టెట్రా ప్యాకెట్లను స్కూల్‌ బెంచీలుగా...
close
Updated : 18/07/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెట్రా ప్యాకెట్లను స్కూల్‌ బెంచీలుగా...

ఎంత పనికి రాని వస్తువు కూడా ఆమె చేతిలో పడితే.... మారిపోతుంది. అలానే పాలు, పానీయాల టెట్రాప్యాకెట్లతో స్కూల్‌ బెంచీలను తయారు చేసి, ప్రకృతిలో ఏదీ వృథా కాదు నిరూపిస్తోంది మోనీషా. నాలుగు ఏళ్ల తన కూతురికి వచ్చిన అనారోగ్యం వృథా వస్తువులను కాల్చగా వెలువడ్డ పొగ, థూళి వల్లేనని తెలుసుకుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించే దిశగా కృషి ప్రారంభించింది. అలాగే వ్యర్థాలను షీట్లుగా మార్చి వాటితో బెంచీలు, రకరకాల వస్తువులను తయారు చేసి పాఠశాలలు, పార్కులకు అందిస్తోంది.

ఇంటి నుంచి బయటికి ఇంకా అడుగుపెట్టని తన కూతురికి దగ్గు, ఆయాసం రావడంతో వైద్యులను సంప్రదించింది మోనీషా. బయట వ్యర్థాలను కాలుస్తుంటే, వాటి నుంచి వచ్చే పొగ ఈ అనారోగ్యానికి కారణమని తెలుసుకుంది. అదే ఆమెను ఆలోచించేలా చేసింది. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను తగ్గించగలిగితే, ఈ సమస్యను కొంతైనా అదుపు చేయొచ్చు అనుకుంది. దాంతో ఇంటి చుట్టుపక్కలవారికి చిన్నచిన్నగా ఈ అంశంపై అవగాహన కలిగించడం ప్రారంభించింది. దాంతోపాటు వంటింటి వ్యర్థాలతో పెరటితోటను పెంచడమే కాదు, వాటి నుంచి పండే తాజా కూరగాయలతో ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చని చేసి చూపింది. తాము ఉంటున్న సముదాయంలో గృహిణులందరినీ ఓ గ్రూపుగా చేసింది. వ్యర్థాలను ఎరువుగా మార్చడం, వాటితో మొక్కల పెంపకం వంటి వాటిపై వర్క్‌షాపులు నిర్వహించేది. నాలుగేళ్లు శ్రమ పడ్డాక చుట్టుపక్కల వారంతా ఈ విధానాన్ని పాటించడం మొదలుపెట్టారు. వారిలో కొందరి వలంటీర్లుగా మారేలా స్ఫూర్తి కలిగించింది మోనీషా. ఈకో బజార్స్‌, ఈకో అవేర్‌నెస్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహించేలా శిక్షణనిచ్చింది.  అలా 2009లో ఈ గ్రూపు ‘రుర్‌ (రెడ్యూసింగ్‌, రీయూజింగ్‌, రీసైక్లింగ్‌)’ పేరుతో 100 సైట్లలో 200కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బయో కంపోస్టర్స్‌ ద్వారా దాదాపు 30 లక్షలమంది ఈ పద్ధతిపై అవగాహన పొంది, ఈ 12 ఏళ్లలో ఏటా 750 టన్నులకు పైగా వ్యర్థాలను రీసైకిల్‌ చేస్తున్నారు. వీరిలో కొందరు తాము తయారు చేసిన కంపోస్ట్‌ను విక్రయించే స్థాయికీ ఎదిగారు.

* రీసైకిల్‌గా... ఇదే కాక వేస్ట్‌ మేనేజిమెంటు సొల్యూషన్స్‌ దిశగా మోనీషా ఆలోచించింది. ‘రుర్‌ గ్రీన్‌ లైఫ్‌’ పేరుతో వ్యర్థాలను రీసైకిలింగ్‌ చేసి కొత్త ఉత్పత్తుల తయారీ ప్రారంభించింది. ఇందుకోసం కమ్యూనిటీలు, పాఠశాలలు, ముంబయిలోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, రిటైల్‌స్టోర్స్‌ సహా రిలయన్స్‌ ఫ్రెష్‌లోనూ ‘గో గ్రీన్‌ విత్‌ టెట్రాప్యాక్‌’ పేరిట అవగాహనా కార్యక్రమాలు మొదలుపెట్టింది. వాడేసిన టెట్రా ప్యాకెట్ల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సేకరించిన ప్యాకెట్లను ముందు గుజ్జులా చేసి, ఆ మిశ్రమంతో షీట్లను చేయించింది. వాటితో స్కూల్‌ బెంచీలు, కుర్చీలు, ఆఫీసు ఫర్నీచరు రూపొందించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో రుర్‌ వలంటీర్లూ యథాశక్తి సాయం చేశారు. ప్రస్తుతం ముంబయిలోని పలు పాఠశాలలు, కార్యాలయాలు, కాలేజీలు ఈ టెట్రాప్యాక్‌ ఫర్నిచర్‌ను వినియోగిస్తున్నాయి. ‘మా నాన్న ఇంజినీర్‌. సొంత వ్యాపారం చేసేవారు. అన్నయ్యా ఇదే రంగంలో ఉండటంతో నేనూ అదే చదవాలనుకునేదాన్ని. నాన్నతో కలిసి ఫ్యాక్టరీకి ఎళ్తే యంత్రాలను చూసి చాలా ఆసక్తి కలిగేది. నేను కూడా వ్యాపారిని కావాలనుకున్నా. పర్యావరణ రక్షణ, నా నా లక్ష్యం... రెండింటినీ కలిపే దిశగా ఈ ఫర్నీచర్‌ తయారీ ప్రారంభించా. ఇప్పుడు ప్రజల్లో దీనిపట్ల చాలా అవగాహన పెరుగుతుండటం సంతోషంగా ఉందంటోంది మోనీషా.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని