అన్నార్తుల ఆకలి తీర్చింది అన్వి...
close
Updated : 27/06/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నార్తుల ఆకలి తీర్చింది అన్వి...

తేడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు పనుల్లేక వలసకార్మికులు సొంతూర్లకు ప్రయాణమవడం చూసింది అన్వి. అప్పుడామె డిగ్రీ మూడో ఏడాది చదువుతోంది. ఆ సమయంలో ఆకలితో అలమటించిన వారి గురించి వార్తల్లో చదివింది. వారికి సాయం చేయాలనుకుంది. తాను చదివిన విద్యాసంస్థ ప్రిన్స్‌పల్‌ను కలుసుకుని సాయాన్ని కోరింది. కొద్ది రోజుల్లోనే రూ.1.50 లక్షల సేకరించగలిగింది. పప్పు, బియ్యం, ఉప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులతో మూడు వేల కేజీల రేషన్‌ కిట్్సను తయారు చేయించింది. వలస కూలీల కుటుంబాలకు వాటిని పంపిణీ చేసింది. అందులో తన స్నేహితుల ప్రోత్సాహమెంతో ఉంది అని చెబుతుంది అన్వి. ‘రేషన్‌ స్క్వేర్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను చేసిన సాయాన్ని మరికొందరు విద్యార్థులు తెలుసుకున్నారు. మరో 30 మంది నాతో చేయి కలిపారు. విరాళాలు కూడా పెరిగాయి. రెండోసారి రూ.5లక్షలు రాగా, 10వేల కేజీల రేషన్‌కిట్స్‌ తయారు చేసి అవసరంలో ఉన్న వారికి పంపిణీ చేయగలిగాం. అంతా సద్దుమణిగింది అనుకునే దాన్ని. అనుకోకుండా కొవిడ్‌ రెండోసారి విరుచుకుపడింది. ఈసారి సరైన సమయంలో చికిత్స అందక పేదలెందరో ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈసారి మరొక దిశగా సేవలందించాలనుకున్నా. ‘మెర్సీ మిషన్‌’ అనే ఎన్జీవోతో కలిసి ఈ ఏడాది విరాళాలను సేకరించాం. వచ్చిన నగదుతో ఆక్సిజన్‌ సిలిండర్స్‌, అంబులెన్స్‌ సేవలు, కొవిడ్‌ బాధితులకు చికిత్సను అందించేలా చేశాం. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మా రేషన్‌స్క్వేర్‌ సాయంతో ఎందరో పేద రోగులు చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు. ఇది మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి మాకు ఎక్కువగా విరాళాలు కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచే అందాయి. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. నేను పై చదువుల కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. నేనిక్కడ ఉన్నంత కాలం ఈ సేవలను కొనసాగిస్తా. విదేశానికి వెళ్లేముందు ఈ ఎన్జీవో బాధ్యతలను నా స్నేహితులకు అప్పగిస్తా. అక్కడ నుంచి కూడా నేనేం చేయగలనా అన్నది ఆలోచిస్తా’ అని చెబుతోంది అన్వి.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని