తన పోరాటం సినీ కథగా...
close
Updated : 18/07/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన పోరాటం సినీ కథగా...

ఇప్పటికే క్రీడాకారుల బయోపిక్స్‌ వచ్చాయి, వస్తున్నాయి. ప్రముఖుల గురించి ఇలా తీయడం సాధారణమేగా అనిపిస్తోంది కదూ. కానీ ఈసారి వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం పెద్ద తెర మీద కనిపించనుంది. మరి ఒక సినిమాకు సరిపోయేంతగా ఏముంది తన జీవితంలో...? చదవండి...

పింకీ ప్రామాణిక్‌.. పశ్చిమ్‌ బంగాలోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది. స్ప్రింటర్‌గా అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో బంగారు, వెండి పతకాలనూ గెలిచింది. త్వరలో ఒలింపిక్స్‌ కలను నిజం చేసుకోబోతోందనగా ఆమె జీవితం తలకిందులైంది. తనతోపాటు నివసించే ఒకమ్మాయి పింకీ తనపై అత్యాచారం చేసిందనీ, తనసలు అమ్మాయే కాదని కేసు పెట్టింది. దీంతో పింకీ పరుగే కాకుండా రైల్వేలో ఉద్యోగానికీ దూరమైంది. 22 ఏళ్ల వయసులో జైల్లో మగవాళ్ల సెల్‌లో గడిపింది. అరెస్ట్‌ చేసినపుడూ, కోర్టుకు తీసుకెళ్లేటపుడూ మహిళా కానిస్టేబుల్స్‌ ఉండే వారు కాదు. మగ పోలీసులే తోడు వచ్చేవారు. వారు ఆమెతో ప్రవర్తించిన తీరు అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది.

రెండు సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత 2014లో ఆమెపై ఆరోపణలన్నీ అసత్యాలని తేలడంతో కోల్‌కతా హైకోర్టు కేసు కొట్టేసింది. మళ్లీ ఉద్యోగం లభించినా ఆటకీ, తన కలకీ దూరమైంది. దీనికి ముందూ పింకీ ఆయుధాల కేసులో జైలుకెళ్లింది. ఎవరో ఆమెకు తెలియకుండా బ్యాగులో పెట్టిన ఆధారాలు దొరకడంతో ఆ కేసు కొట్టేశారు. దీన్నుంచీ బయటపడటానికే ఆమెకు చాలా కాలం పట్టింది కూడా.

తాజాగా బాలీవుడ్‌ నిర్మాత అశోక్‌ పండిట్‌ ఈమె బయోపిక్‌ను తీయబోతున్నట్లు ప్రకటించారు. వివాదాలతో కూడిన ఈమె జీవిత కథను ఎంచుకోవడం చర్చనీయాంశ మైంది. ‘పింకీ ఒకప్పుడు దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ఆమె విజయాలను దేశమంతా సంబరాలు చేసుకుంది. కానీ తర్వాత ఆమె లింగమే ప్రశ్నార్థకమైంది. మానభంగ ఆరోపణతో క్రీడా కెరియరే ముగిసింది. కానీ పోరాడి గెలిచింది. ఆమె పోరాటాన్ని అందరికీ తెలియజేయాలని పించింది’ అంటోంది రచయిత ప్రియాంక ఘటక్‌.  ఇలాగైనా తన కష్టాలు, పోరాడిన తీరు అందరికీ తెలియజేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందంటోంది పింకీ. తారాగణం, తదితర వివరాలు త్వరలో చెబుతామంటున్నారు.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని