సమాజ హితం... అభినయ మతం!
close
Updated : 13/07/2021 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమాజ హితం... అభినయ మతం!

వయసులో చిన్నదైనా...ఆశయాల్లో మాత్రం లోతైన గుండె ఆమెది. అందుకే పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టింది. మూగజీవాల సంరక్షణకూ అడుగు ముందుకేసింది. ఈ విశాల దృక్పథమే ఆ అమ్మాయిని ‘ద డయానా అవార్డ్‌-2021’ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది.ఆమే ప్రొద్దుటూరుకి చెందిన పోలక అభినయ. వివరాలు తన మాటల్లో...

మన చుట్టూ నిత్యం చాలా జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ఆలోచింపజేస్తాయి. అలాంటి ఓ సంఘటన నన్ను సేవవైపు మరల్చింది. నేను 2018 నుంచి జీఆర్‌ఈఏపీ (గార్డింగ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌, యానిమల్స్‌ అండ్‌ పీపుల్‌) అనే సంస్థను నడుపుతున్నా. మాది ప్రొద్దుటూరు. అమ్మ భార్గవి గృహిణి, నాన్న విజయభాస్కర్‌రెడ్డి ఫొటోగ్రాఫర్‌. హైదరాబాద్‌ ఇండస్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో కేజీ నుంచి ఇంటర్‌ వరకూ చదివా. మూడేళ్ల క్రితం ఓ రోజు నాన్నతో కలిసి వెళ్తున్నప్పుడు... వీధి కుక్కలు, పిల్లులు బక్కచిక్కి కనిపించాయి. అదే సమయంలో స్కూల్లో నా తోటి విద్యార్థులు ఆహారాన్ని వృథా చేయడం గమనించాను. ఆ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. అప్పటి నుంచి అదనంగా ఉన్న ఆహారాన్ని తీసి ఉంచి స్నేహితులతో కలిసి వాటికి పెట్టేదాన్ని. మరికొన్ని సమస్యలూ కనిపించాయి. దాంతో ఓ ఎన్‌జీవో ఏర్పాటుచేసి సామాజిక, పర్యావరణ, జంతు సంరక్షణపై పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నా. నా ఆలోచనను అమ్మానాన్నలతో చెప్పా. మొదటి సంశయించినా... నా పట్టుదల చూసి ప్రోత్సహించారు. అలా జీఆర్‌ఈఏపీ సంస్థ ద్వారా వీధికుక్కల సంరక్షణ, వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడం, ఆహారం అందించడం, ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ నియంత్రణపై అవగాహన కల్పించడం వంటివి ప్రారంభించా. అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్‌మనీతోనే కార్యక్రమాలు చేపడుతున్నా. అమెరికాలో ఉండే మా మామయ్య ఇండియాకు వచ్చినప్పుడు బ్లూక్రాస్‌ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమలను పరిచయం చేశారు. అక్కడ ఏడాది వాలంటీరుగానూ పని చేశా. నా పని తీరు చూసిన అమల  నన్ను హత్తుకుని మరీ ప్రశంసించడం జీవితంలో మరచిపోలేను. నా కార్యక్రమాల వివరాలను మా మాస్టర్‌ శ్యాముల్‌ జోసెస్‌ ‘డయానా అవార్డు’ సంస్థకు పంపారు. అన్నీ పరిశీలించి నేను ఎంపికైనట్లు వారు సమాచారం ఇవ్వడంతో పాటు వాళ్ల సైట్‌లో కూడా ప్రచురించారు. కరోనా కారణంగా పురస్కారాన్ని కొరియర్‌లో పంపుతారు. బ్రిటిష్‌ యువరాణి దివంగత డయానా పేరు మీద ఉన్న ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. నా సేవల్ని మరింతగా విస్తృత పరిచేందుకు వీలుగా నా చదువునీ   ఎంచుకున్నా. త్వరలోనే... పర్యావరణ శాస్త్రం చదివేందుకు
న్యూయార్క్‌ వెళ్లబోతున్నా.

 - అరికెల గంగూలీ, ప్రొద్దుటూరు


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని