స్నేహానికి కేరాఫ్‌ అడ్రెస్‌
close
Published : 26/10/2021 01:35 IST

స్నేహానికి కేరాఫ్‌ అడ్రెస్‌

అమ్మా నాన్నా, జీవిత భాగస్వామి, తోడబుట్టిన వాళ్లు, స్నేహితులు.. ఇలా మన జీవితంలో ఎందరెందరో ఉంటారు. కానీ అందరితో అన్ని విషయాలూ చెప్పుకోలేం. మనసు లోతుల్లోని బాధను దాపరికం లేకుండా పంచుకోవాలన్నా, సినిమాలూ షికార్ల గురించి హాయిగా జోకులేసుకోవాలన్నా అందుకు అనువైన వాళ్లు కచ్చితంగా కజిన్సే. ఎందుకంటే...

రీ రక్తసంబంధీకులు లేదా పూర్తి బయటివాళ్లతో కొన్ని కొన్ని సంగతులు ముచ్చటించడానికి జంకుతాం. అదే పెద్దమ్మ, చిన్నమ్మ, మావయ్యల పిల్లలతో ఏదైనా బాహాటంగా చెప్పగలం, నిర్మొహమాటంగా చర్చించగలం.

* చిన్నతనం నుంచీ కలుస్తూ ఉంటారు కనుక అనుబంధం బలపడుతుంది. వీళ్లతో పంచుకుంటే ఆనందాలు రెట్టింపవుతాయి, ఆందోళనలు మటు మాయమవుతాయి. కజిన్లు స్నేహానికి కేరాఫ్‌ అడ్రెస్‌ అంటే అతిశయం కాదు.

* ఇంటిసభ్యుల్లో ఉన్న లోపాలు లేదా వాళ్లతో ఉన్న విభేదాల గురించి మనసు విప్పి మాట్లాడగలం. కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కజిన్లు మధ్యవర్తిత్వం నెరపగలరు.

* ఇద్దరికీ ఇరు కుటుంబాల గురించీ తెలుసు కనుక మీలో ఏమైనా వ్యత్యాసాలున్నా, వాళ్లలో ఏమైనా అవలక్షణాలున్నా అర్థం చేసుకోగలుగుతారు.

* ఫ్యామిలీ ఫంక్షన్లలో అందరి కంటే మిన్నగా మిమ్మల్ని ఆదరించేది కజిన్సే. కుటుంబ అనుబంధాలు కనుక పెళ్లిళ్లయినా ప్రేమగా రాకపోకలు సాగిస్తారు.

* కలిసినప్పుడల్లా ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. ఆ ఆనందంతో అలసటలు దూరమై రీచార్జ్‌ అవుతారు. కాదంటారా?


Advertisement


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని