పారిశుద్ధ్య కార్మికురాలు... డిప్యూటీ కలెక్టరయ్యింది
close
Updated : 19/07/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారిశుద్ధ్య కార్మికురాలు... డిప్యూటీ కలెక్టరయ్యింది

ఒంటరిగా, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ప్రారంభించింది. జీవిక కోసం కార్పొరేషన్‌లో చేరి, వీధులు ఊడ్చింది. అయినా ఉన్నతవిద్య ఆశయాన్ని వీడలేదు... ఎన్నో ప్రయాసలకోర్చి దాన్ని సాధించింది. తాజాగా రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేసిన చోటే డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనుంది. ఆమే 40 ఏళ్ల ఆశా కుందారా.

రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌కు చెందిన పేద కుటుంబంలో పుట్టిన ఆశా కుందారాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఆసక్తి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పైగా సంప్రదాయం మేరకు చిన్నవయసులోనే పెళ్లి. అత్తింట్లో అయినా తన చదువు ఆశయం తీరుతుందనుకుంటే, భర్త వైఖరితో నిరాశే ఎదురైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక అత్తింట్లో వేధింపులెక్కువయ్యాయి. దాంతో పిల్లలతో 2013లో బయటికొచ్చింది. తన పరిస్థితి పిల్లలకు రాకూడదంటే బాగా చదివించాలని అనుకుంది. అందుకోసం జోథ్‌పుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరింది.

గర్వంగా... పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉంటూనే చదువుకోవడం మొదలుపెట్టింది. ‘ఇంటి బాధ్యతలు, విధులు, చదువు వీటన్నింటిని సమన్వయం చేయడానికి చాలా కష్టపడ్డా. ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి గంటలో పని పూర్తి చేసుకుని, అయిదు గంటలకల్లా విధుల్లోకి వెళ్లేదాన్ని. సాయంత్రం ఇంటికొచ్చాక చదువుకునే దాన్ని. దూరవిద్యలో చదవడంతో నా సందేహాలను డిగ్రీ చదువుతున్న పిల్లలను అడిగి తెలుసుకునే దాన్ని. ఆంగ్లం నేర్చుకోవడానికి చాలా సాధన చేశా. పిల్లలకు చదువు చెబుతూ, వారి దగ్గర నేర్చుకునేదాన్ని. మా కార్యాలయంలో కలెక్టరు, మేయర్‌ వంటి వారిని చూసినప్పుడల్లా వారిలాగే గౌరవాన్ని పొందాలనిపించేది. దాన్ని సాధించాలని సంకల్పం పెట్టుకున్నా. 2018లో ఆర్‌పీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యా. కొవిడ్‌ వల్ల ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల విడుదలవ్వడం, నేను 728వ ర్యాంకును సాధించడం పట్టలేని సంతోషాన్నిచ్చింది. ఈ విజయం వెనుక అమ్మానాన్న ప్రోత్సాహమెంతో ఉంది. ఈ నెల మొదటి వారంలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా శాశ్వత నియామక ఆర్డరు వచ్చింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడంతో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలను తీసుకోనున్నా. ప్రజా పాలనాధికారిగా అందరి సంక్షేమానికి పాటుపడతా. ఇక్కడే స్వీపర్‌గా పనిచేసిన నేను ఇదే చోట గౌరవాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. ఇద్దరు పిల్లలతో ఎనిమిదేళ్ల క్రితం ఇంటినుంచి బయటికి వచ్చినప్పుడు మనసులో నా పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నా. వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతా’ అని అంటోంది ఆశా కుందారా.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని