వయసే చిన్నది.. ఆశయం కాదు!
close
Updated : 05/07/2021 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వయసే చిన్నది.. ఆశయం కాదు!

నెలసరి, ఆ సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి ప్రస్తావించడమే తప్పుగా భావిస్తుంటారు. కానీ ఓ 20 ఏళ్ల అమ్మాయి వీటిపై అవగాహన కల్పించడమే కాకుండా ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులనూ అందిస్తోంది. ఇందుకోసం రుతుచక్ర పేరిట ఓ ఎన్‌జీఓనే ఏర్పాటు చేసింది. ఆమే సంజనా దీక్షిత్‌.

న పదహారో పుట్టినరోజును ఓ ఎన్‌జీఓలో నిర్వహించుకోవడానికి వెళ్లింది సంజనా దీక్షిత్‌. అక్కడ అపరిశుభ్రంగా ఉన్న టాయ్‌లెట్‌లు, నిర్వహణ సరిగా లేని గదులు చూసి షాక్‌కు గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలా జీవించగలుగుతారని తీవ్ర ఆవేదనకు లోనైంది. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు నెలసరి రోజుల్లో స్కూలు, కాలేజ్‌లకు దూరమవ్వడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మూఢనమ్మకాలు వంటి విషయాలపై వార్తాపత్రికలో కథనం చదివాక ఈ విషయాలపై యువతులకు అవగాహన కల్పించాలనుకుంది. మొదట తను వెళ్లిన ఎన్‌జీఓకే వెళ్లి నిర్వాహకులతో మాట్లాడి, అక్కడి అమ్మాయిలకు అవసరమైన శానిటరీ న్యాప్కిన్లను అందించాలనుకుంది. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల నుంచి నిధులు సేకరించింది. రూ.15వేల లక్ష్యంతో మొదలుపెడితే రూ.50 వేలు వసూలయ్యాయి. వాటితో ప్యాడ్‌లను కొని బెంగళూరులోని వివిధ ఎన్‌జీఓలకు అందించింది.

కేవలం శానిటరీ న్యాప్కిన్లకే పరిమితమైతే సరిపోదనిపించిందామెకు. గైనకాలజిస్టులతో మాట్లాడి ముందుగా తను పూర్తి అవగాహన తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రుతుచక్ర’ పేరిట సంస్థను ప్రారంభించింది. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు అపరిశుభ్రత కారణంగా వచ్చే జబ్బులు, దానిపై ఉన్న అపోహలు, గర్బధారణ సమస్యలపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. మొదట ఎన్‌జీఓల్లో వర్క్‌షాప్‌లను నిర్వహించింది. క్రమంగా చుట్టూ ఉన్న గ్రామాలకూ విస్తరించింది. బోధనలా ఉంటే వినడానిక్కూడా ఇష్టపడరని గ్రహించింది. వాళ్లతో మాట్లాడుతూ, చర్చిస్తూ అవగాహన కల్పించేది. మొదట్లో కుటుంబ సభ్యులే సాయం చేసేవారు. తర్వాతర్వాత ఎంతోమంది వాళ్లే వచ్చి చేరడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ పదిలక్షలకుపైగా శానిటరీ ప్యాడ్‌లు, టాంపూన్‌లను అందించింది. దాదాపుగా 10వేల మందికి వీటిపై అవగాహన కల్పించింది. కొవిడ్‌ సమయంలోనూ దీన్ని కొనసాగించింది.

ఈ క్రమంలో సంజన ఎన్నో సవాళ్లనూ ఎదుర్కొంది. చిన్నమ్మాయి అనే ఉద్దేశంతో కొందరు తన మాటనే పట్టించుకునేవారు కాదు. కష్టపడి కొంతమందిలో మార్పు తెచ్చినా కొద్దిరోజులకే మళ్లీ పాత పద్ధతుల్లోకి మారేవారు. కొందరు సాయం చేయకపోగా ‘నీకెందుకివన్నీ.. బుద్ధిగా చదువుకో’మని సలహాలిచ్చేవారు. కానీ తాను ఇవేమీ పట్టించుకోలేదు. ప్రతి ప్రాంతానికీ తిరిగి ఆరు నెలలకోసారి వెళ్లి పరిశీలించడం మొదలుపెట్టింది. అవసరమైతే సూచనలూ ఇచ్చేది. ఈమె చేస్తున్నదాన్ని గమనించి కొన్ని ఎన్‌జీవోలతోపాటు అశోకా ఇండియాస్‌ యంగ్‌ ఛేంజ్‌ మేకర్‌ వాళ్లు కలిసి పనిచేసే అవకాశమిచ్చారు. దీంతో నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, సేవలను విస్తృతం చేయడం సులువైంది. అంతేకాదు.. విమెన్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ‘యంగ్‌ లీడర్‌’ అవార్డునూ పొందింది. ‘ఏదైనా పనిని బలంగా చేయాలనుకుంటే దానికి వయసేమీ అడ్డు కాద’ంటుంది సంజన. నిజమే.. తను చేసి నిరూపించింది కూడా. ఇప్పుడు 12 నుంచి 60 ఏళ్ల వారి వరకూ 200కుపైగా శాశ్వత వలంటీర్లు తన సంస్థలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, ఫైనాన్స్‌, క్యాంపెయినింగ్‌లకు తన స్నేహితులు, 20 ఏళ్లలోపు వారినే నియమించుకుంది. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించడమే కాకుండా.. తాజా గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలనూ కల్పిస్తోంది. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో మాలిక్యులర్‌ బయాలజీ, బిజినెస్‌ ఎకనామిక్స్‌ల్లో మేజర్స్‌ చేస్తోంది. ఓవైపు చదువుతూనే సంస్థ కార్యకలాపాలు చూసుకుంటోంది. తను బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా... వాలీబాల్‌ క్రీడాకారిణి, కీబోర్డ్‌ ప్లేయర్‌, భరత నాట్యం నేర్చుకోవడంతోపాటు తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌నూ సాధించింది.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని