కోప్పడొద్దు!
close
Published : 18/10/2021 00:58 IST

కోప్పడొద్దు!

పిల్లలు ఎదిగే తీరు, ఆలోచనా విధానం వంటివన్నీ ఇంటి వాతావరణంపై  ఆధారపడతాయి. ముఖ్యం పెద్దల కోపం... వారిపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తుందంటున్నారు మానసిక వైద్యులు. అలాకాకూడదంటే...

* నిశ్శబ్దంగా... అల్లరి, నచ్చని పనులు చేయడం వంటివి పెద్దల కోపానికి కారణమవుతాయి. పిల్లల్ని నియంత్రించలేనప్పుడు వారిపై చేయి చేసుకోవడం, దూషించడం చేస్తారు. కొందరు చిన్నారుల్లో ఇది తీవ్ర ఆత్మనూన్యతకు దారితీస్తే, మరికొందరిని మొండికేసేలా చేస్తుంది. ఇలాంటి ప్రతికూల ప్రభావం వారిపై పడకూడదంటే కాసేపు మీరు మౌనంగా ఉండటమే మేలు.

* వాదనొద్దు... కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద అరవడమే కాదు. వారి ప్రవర్తనకు ‘నువ్వంటే నువ్వే కారణం’ అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఒకరికి తెలియకుండా మరొకరు గారాబం చేయడం లేదా అతిగా నియంత్రించడం చేస్తారు. ఫలితంగా ఇటువంటి వాతావరణంలో పెరిగే పిల్లలు కూడా అదే తీరుని అలవరుచుకుంటారు. భావోద్వేగాల్ని నియంత్రించుకోలేరు. కొన్నిసార్లు పెద్దవాళ్లపై ఎదురు తిరగడం, లేదా తమను తామే హింసించుకోవడం వంటివీ చేసే ప్రమాదముంది. బిడ్డల విషయంలో ముందు తమ తీరుని మార్చుకోవడం తల్లిదండ్రులకు ఎంతైనా అవసరం.

* నియంత్రించుకోండిలా... ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలు సహజం. కాకపోతే అవి మన మనసు చెప్పినట్లు వినాలి. లేదంటే తప్పనిసరిగా వాటిని నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి ఆచరించాలి. అలా జరగకపోతే...తీవ్ర అనారోగ్యాలకు దారి తీయడమే కాదు...మీ పిల్లలూ దారి తప్పేలా చేస్తుంది. అందుకే మీరు కోపాన్ని అదుపు చేసుకుంటే...దాన్నే వారూ అనుసరిస్తారు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని