పిల్లల కోసం... ఆరంకెల జీతాన్ని వదిలేసింది
close
Updated : 14/07/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల కోసం... ఆరంకెల జీతాన్ని వదిలేసింది

పెద్ద చదువులు చదువుకుని, కార్పొరేట్‌ సంస్థలో ఆరంకెల జీతం తీసుకున్న ఆమె.. తన మార్గాన్ని మార్చుకుంది. మహిళా సాధికారత కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుని... బ్లాగర్‌, రచయిత్రి, సామాజిక సేవా కార్యకర్త, వాణిజ్యవేత్త, కొరియోగ్రఫర్‌ ... ఇలా పలు మార్గాలను ఎంచుకుంది. మహిళలకు పలు రంగాల్లో శిక్షణనందిస్తోంది. ఈ సేవలకు పలు అవార్డులనూ దక్కించుకున్న ఆమే 38 ఏళ్ల అనుపమా దాల్మియా...

పుణె విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివిన అనుపమ, అహ్మదాబాద్‌లో సిస్టమ్స్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. 2006లో ఇన్ఫోసిస్‌లో కన్సల్టెంట్‌గా చేరింది. అక్కడ ఆరేళ్లు పనిచేసింది. చిన్నప్పటి నుంచి తన కాళ్లపై తాను నిలబడాలని, చిన్నారులకు, మహిళలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ఆలోచించే అనుపమకు ఈ ఉద్యోగంలో క్షణం  తీరిక లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ‘క్రియేటివ్‌ రైటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌’ అంశంపై మూడు రోజుల పాటు పిల్లలకు సమ్మర్‌ వర్క్‌షాపు నిర్వహించింది. అక్కడ చిన్నారుల భావవ్యక్తీకరణ, వారి ఆలోచనలు అనుపమను ఆలోచింపచేశాయి. పాఠశాల స్థాయి నుంచి పిల్లలను ఈ దిశగా ప్రోత్సహిస్తేనే వారి సృజనాత్మకత బయటకు వస్తుందని భావించింది. దీనికోసం 2019లో ‘బియాండ్‌ ద బాక్సు’ స్టార్టప్‌ను స్థాపించిందీమె. ఈ వెబ్‌సైట్‌లో వందల మంది చిన్నారులు నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతున్నారు.

మరుగున పడిన వంటకాల కోసం...
అనుపమ చిన్నప్పటి నుంచి అమ్మ వంటకాల రుచిని ఆస్వాదించడమే కాదు, ఎప్పటికైనా ఓ రెస్టారెంట్‌ ప్రారంభించాలని చెప్పే మాటలనూ వింటూ పెరిగింది. అలా అమ్మ కోసం ప్రారంభించిందే.. ‘టింగిల్‌ యువర్‌ టేస్ట్‌ బడ్స్‌’ వెబ్‌సైట్‌. దేశవ్యాప్తంగా మరుగున పడుతున్న వంటకాలను పరిచయం చేసే వేదికగా దీన్ని మార్చింది.  ఎవరైనా సరే తెలిసిన వంటలను ఈ సైట్‌లో పొందుపరచొచ్చు. భారతీయ వంటకాలెన్నింటినో ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దీనిద్వారా సంప్రదాయ వంటలను అందరికీ పరిచయం చేస్తున్న అనుపమ కృషికిగాను 2017, 2018 సంవత్సరాల్లో ‘బెస్ట్‌ బ్లాగర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’ దక్కింది. ఇవి కాక ‘రిథమ్స్‌ అండ్‌ బీట్స్‌’ స్టార్టప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డాన్స్‌ వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. పబ్లిక్‌ ఈవెంట్స్‌కు కొరియోగ్రఫీ కూడా చేస్తున్న ఈమె ‘ద బెస్ట్‌ సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌’ గౌరవాన్ని అందుకుంది. ‘అమ్మ నాకు చదువు, నృత్యం, చిత్రకళ, పుస్తకపఠనం వంటి అంశాల్లో  ప్రవేశం కల్పించింది. సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనీ నేర్పించింది. ఇవన్నీ నాకు ప్రేరణ. పిల్లలకు సృజనాత్మకత స్వేచ్ఛగా బయటకు రావడానికి పెద్దలు కృషి చేయాలి. అప్పుడే వారు చదువుతోపాటు సామాజిక అంశాల్లోనూ చురుగ్గా ఉంటారు. అందుకే పిల్లల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాను. అలాగే ఆరోగ్య విలువలు నిండి ఉండే మన సంప్రదాయ వంటకాలు అంతరించిపోకుండా భావితరాలకు పంచడం కోసం సైట్‌ పెట్టా’ అని వివరించింది అనుపమ.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని