పక్షుల కోసంకలల రెక్కలు కట్టుకుని...
close
Updated : 05/07/2021 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పక్షుల కోసంకలల రెక్కలు కట్టుకుని...

ప్రపంచంలోనే అరుదైన ఓ విహంగం కోసం సముద్ర మట్టానికి నాలుగువేల మీటర్ల ఎత్తులోని పర్వతం మీద కెమెరాతో కూర్చుంది. రెండు వారాల నుంచి అక్కడికొస్తున్న ఆమె, కనీసం ఆ రోజైనా తన కల ఫలించాలనుకుంది. అంతలో సన్నగా కూనిరాగాలు తీస్తూ.. వచ్చి ఆమె ముందు వాలిందా పక్షి. అంతే ఆమె కెమెరా క్లిక్‌మంది. ఇలా దేశవిదేశాల అరుదైన విహంగాలను ఫొటోలు తీయడమే కాకుండా, డాక్యుమెంటరీలు కూడా నిర్మిస్తోందామె. అరుదైన రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన డాక్టర్‌ జైనీ మరియా కురియాకోస్‌ ప్రస్థానమిది.

రసాయన శాస్త్రంలో డాక్టరేట్ చేసింది మరియా. ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరి ఉన్నత స్థానానికి ఎదిగింది. చిన్నప్పటి నుంచి తనకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. పక్షులు కనిపిస్తే చాలు.... ఫొటో తీయకుండా వదిలేది కాదు. ఉద్యోగం చేస్తూనే, పర్యాటక ప్రాంతాలకెళ్లి ఫొటోలు తీసేది. అయినా ఏదో అసంతృప్తి. బాగా ఆలోచించాక అర్థమయింది... తన మార్గం ఇది కాదని. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది. బర్డ్స్‌ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా చేసుకుంది. మన దేశంలోమొత్తం 1350 పక్షిజాతులుండగా, వీటిలో 70 శాతానికిపైగా... అంటే 1200 రకాలను ఈ పదేళ్లలో క్లిక్‌మనిపించింది. దేశంలోనే ఇన్ని జాతులను ఫొటోలు, డాక్యుమెంటరీలుగా తీసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచిందామె. మరియా ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు ముఖచిత్రాలుగా నిలిచాయి. అంతర్జాతీయ సైంటిఫిక్‌ జర్నల్స్‌కు, పక్షి పరిశోధకులకు ఈమె తీసిన ఫొటోలు, డాక్యుమెంటరీలే ముడిసరకు. టెడెక్స్‌ వంటి వేదికలు, కాలేజీలు, పాఠశాలల్లోనూ ఈ రంగంపై అవగాహన కలిగిస్తోంది మరియా. మనదేశానికి చెందిన 50రకాల జాతుల క్షీరదాలపైనా ఈమె తీసిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది.

మైళ్లదూరం...
అరుదైన విహంగాలపై ముందుగా అధ్యయనం చేస్తుంది మరియా.   ఏ కాలంలో ఏయే ప్రాంతాలకు వస్తాయో పరిశోధించి, అక్కడికి చేరుకుంటుంది. ‘అరుదైన జాతి పక్షి వెస్టెర్న్‌ ట్రాగోపాన్‌ను ఫొటోలు తీయడం మరవలేను. కింగ్‌ఆఫ్‌ బర్డ్‌ అని పిలిచే ఈ జాతి పక్షులు ప్రపంచంలో అయిదువేలు మాత్రమే ఉన్నాయి. అత్యంత ఎత్తైన పర్వతాలపై శబ్ద కాలుష్యం లేని చోట జీవిస్తాయి. మన దేశంలో వేసవిలో అదీ హిమాచల్‌ప్రదేశ్‌లో అరుదుగా కనిపిస్తాయి. ఈ పక్షిని ఫొటో తీయడం నాకు ఛాలెంజ్‌. దీనికోసం రెండేళ్లు వరుసగా అక్కడికెళ్లా. మొదటేడాది హిమాలయన్‌ నేషనల్‌ పార్కుకు ట్రెక్కింగ్‌ చేసి వెళ్లా. భుజాన కెమెరా, స్టాండు, పరికరాల బరువుతో ఎత్తుకు ఎక్కాలంటే కష్టం. అయినా వరుసగా వారం రోజులు కాపు కాసినా ఆ పక్షి రాలేదు. రెండో ఏడాది కూడా వెళ్లా. వారమైనా రాలేదు. మరోవారం ఎదురుచూశా. అకస్మాత్తుగా ఓ రోజు ట్రాగోపాన్‌ నేనుండే చోట వాలింది. అద్భుతమైన ఫొటోలు తీయగలిగా. అప్పటివరకు పడ్డ శ్రమ, ఆందోళన మర్చిపోయా. అంతకు ముందు ప్రముఖ ఫొటోగ్రాఫర్లు తీసినవాటి కన్నా నావి ద బెస్ట్‌ అని ప్రశంసలు అందుకోవడం గర్వంగా అనిపించింది. ఈ రంగాన్ని ఎంచుకోవడమే ఓ ఛాలెంజ్‌. కొన్నిసార్లు రోజంతా ఆహారం, మంచినీళ్లు తీసుకోడానికి వీలుండదు. మంచు, ఎండ, వానలను తట్టుకోగలగాలి. రాత్రీపగలు గంటలతరబడి ఏకాగ్రతగా, సహనంగా, నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఏ క్షణమైనా మనం ఎదురు చూసే పక్షి రావచ్చు. దానికోసం సిద్ధంగా ఉండాలి. పనిలో పడితే ఆకలిని మర్చిపోతా. రాత్రి సంచరించే గుడ్లగూబ, ఫ్రాక్‌మైత్‌బర్డ్స్‌, జాస్‌, ఔలెట్‌ నైజాస్‌ వంటి వాటినీ ఫొటోలు తీయగలిగా. ఆరు రకాల అరుదైన జాతి పక్షుల కోసం అండమాన్‌ నికోబార్‌, న్యూగినీ దీవులకు, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లా. నైట్ జార్‌ జాతిపక్షుల కోసం కేరళ, గుజరాత్‌, తమిళనాడు, అలస్కా, అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లో రోజుల తరబడి ఎదురు చూసి మరీ ఫొటోలు తీశా’ అని చెప్పే మరియా ఈ రంగంలో ఔత్సాహికులకు మెంటర్‌గానూ వ్యవహరిస్తోంది. పక్షులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సుల్లో మరియాకు ఆహ్వానం రానివి అరుదంటే తన కృషి ఎంతో అర్థం చేసుకోవచ్చు.

జీవితంలో సాధించే విజయాలన్నీ మన ప్రతిభ, కృషి మీదే ఆధారపడి ఉంటాయని గుర్తించండి.

- దీపికా పదుకొణె, నటి


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని