ఆమెది దివ్యమైనభరోసా!
close
Updated : 26/06/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమెది దివ్యమైనభరోసా!

ఇంట్లో ఆమెకో సమస్య ఎదురైంది. కోరకుండానే సాయం అందింది. మరి సాయం పొందలేని వారి పరిస్థితేంటని ఆలోచించింది. అప్పుడు తట్టిన పరిష్కారం ఆమెను ఆంత్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. సర్‌తజ్‌ లంబా.. బడ్డీ క్యాబ్స్‌ అంతగా ప్రాచుర్యం పొందడానికి కారణమేంటి?

గత డిసెంబరు చలి కాలం, మంచు విపరీతంగా పడుతోంది. 82 ఏళ్ల ముసలావిడను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆమె నడవలేదు. పైగా రాత్రి. వాళ్లు బడ్డీ క్యాబ్స్‌ను సంప్రదించారు. వాళ్లు ఆమెను సురక్షితంగా ఆసుపత్రిలో చేర్చారు. క్యాబ్‌ సర్వీస్‌.. బుక్‌ చేసుకుంటే ఎవరైనా చేసేదే! దీనిలో కొత్తేముంది అనిపిస్తోందా? కానీ ఉంది. ఇది అంగవైకల్యం ఉన్నవారు, కదల్లేని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబ్‌ సర్వీస్‌.

గత ఏడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఆసుపత్రులకు, బయటకు వెళ్లడానికి ఎంతోమంది ఇబ్బందిపడ్డారు. ఇక అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధుల సంగతి చెప్పనక్కర్లేదు. వీటికి సమాధానంగానే సర్‌తజ్‌ లంబా ‘బడ్డీ క్యాబ్‌’లను ప్రారంభించింది. చండీగఢ్‌కు చెందిన ఈమె తండ్రి ఏర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌. భర్త ఆర్మీ ఆఫీసర్‌. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేది. ఆర్మీ వైవ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఏడబ్ల్యూడబ్ల్యూఏ)లో చేరి, వాలంటరింగ్‌, నిధులు సేకరించడం వంటివి చేసేది. వాటిని పేదలకు, అవసరమైనవారికి అందజేసేది.

ఆడవాళ్లకు ఉపాధి అందించాన్న ఉద్దేశంతో ఏజే ట్రావెల్స్‌ను ప్రారంభించింది. ఇది పర్యాటకం, రవాణా సేవల సంస్థ. ఓసారి తన మామగారికి పార్కిన్‌సన్‌ వ్యాధి సోకింది. చికిత్స కోసం తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. చుట్టూ ఆర్మీ వాళ్లే అవడంతో ఎవరో ఒకరు అడగకుండానే సాయానికి వచ్చేవారు. అయినా ఒక్కోసారి ఇబ్బంది అవుతుండేది. ‘ఇంతమంది సాయానికి వస్తున్నా పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఆ అవకాశమే లేని వారి పరిస్థితేంట’న్న ఆలోచన సర్‌తజ్‌ను తొలిచివేసేది. దాని ఫలితమే బడ్డీ క్యాబ్స్‌. ఆర్మీ వాళ్లలో ‘అన్నదమ్ముల్లా కలిసి పోరాడటం’ అన్న స్ఫూర్తి ఆధారంగా తన వెంచర్‌కు ఆ పేరు పెట్టింది.

దీనిలో వీల్‌చైర్‌ ఆధారంగా వారిని తీసుకెళ్లే వీలుంటుంది. అందుకు తగ్గట్టుగా వాహనాల్లో మార్పులు చేయించింది. విశ్రాంత సైనికోద్యోగుల్ని నియమించుకుంది. డ్రైవింగ్‌తో పాటు భద్రతా ప్రమాణాలు, సాఫ్ట్‌స్కిల్స్‌లో వారికి శిక్షణనిస్తుంది. వైకల్యం ఉన్నవారు, వృద్ధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలనూ నేర్పిస్తుంది. వీళ్లు కేవలం రవాణాకే పరిమితం కారు, అవసరమైన సాయాన్నీ అందిస్తారు. ఈ సేవలు ప్రస్తుతం ఉత్తర భారత దేశ రాష్ట్రాలన్నింటా లభిస్తున్నాయి. సేవలు అవసరమైన వారు యాప్‌లో సంప్రదిస్తే సరిపోతుంది. తరచూ ఆసుపత్రులకు వెళ్లే వారి కోసం మెంబర్‌షిప్‌నీ ప్రవేశపెట్టింది. ప్రతి క్యాబ్‌నూ రోజూ రోడ్డు మీదకువెళ్లేముందు 20 రకాల పరీక్షలు చేస్తారు. అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే అనుమతిస్తారు. చిన్న నుంచి పెద్దవాళ్ల అభిరుచికి తగ్గట్టుగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను క్యాబ్‌ల్లో సిద్ధం చేసింది.

‘ప్రస్తుతం తరచూ ప్రయాణ అవసరం ఉన్న 1500 - 2000 మంది మా సేవలను పొందుతున్నారు. క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్‌తోపాటు నిరంతరం అందుబాటులో ఉండటం మమ్మల్ని వారికి చేరువ చేస్తోంది. అంగవైకల్యం ఉన్నవారు, నిస్సహాయులు ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతుంటే ‘అయ్యో’ అనడమో, వినడమో చేస్తుంటాం. కానీ వారికి కావాల్సింది అది కాదు, మరొకరిపై ఆధార పడకుండా ఉండే స్వతంత్రత. దాన్ని వాళ్లకి ఇలా అందించే ప్రయత్నం చేస్తున్నా’ అంటోంది సర్‌తజ్‌.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని