ఇంటర్‌ అమ్మాయి..ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించబోతోంది!
close
Updated : 10/07/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటర్‌ అమ్మాయి..ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించబోతోంది!

సస్టెయినబిలిటీ.. దేన్నైనా కొన్నేళ్ల పాటు ఉపయోగించడం, తద్వారా వృథాను అరికట్టడం. ఈ విధానానికి ఇటీవల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని నెలసరికి వినియోగించే ఉత్పత్తుల విషయంలోనూ పాటించాలంటోంది గుహర్‌ గోయల్‌. ఈ విషయంలో తన ‘గ్రీన్‌ పిరియడ్స్‌’ క్యాంపెయిన్‌ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ఐక్యరాజ్యసమితి’ కార్యక్రమంలోనూ ప్రసంగించనుంది.
తన మొదటి నెలసరి సమయంలో గుహర్‌ చాలా ఇబ్బంది పడింది. శానిటరీ ప్యాడ్‌ల కారణంగా ఒళ్లంతా దద్దుర్లు వచ్చేవి. దీంతో వాళ్లమ్మ మళ్లీ వాడుకోడానికి వీలయ్యే క్లాత్‌ ప్యాడ్‌లను ఇచ్చింది. గుహర్‌కు మొదట్నుంచీ పర్యావరణంపై ప్రేమ ఎక్కువ. అమ్మ ఇచ్చిన పాడ్స్‌ పర్యావరణానికీ హితమైనవి కావడంతో సంతోషపడింది. స్నేహితురాళ్లతోనూ వీటి గురించి చర్చించింది. వాళ్లూ వాళ్ల ఇబ్బందుల్ని చెప్పారు. అప్పుడే వీటి గురించి వీలైనంతమందికి అవగాహన కల్పించాలనుకుంది.
17 ఏళ్ల గుహర్‌ది బెంగళూరు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌లపై కొంత పరిశోధన చేసింది. వాటిల్లో స్టైరిన్‌, క్లోరోఫాం, క్లోరోమీథేన్‌ వంటి ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారని తెలుసుకుంది. ఇవి ఉపయోగిస్తున్న వారికే కాకుండా పర్యావరణానికీ ఎంతో హాని కలిగిస్తున్నాయని అర్థమైందామెకు. వీటి వినియోగం విషయంలో చైతన్యం తేవాలనుకుంది. అందుకే ‘గ్రీన్‌ పిరియడ్స్‌’ క్యాంపెయిన్‌ ప్రారంభించింది. స్నేహితులతో కలిసి స్కూళ్లు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో వందల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. తన ప్రచారానికి సామాజిక మాధ్యమాలనూ వేదికగా చేసుకుంది. కొవిడ్‌ సమయంలో విరాళాలను సేకరించి, ఆరోగ్య సిబ్బందికి సస్టెయినబుల్‌ నెలసరి ఉత్పత్తులను అందించింది.
వాషింగ్టన్‌ యూనివర్సిటీ పిరియడ్‌ పావర్టీకి వ్యతిరేకంగా ‘వాష్‌యూ’ పేరిట క్యాంపెయిన్‌ చేస్తోంది. దీనిలో గుహర్‌ కూడా సభ్యురాలు. తన కృషికి ఫలితంగా కిండల్‌ నుంచి సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ రికగ్నిషన్‌ అవార్డు కింద రూ.20,000 గెలుచుకుంది. ఈ ఏడాది 1ఎం1బీ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న ‘ఫ్యూచర్‌ లీడర్స్‌ ప్రోగ్రామ్‌’లో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. సస్టెయినబిలిటీపై పనిచేస్తున్న యువతను, వారి విధానాలను ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమం ఇది. దీని ద్వారా డిసెంబర్‌లో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో సస్టెయినబిలిటీపై గుహర్‌ ప్రసంగించనుంది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు వీలుగా బయోకెమికల్‌ రిసెర్చ్‌ లేదా ఎర్త్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఉన్నత విద్యను చదవాలనుకుంటోంది గుహర్‌.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని