తాతమ్మల సామగ్రికి ఎనలేని గిరాకీ
close
Updated : 23/06/2021 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాతమ్మల సామగ్రికి ఎనలేని గిరాకీ

సంప్రదాయాల్ని పాత చింతకాయ పచ్చడంటూ తీసిపడేస్తారు కొందరు. కానీ తాతలనాటి వస్తువులు అమూల్యమని నమ్మిన కార్పొరేట్‌ ఉద్యోగినులు లాభాలపంట పండిస్తున్నారు...
మీరా రామకృష్ణన్‌, వారిష్ట సంపత్‌లు కార్పొరేట్‌ రంగంలో ఇరవయ్యేళ్లకు పైగా పనిచేశారు. ఇద్దరూ కొలీగ్స్‌, మంచి స్నేహితులు కూడా. ఉద్యోగం యాంత్రికంగా అనిపించడంతో వ్యాపారం చేయాలనుకున్నారు. వాళ్లకి మరో ఉద్యోగి ఆర్చిష్‌ మాథే మాధవన్‌ తోడయ్యాడు. బాగా ఆలోచించాక... ఇళ్లల్లో ఉపయోగపడేది, గ్రామీణ కళాకారులకు మేలు చేసే వ్యాపారం బాగుంటుందనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ‘జిష్టా’. అందులో ఇనుము, ఇత్తడి, మట్టి, రాయి, చెక్కల్లాంటి సహజ ధాతువులతో తయారయ్యే చట్టి, తెపాళా, పెనం, కత్తి లాంటి ప్రాచీన వంటసామాన్లెన్నో.  

ఇప్పుడు ‘జిష్టా’ కోసం 450 మంది కళాకారులు పని చేస్తున్నారు. 300 రకాల పాత్రలు తయారవు తున్నాయి. 90 వేల మంది కస్టమర్లున్నారు. దీని వెనుక మీరా, వారిష్టల కృషి చాలానే ఉంది. ఆర్నెల్లపాటు ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఏమేం సాధనాలు ఉండేవో తెలిశాక వాటి నేర్పరులు తమిళనాడులో ఉంటారని తెలిసి కుంబకోణం లాంటి ఊళ్లలో గాలించారు. ఒకప్పుడలాంటి పాత్రలకు పట్టం కట్టిన మాట నిజమైనా ఇప్పుడు గిరాకీ లేక మరేవో వృత్తులు చేపట్టారని తెలిసింది. మహారాష్ట్రలో శివాజీ మహారాజుకు ఆయుధాలు తయారుచేసిన కుటుంబం ప్రస్తుతం అలనాటి వంటపాత్రలు తయారు చేస్తోంది. అలా తెలంగాణ, గుజరాత్‌, మణిపూర్‌ లాంటి 14 రాష్ట్రాలు తిరిగారు. అతి కష్టం మీద కొందరు నేర్పరులను దొరికించుకున్నారు. దక్షిణాది వాళ్లకి కాఫీ ప్రాణం కనుక ముందుగా ఇత్తడి కాఫీఫిల్టర్‌ చేసివ్వమని అడిగారు. కానీ ఆ కళ పదేళ్ల క్రితమే అంతరించిందని, అరుదుగా వాడుతున్న ఇత్తడి పాత్రలు యూపీ నుంచి దిగుమతి అవుతున్నాయనీ తెలిసింది. అవీ చేత్తో తయారైనవి కావు. ఇక తమిళనాడు సెంగొట్టాయ్‌ దోశల పెనాలకు ప్రసిద్ధని అక్కడికెళ్లారు. అదృష్టవశాత్తూ ఒక కుటుంబం ఇంకా ఆ పనిలోనే ఉంది. ఒక పెనం తయారీకి అక్షరాలా ఐదున్నర గంటలు పట్టడం చూశారు. చేత్తో తయారయ్యే పనిముట్లు కష్టమైనప్పటికీ ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా రుజువైంది. ఇనుప పాత్రలో వండితే శరీరానికి అవసరమైన ఐరన్‌ అందుతుంది. మట్టి, రాయి, రాగి పాత్రలూ అంతే. ఆయా పాత్రలు ఎక్కువ సంఖ్యలో కావాలంటే ‘అవి అమ్ముడుపోవు, ఖర్చూ శ్రమా రెండూ దండగే’ అన్నారు. వాళ్లని ఒప్పించలేక వేరే వేరే ఊళ్లు తిరిగి మళ్లీమళ్లీ కొన్నారు. అవన్నీ అమ్మి చూపి, వాటికింకా మార్కెట్‌ ఉందని చెప్పాలనుకున్నారు. అమ్మకానికి పెట్టేముందు పాదరసం లాంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయేమో తెలుసుకునేందుకు ప్రయోగశాలకు పంపారు. ‘మేం ఉపయోగించడానికి ఇష్టపడని వాటిని అమ్మదలచుకోలేదు. ఇప్పటికీ ప్రతి పాత్రనీ పరీక్షించిన తర్వాతే వెబ్‌సైట్‌లో పెట్టి ఎలా వాడాలో గైడ్‌లైన్స్‌ ఇస్తాం’ అంటుంది మీరా.

2016లో జిష్టా మొదలైనప్పుడు కుటుంబ సభ్యుల గ్యారేజ్‌నే ఆఫీసుగా చేసుకున్నారు. పాత్రలు నిలవుంచేదీ, ప్యాక్‌ చేసేదీ అక్కడే. ఊహించని విధంగా తెచ్చిన పాత్రలన్నీ మొదటి రోజే అమ్ముడైపోవడంతో ఆనందంతో తబ్బిబ్బయ్యారు. మర్నాడే మళ్లీ ఊళ్లకు బయల్దేరారు. కొద్ది కాలంలోనే దేశంలో వివిధప్రాంతాల నుంచేగాక అమెరికా, కెనడా, అరబ్‌ దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఈ వస్తువులకున్న గిరాకీ చూసి కళాకారుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరింత సదుపాయంగా, కళాత్మకంగా తయారు చేస్తున్నారు.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని