా... సంతోష సమయంలో స్నేహితుడిగా... అన్ని వేళల్లో నీడలా తోడుండే భాగస్వామి కావాలా... అయితే  ఆ వ్యక్తికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసేయండి మరి...

* అభిరుచులు కలిసేలా... ఆహారం, అలవాట్లు, పద్ధతులు... ఇలా చాలా వాటిలో ఒకేలా ఆలోచించే వ్యక్తులు భార్యభర్తలుగా జీవితం ప్రారంభిస్తే కాపురం కలతలు లేకుండా చక్కగా సాగిపోతుంది. కాబట్టి మీలాంటి అభిరుచులున్న వ్యక్తిని ఎంచుకోండి.

* మర్యాద... మీ కలలు, లక్ష్యాలను పట్టించుకోని వ్యక్తితో జీవితాన్ని గడప లేరు. అలాంటి వ్యక్తి అయితే ఇద్దరికీ సంతోషం ఉండదు.

* నమ్మకం..  ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ వివాహ బంధం చక్కగా కొనసాగుతుంది. నమ్మకం లేకపోతే కొన్నాళ్లకే ఆ బంధం విచ్ఛిన్నమవ్వొచ్చు.

* అర్థం చేసుకునే వ్యక్తి.. వందేళ్ల ప్రయాణంలో తోడుగా ఉండాల్సిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాబట్టి ఓసారి అతడితో కాసేపు కూర్చోని మీ అభిరుచులు, ఇష్టాఇష్టాలు, లక్ష్యాలు, బాధ్యతలు చెప్పి చూడండి. అతడి ప్రతిస్పందన ఎలా ఉందో గమనించండి. సానుకూలంగా స్పందిస్తే ఏడడుగులు వేయడానికి సిద్ధమవ్వండి.

* హాస్యస్ఫూర్తి... సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉన్న వ్యక్తిని పెళ్లాడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా తనతో ఆనందంగా సాగగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో అతడెలాంటి వాడో ఆరా తీయండి.


Advertisement

Tags :

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని