పారిపోయిన అమ్మాయి.. ప్యారిస్‌లో పోటీ పడుతోంది!
close
Updated : 24/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారిపోయిన అమ్మాయి.. ప్యారిస్‌లో పోటీ పడుతోంది!

ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌.. ప్రపంచవ్యాప్త ఫ్యాషన్‌ డిజైనర్ల కలల వేదిక. తమ డిజైన్లను అక్కడ ప్రదర్శించడం గౌరవంగా భావిస్తుంటారు. అలాంటిది దాని నిర్వాహకుల నుంచే స్వయంగా ఆహ్వానం అందుకుంది వైశాలి. మన దేశం నుంచి ఆ అవకాశం అందుకున్న మొదటి మహిళా డిజైనర్‌గానూ నిలిచింది. చదువు కోసం ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి.. పెద్ద ఫ్యాషన్‌ బ్రాండ్‌లతో పోటీపడే స్థాయికి ఎలా ఎదిగిందో చూడండి!

వైశాలి షాదన్‌గుల్‌ది సంప్రదాయ కుటుంబం. అమ్మాయిలకు చాలా కట్టుబాట్లుండేవి. స్కూలు మినహా గుమ్మం దాటనిచ్చేవారు కాదు. బాల్య వివాహాలు సాధారణం. కానీ ఆమెకేమో చదువుకోవాలనుండేది. ఎనిమిదో తరగతిలోనే పెళ్లి ప్రస్తావన ప్రారంభమైంది. చదువుకుంటానని గోల చేయడంతో చేసేదేమీ లేక సరేనన్నారు. ఎలాగోలా డిగ్రీకైతే చేరింది. కానీ ఇంట్లో వాళ్లని ఆపడం ఇక ఆమె వల్ల కాలేదు. ఈమెది మధ్యప్రదేశ్‌లోని విదిశ. 18 ఏళ్ల వయసులో ఓరోజు రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. రైల్వేస్టేషన్‌లో మొదట వచ్చిన రైలు ఎక్కేసింది. ముంబయి చేరుకుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఒంటి మీదవి మినహా వేరే దుస్తులూ లేవు. స్నేహితులెవరూ ఆదుకోలేదు. చివరగా ఒకరి సాయంతో హాస్టల్‌లో చేరింది. సాయంత్రాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది.

వైశాలి బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదివింది. మొదట్నుంచీ డిజైనింగ్‌ ఆలోచనలేమీ లేవామెకు. తక్కువ ఖర్చుతో హుందాగా కనిపించే ఆమెకు తరగతిలో అందరూ ఆకర్షితులయ్యే వారు. దుస్తుల ఎంపిక, మెటీరియల్‌, కుట్టించుకోవడంలో సలహాలు కోరే వారు. నచ్చిన వారు ఎంతో కొంత ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటికీ దీన్ని అదనపు ఆదాయంగానే చూసింది. డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం చూసుకోవడం ఆమె లక్ష్యం. పూర్తయ్యాక ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుపై ఆసక్తి కలిగి, అందులో చేరింది. తర్వాత ఫీజు కట్టలేక మానేసింది. ప్రాథమిక అంశాలపై పట్టు రావడంతో తెలిసినవారి సాయంతో ఓ విశ్వవిద్యాలయ పుస్తకాలను తెప్పించుకుని చదివేది. డిజైనింగ్‌ సాధన చేసేది. ఇవన్నీ సరదాగానే చేసింది.

జిమ్‌ ట్రైనర్‌గా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూనే డిజైనింగ్‌ పోర్ట్‌ఫోలియోలు తయారు చేసుకుంది. అక్కడికొచ్చే వారికి దుస్తుల విషయంలో సలహాలు, సూచనలిచ్చేది. అవి వారికి నచ్చేవి. అప్పుడు ఈ రంగమే తన కెరియర్‌ అన్న నిర్ణయానికొచ్చింది. వాళ్లకే దుస్తులు డిజైన్‌ చేసివ్వడం మొదలుపెట్టింది. తర్వాత బ్యాంకు రుణం తీసుకుని బొతిక్‌ను ప్రారంభించింది. ఆర్డర్లు పెరిగే కొద్దీ కొందరు సిబ్బందిని నియమించుకుంది. 2011లో విల్స్‌ ఇండియా లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ వీక్‌ తన కెరియర్‌ను మలుపు తిప్పింది. ‘వైశాలీ ఎస్‌’ పేరిట సొంత లేబుల్‌ను తయారు చేసుకునేలా ప్రోత్సహించింది. తను ముంబయికి వచ్చినపుడు సాయం చేసిన స్నేహితుడు ప్రదీప్‌ షందన్‌గుల్‌నే పెళ్లి చేసుకుంది. వీరికో పాప. తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి దిల్లీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరింది. పాప సంరక్షణ భర్తనే చూసుకునేవాడు. వ్యాపారం, కుటుంబం, చదువు ఆటంకం కలగకుండా దిల్లీ, ముంబయిల మధ్య ప్రయాణం కొనసాగించేది.

దుస్తుల తయారీకి చందేరి, ఇతర రాష్ట్రాల నేత వస్త్రాలనే ఉపయోగిస్తుంది. సస్టెయినబిలిటీకి ప్రాధాన్యమిస్తుంది. ఇవే తనను ప్రత్యేకంగా నిలిపాయంటుంది వైశాలి. న్యూయార్క్‌, లాక్మే సహా ఎన్నో ప్రముఖ ఫ్యాషన్‌ షోల్లో తన డిజైన్లను ప్రదర్శించి, ప్రస్తుతం ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. చానెల్‌, వాలెంటీనో, డియోర్‌ వంటి అగ్ర సంస్థల ప్రతినిధుల సరసన నిలవనుంది. దేశం నుంచి ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకూ దీనిలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ‘నిజానికి మనవాళ్ల నైపుణ్యం ఇక్కడ ఎప్పుడో ప్రదర్శితమైంది. వేరే డిజైనర్ల కోసం పని చేయడంతో వారికి తెరమీదకొచ్చే అవకాశం కలగలేదు. నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన చేనేత గొప్పదనాన్నీ, అందాల్నీ ప్రపంచానికి సగర్వంగా చూపించాలనుకుంటున్నా’ అంటోంది 41 ఏళ్ల వైశాలి. ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!


మంచిమాట

మీ ప్రజ్ఞాపాటవాలు, ప్రేమ, దయ ఎప్పటికీ మిమ్మల్ని విఫలం కానివ్వవు. ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యాన్ని అలవరచుకోవాలే తప్ప మనసు కానీ మెదడు కానీ బీటలు పడకుండా చూసుకోవాలి.

- మన్‌మీత్‌ వోహ్రా, బ్రాండ్‌ కన్సల్టెంట్‌మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని