కళ్లు లేకున్నా చదవొచ్చు రాయొచ్చు...
close
Updated : 09/07/2021 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళ్లు లేకున్నా చదవొచ్చు రాయొచ్చు...

‘కనులు లేవని నీవు కలతపడకు.. నా కనులేె నీవిగా చేసుకుని చూడు’ ఇదొకనాటి పాట. ‘చూపు లేకున్నా చదివేయగలవు.. రాసేయగలవు..’ అనేది ఇవాళ్టి మాట. అదెలా సాధ్యం? బ్రెయిలీ లిపి కాబోలనుకున్నారా? అబ్బే కాదు.. అదేంటో వివరంగా చూడండి...

చూపు లేనివాళ్లు అందరిలా మామూలు స్కూళ్లు, కాలేజీల్లో చదవలేరు. ప్రత్యేక స్కూళ్లకే వెళ్లాలి. బ్రెయిలీలోనే చదవాలి. ఉన్నత విద్య మరీ కష్టం. విషయం మీద ఎంత ఆసక్తి ఉన్నా చదవాల్సిన మెటీరియలంతా పుస్తకాలు లేదా పీడీఎఫ్‌ రూపంలో కంప్యూటర్లో ఉంటుంది. లేదా పాఠ్య పుస్తకాలు, పత్రికలు, పేపర్లుగా మార్కెట్లో దొరుకుతుంది. ఎవరినైనా బతిమాలి చదివించుకోవాలి. కానీ అది అన్నిసార్లూ కుదిరేపని కాదు. లేదా వాటిని బ్రెయిలీలో చదవాలి, ఆడియోబుక్స్‌ ఉంటే వినాలి. ఈ రెండూ కష్టమే. అన్ని పుస్తకాలూ అలా దొరకవు. ఇన్ని తంటాల్లేకుండా వారికి చదువు సులువయ్యేలా చేయాలనుకున్న శాంతియా రాజన్‌ ‘ప్యారాక్లేట్‌ ఇమేజ్‌ ల్యాబ్స్‌’ అనే స్టార్టప్‌ నెలకొల్పింది. తన టీమ్‌తో కలిసి చూపులేనివారికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టింది. అది ఎలాంటి డాక్యుమెంట్‌ని అయినా స్కాన్‌ చేసి బిగ్గరగా చదువుతుంది. అర్థవంతంగా ఉండాలని దానికి ‘ప్రకాశ్‌’ అని పేరుపెట్టింది.

చూపు లేనివాళ్లు తమకు అవసరమైన పాఠ్యాంశాలు, పుస్తకాలు బంధుమిత్రులతో చదివించుకోవడం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఉన్న కష్టనష్టాలు, గజిబిజి గమనించిన శాంతియా దాన్ని పరిష్కరించాలనుకుంది. అందుకు తగ్గ చదువునే ఎంచుకుంది. కోయంబత్తూరు బన్నారీ అమ్మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంటెక్‌లో చేరింది. 2017లో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ఉండగా ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేయడం మొదలుపెట్టింది. బెంగళూరు ‘ఆర్‌టీ ల్యాబ్స్‌’, ‘వి హబ్‌’ల సహకారం తీసుకుంది. ఆమె కృషి ఫలించింది. 2020 డిసెంబర్‌లో అనుకున్నది సాధించింది. తమ ఫోన్‌లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎవరినో అభ్యర్థించాల్సిన పని లేకుండా తమకు కావలసింది అనుకూల సమయంలో వినగలరు. కరోనా వల్ల కొంత జాప్యం జరిగినా, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాలేషన్‌ ప్రకటించింది. యూజర్‌ రూ.40 వేలు చెల్లించి, మైక్రోసాఫ్ట్‌ లేదా అడోబ్‌ను పోలిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే ఇక దాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ, హిందీ, ఇంగ్లిషు భాషలు గ్రహించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందింది. ఇది ఆన్‌లైన్‌లోనే కాదు, ఆఫ్‌లైన్‌లోనూ పనిచేస్తుంది. ప్రస్తుతం కోయంబత్తూరు చుట్టుపక్కల 500 మంది దీన్ని ఉపయోగిస్తున్నారు.

కేవలం బిగ్గరగా చదివి వినిపించడమే కాదు, పరీక్ష రాసే సాఫ్ట్‌వేర్‌ కూడా ఇందులో అమర్చి ఉంది. ఇప్పటివరకూ చూడలేనివాళ్లకి వేరెవరో ఎగ్జాం రాసిపెట్టేవాళ్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆ సమస్యనూ తీర్చనుంది. మొదట పరీక్ష పేపరును చదువుతుంది. జవాబులు నోటితో చెబితే చాలు.. వెంటనే పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ తయారైపోతుంది. అన్ని ప్రశ్నలూ పూర్తయ్యాక ఆ పత్రాన్ని ఎగ్జామినర్‌కు పంపిస్తుంది. శాంతియాకి ఇంతటితో తృప్తి కలగలేదు. తన టీమ్‌తో కలిసి ఈ సాఫ్ట్‌వేర్‌ని మరింత అభివృద్ధి చేసే పనిలో లీనమయ్యింది.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని