నక్కకోసం బావిలో దిగా...
close
Updated : 28/06/2021 06:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నక్కకోసం బావిలో దిగా...

గుండు సూది గుచ్చుకున్నా...అమ్మా అంటాం! ఒంట్లో కాస్త వేడిగా ఉంటే... జ్వరమని కంగారు పడతాం! చిన్న గాయమైతే... ఆసుపత్రికి పరుగెడతాం. టీటీ ఇంజెక్షన్లు.. ఇతరత్రా మందులెన్నో వాడేస్తాం!  మరి పశుపక్ష్యాదుల పరిస్థితి...  అనారోగ్యాలూ, అనుకోని ప్రమాదాలు వాటికీ ఎదురవుతాయి. అందుకే వాటి పరిస్థితిని అమ్మలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందో అమ్మాయి. అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తోంది. అంతేనా... వాటి సంరక్షణ విషయంలో ప్రజల్లో చైతన్యం తేవడం కోసం 22 గ్రామాల్లో పాదయాత్ర కూడా చేసింది. ఆమే మహబూబాబాద్‌కి చెందిన 21 ఏళ్ల మహ్మద్‌ సుమ. ఆ వివరాలేంటో తన మాటల్లోనే...

బాధ, ప్రాణభయం... వంటివన్నీ మనుషులకే కాదు... జంతువులకూ ఉంటాయని నాకు చిన్నతనంలోనే అర్థమైంది. మూగజీవాలపై ప్రేమ అమ్మ సలీమా, నాన్న సుభానీల నుంచే వచ్చిందేమో! వారు పక్షులు, జంతువులకు ఆహారం పెట్టడం, దెబ్బలవీ తగిలితే సపర్యలు చేయడం వంటివి చేసేవారు. వారిని చూస్తూ పెరిగాను. అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. బడి నుంచి వస్తుంటే... దారిలో ఓ పంది పిల్ల మురుగు కాలువలో పడిపోయింది. నేను దిగి దాన్ని బయటకు తీశాను. అయితే ఒళ్లంతా బురదతో ఇంటికి వెళ్లా. అమ్మానాన్నలు ఏమంటారోనని భయపడ్డా. వాళ్లు ఏమీ అనలేదు సరికదా! మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎక్కడ ఏ జంతువు, పక్షీ బాధపడుతున్నాయని తెలిసినా వెళ్లకుండా ఉండలేకపోయేదాన్ని. అలా ఇప్పటివరకూ 120కిపైగా మూగజీవాల్ని రక్షించా. వాటిల్లో కోతులు, కుక్కలు ఎక్కువ. లేగదూడలు, కొండచిలువల వంటివీ ఉన్నాయి.  

కోతికి ఊపిరందించా...  కోతుల బెడద తప్పించుకునేందుకు మా ఊళ్లో కొందరు ఇంటి చుట్టూ వలల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో చిక్కుకున్న ఓ కోతి పిల్ల అపస్మారక స్థితికి చేరుకుంది. చనిపోయిందనుకున్నా. చివరి ప్రయత్నంగా నోట్లో నోరు పెట్టి గాలి ఊదా. అప్పుడు తేరుకుందది. ఓసారి నక్క పిల్ల దిగుడు బావిలో పడిపోయింది. ఊళ్లోవాళ్లెవరూ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దాంతో 40 అడుగుల బావిలోకి నడుముకి తాడు కట్టుకుని దిగా. అది చూసి చాలామంది ఆడపిల్లవి ఎందుకమ్మా నీకివి అన్నారు. అవేవీ నేను పట్టించుకోలేదు. మరోసారి ఓ లేగదూడ బావిలో పడింది. ఓ జేసీబీ డ్రైవర్ని బతిమాలి, దాని ముందు భాగంలోని బకెట్‌లో కూర్చొని బావిలోకి వెళ్లి దానిని రక్షించాను. మూగజీవాల కోసం ఇలాంటి సాహసాలు చాలానే చేశాను.

ఫోన్‌ చేసిన వెంటనే...  మూగజీవాలు ప్రమాదంలో ఉన్నాయని ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే వెళ్లిపోతా. వాటికి ప్రథమ చికిత్స  చేస్తా. అవసరమైతే పశువైద్యశాలకు తీసుకెళ్తా. జంతువుల కోసం మా ఇంటి దగ్గర  ప్రత్యేకంగా ఓ షెడ్‌ని ఏర్పాటు చేశాం. అనారోగ్యంతో ఉన్న, ప్రమాదంలో గాయపడ్డ కుక్కలను కొందరు మా ఇంటి ముందు వదిలి వెళ్తారు. ఆరు నెలల కిందట ఒకతను ఒంటి నిండా పుండ్లతో ఉన్న కుక్క పిల్లను తెచ్చి ఇచ్చాడు. దానిని గోనె సంచిలో చుట్టుకుని పశువైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించాను. ఒకసారి దాని పొట్ట మొత్తం పగిలినట్లు గాయమైంది. అప్పుడు పశువైద్యులు కొద్ది రోజులు వైద్యం చేసి, ఒక రోజు అది బతకదు.. చనిపోవడానికి ఇంజెక్షన్‌ ఇద్దామన్నారు. నేను ఒప్పుకోలేదు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి యాంటిబయాటిక్‌ మందులను ఇచ్చా. నెలన్నర పాటు రోజూ డ్రెస్సింగ్‌ చేశా. అది ఇప్పుడు మా ఇంట్లో సభ్యురాల్లా హాయిగా తిరుగుతోంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ రోడ్లపై ఉన్న కుక్కలు, ఆవులకు ఆహారం పెట్టేదాన్ని. ఇవేకాదు... పశుసంరక్షణ, 1962 టోల్‌ఫ్రీ నంబరు, సంచార పశు వైద్య వాహనాల గురించి మా చుట్టుపక్కల 22 గ్రామాల్లో పాదయాత్ర చేసి మరీ అవగాహన కల్పించా. ఆ శ్రమకే తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నా.

తిరుమలలో అన్నమయ్య కీర్తన ఆలపించాలని

ఇంటర్‌ పూర్తి చేసిన నాకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. అన్నమయ్య కీర్తనలంటే ఎంతో మక్కువ. వాటిని నేర్చుకుని ఒక కీర్తననైనా తిరుమలలో ఆలపించాలనేది నా కోరిక. ఇందుకోసం
గతేడాది నుంచి ఖమ్మంలోని సుబ్రహ్మణ్యం అనే గురువు సంగీతం దగ్గర నేర్చుకుంటున్నా.    

- బొల్లం శేఖర్‌, మహబూబాబాద్‌

మంచిమాట

మెదడుకు గేటు, బోల్టు, తాళం.. ఏదీ లేదు. కాబట్టి మీ స్వేచ్ఛను   ఎవరూ బంధించలేరు, హరించలేరు. 

- వర్జీనియా ఊల్ఫ్‌, ఆంగ్ల రచయిత్రి


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని