మనకోసం మళ్లీ మట్టిళ్లు!
close
Published : 05/06/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనకోసం మళ్లీ మట్టిళ్లు!

సొంత ఇల్లు.. ఎంతోమంది కల. దీని కోసం ఎంతో ఖర్చుపెడుతుంటారు. ఆకర్షించే రంగులు, సామాగ్రి, ఫర్నిచర్‌తో అలంకరించేస్తారు. అంత పొందికగా కట్టుకున్నది మన ఆయువుకే ప్రమాదమైతే?
ఇదే ఆలోచనొచ్చింది షగున్‌ సింగ్‌కి! దీంతో ఎంఎన్‌సీ ఉద్యోగానికి స్వస్తి చెప్పి మరీ పర్యావరణహిత ఇళ్లపై దృష్టిపెట్టింది. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. వ్యవసాయ వ్యర్థాలు, మట్టి, ఆవుపేడ, లైమ్‌లతో వీటిని నిర్మిస్తోంది. ‘గీలీ మట్టి’ పేరిట ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి నిర్మాణంతోపాటు ఏటా 120 మందిని ఎంపిక చేసి తయారీలో శిక్షణనూ ఇస్తోంది. వీటిని చూడాలనుందా? అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ దగ్గర మహ్రోరా గ్రామానికి వెళ్లాల్సిందే. అన్నట్టూ ఆధునిక సౌకర్యాలన్నీ వీటిలోనూ ఉంటాయి. రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయి.
ఈ ఇళ్లు స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు భూకంపాలకూ దీటుగా నిలుస్తున్నాయట. ఇందుకోసం ఎర్త్‌ బ్యాగ్‌ అనే ప్రత్యేక టెక్నిక్‌ను ఉపయోగించడమే ఇందుకు కారణం.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని