‘సూపర్బ్‌ స్వాతి’... డాక్టర్‌ కూడా!
close
Updated : 11/07/2021 05:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సూపర్బ్‌ స్వాతి’... డాక్టర్‌ కూడా!

వాక్సినేషన్‌ గురించో, ఆరోగ్య సమస్యల గురించో అనుమానాలను ఎంత చక్కగా నివృత్తి చేయగలదో... ఒళ్లుగగుర్పొడిచే స్కూబా డైవింగ్‌ గురించీ అంతే అందంగా చెప్పగలదు... డాక్టర్‌గా రోగుల్లో చైతన్యం తీసుకొస్తూనే.. తన భిన్నమైన అభిరుచులను ఆకట్టుకునేలా చిత్రీకరించి వ్లోగ్స్‌ ద్వారా అందిస్తూ... అభిమానులను అలరిస్తోంది విశాఖపట్నానికి చెందిన స్వాతి...

ప్రతి పనినీ ఆస్వాదిస్తూ చేసేవాళ్లు ఎంతమంది? అందులోనూ క్షణం తీరికలేని వైద్యవృత్తిలాంటి వాటిని ఎంచుకుంటే ఆ పనితోనే సతమతమైపోతూ ఉంటారు చాలామంది. కానీ ఈ డాక్టరమ్మ పూర్తిగా భిన్నం. స్వాతి విశాఖపట్నంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర వైద్యురాలు. ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చేందుకు సామాజిక మాధ్యమాలు చక్కని వేదిక అని భావించింది. పైగా చిన్నప్పటి నుంచీ నటన అంటే ఆసక్తి. అనుకరణ ఇష్టమైన అభిరుచి. అన్నింటికీ మించి శ్రావ్యమైన గాత్రం. ‘మంచి యూట్యూబర్‌ కావడానికి ఈ లక్షణాలు చాలనిపించింది’ అనే స్వాతి.. విధులు ముగించుకున్న తర్వాత ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని కాసేపు వీడియో చేయడాన్ని అలవాటుగా మార్చుకుంది. ‘స్వాతిఫర్‌యు’ వ్లోగ్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌లో ఆ వీడియోలను పోస్ట్‌ చేస్తోంది. ఎంబీబీయెస్‌ కోర్సు గురించి తెలియని ఆసక్తికర అంశాలు మొదలు మాల్దీవుల్లో తన సాహసాల వరకు ఎన్నో విషయాలని చెబుతూ ‘సూపర్బ్‌ స్వాతి’ అనిపించుకుంటోంది. 

‘ఓ పక్క కొవిడ్‌ రోగులు పెరుగుతున్నారు. మరో పక్క వ్యాక్సినేషన్‌పై అనుమానాలుండేవి. ఆ సమయంలో ఎంతో మంది వ్యాక్సిన్‌ గురించి నా దగ్గర అనుమానాలు వ్యక్తం చేసేవారు. అందరికీ ఓపిగ్గానే సమాధానాలు చెప్పేదాన్ని. కానీ అలా ఎంతమందికని చెబుతాం. చెప్పకపోతే వాళ్లకు ముప్పు. అందుకే టీకాల ప్రాధాన్యంపై వీడియోలను రూపొందించాను. కొవిడ్‌ వాక్సిన్ల ఆరోగ్య కేంద్రంలో ఇంఛార్జిగా పనిచేసిన అనుభవంతో ఎన్నో విషయాలపై లోతైన సమాచారాన్ని ఇవ్వగలిగాను. వాటికి మంచి ఆదరణ వచ్చింది. అవి లక్షల మందికి చేరువయ్యాయి. ముఖ్యంగా యువత ఈ విషయంలో చైతన్యం పొందడం సంతోషంగా అనిపించింది’ అనే స్వాతి తన వ్లోగ్‌ని వైద్య విషయాలకు మాత్రమే పరిమితం చేయలేదు. సోదరి జ్యోతి కలిసి తను పలు అంశాలపై చేసిన వీడియోలు ఆలోచింపజేస్తాయి. మాల్దీవుల్లో తాను చేసిన స్కూబా డైవింగ్‌తోపాటు... పీతల కూర, వంజరం వేపుడు వంటి వంటల వీడియోలు చక్కని ఆదరణ పొందాయి. కొన్ని వీడియోలైతే 12 లక్షల వ్యూస్‌ని అందుకోవడం విశేషం. ‘మా కుటుంబంలో నేనే డాక్టర్‌ని. ఎంబీబీయెస్‌ అవగానే కొవిడ్‌ విధులను నిర్వర్తించే అవకాశం వచ్చింది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ప్రవృత్తిని వదులు కోకూడదనేది నా సిద్ధాంతం. చిన్నతనం నుంచీ నాకు కొన్ని కలలున్నాయి. నటన అంటే ఇష్టం. స్టేజీ పెర్ఫార్మెన్స్‌, నాట్యం అంటే ప్రాణం. మొదట్లో టిక్‌టాక్‌ వీడియోలు చేసే దాన్ని. వాటి ద్వారా చాలా మందికి చేరువయ్యాను. తర్వాత యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించాను. మావారు మహేష్‌ కూడా డాక్టరే. ఆయన, మా అత్తింటి వారు ప్రోత్సహించారు కనుకనే నేను ఇన్ని రంగాలలో రాణించగలుగుతున్నా. చదువునీ ఆపలేదు. ఇప్పుడు పీజీ కోసం సిద్ధం అవుతున్నా. ఆదివారాన్ని పూర్తిగా యూట్యూబ్‌ కోసం కేటాయిస్తాను. సోమవారం నుంచి శనివారం వరకు చదువుకుంటాను. నాకు చక్కగా పాడటమూ వచ్చు.

తీరిక దొరికినప్పుడల్లా షాట్స్‌ చేసి పెడుతుంటాను. మన వృత్తి, ప్రవృత్తి వేర్వేరయినా... ప్రణాళికాబద్ధంగా పని చేస్తే రెండింటినీ చక్కగా బ్యాలెన్స్‌ చేసుకోవచ్చు’ అంటోంది డాక్టర్‌ స్వాతి.

- ఎం.వి.కూర్మరాజు, ఈటీవీ, విశాఖపట్నం


మంచిమాట

నా కష్టనష్టాలన్నిటికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. అవే లేకపోతే అవరోధాలను దాటే నైపుణ్యం, దేన్నయినా ఎదిరించే సామర్థ్యం అలవడేవి కావు.

- అలెగ్జాండ్రా ఎల్లె, రచయిత్రి


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని