సేవలోనే ఆనందం...
close
Updated : 19/07/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సేవలోనే ఆనందం...

సంపన్న కుటుంబం... కెరియర్‌లో విజయాలు.... అవేవీ తృప్తినివ్వలేదు... ఆపైన పేద పిల్లల కోసం మొదలుపెట్టిన సేవ... కొవిడ్‌ బాధితుల దాకా విస్తరించింది... ఇదే సంతోషమంటున్న ‘హర్‌సంజమ్‌ కౌర్‌’ గురించి చదవండి...

సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టింది హర్‌సంజమ్‌ కౌర్‌. ముద్దుగా హ్యారీ అంటారు. ఇంగ్లండ్‌లో ఎంబీఏ చేసింది. కానీ కెరియర్‌లో ఎందుకో కుదురుకోలేదు. ఈలోపు పెళ్లయింది. వాళ్లది కోల్‌కతా అయినా భర్త ఉద్యోగరీత్యా చాలా సంవత్సరాలు ఎన్నో ఊళ్లలో గడిపారు. ఊరు మారిన ప్రతిసారీ ఇంటిని చక్కబెట్టుకోవడం ఆమెకి తెగ సరదాగా ఉండేది. కొత్తగా ఇల్లు సర్ది ముచ్చట పడుతున్నప్పుడు ఇంటీరియర్‌ డిజైన్‌ నేర్చుకుంటే ఇంకెంత బాగుండునో అనుకుని, ఆ కోర్సు చేసింది. తర్వాత అదే వృత్తి అయింది. అందులో విజయవంతమైంది. కానీ భర్త సంపాదన, తన కెరియర్‌తో పెద్దగా ఆనందమేమీ కలిగేది కాదు. మొదటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అవసరార్థులని ఆదుకున్న రోజున సంతోషం కలిగేది. తన సిసలైన ఆసక్తి సేవ అనిపించేది.

ఒకసారి ‘అమ్మూకేర్‌’ అనే సంస్థ ట్రెక్కింగ్‌, మెడిటేషన్‌ల కోసం మౌంట్‌ కైలాశ్‌ ట్రిప్‌ వేసింది. కొంచెం మార్పు ఉంటుందని అక్కడికి వెళ్లింది. దేశ విదేశాల నుంచి ఎందరో వచ్చారు. వాళ్లలో ఒక్కరికీ డబ్బు, హోదాల రంది లేదు. అందరిలో సేవాతత్పరతే. ఆ యాత్ర ఆమె జీవనవైఖరిని మార్చేసింది. తానూ సేవ చేయాలనుకుంది. 2018లో ‘ఆంగన్‌’ ఆరంభించింది. అమ్మూకేర్‌ స్థాపకుని పేరుతో ప్రేమగా ‘మోహన్‌జీ కా ఆంగన్‌’ అంటారు. ఇళ్లలో హింసించే వ్యక్తుల వల్ల భార్యలకే కాదు పిల్లలకీ నరకమే. వాళ్లని ఆదరించాలనేది ఆమె తపన. కూలీలు తమ పిల్లల్ని ఇక్కడ వదిలి పనికి వెళ్తారు. వాళ్లకి చదువుతోబాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది హ్యారీ. పేద కుటుంబాలకు నిత్యావసర సామగ్రితో మంత్లీ కిట్‌ ఇస్తుంది. పిల్లల్ని ఉత్సాహంగా ఉంచేందుకు ఆటపాటలూ, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తుంది.

‘ఆంగన్‌’ విజయవంతంగా నడుస్తుండగా కరోనా విపత్తు వచ్చింది. దానివల్ల ఎందరివో జీవితాలు తల్లకిందులయ్యాయి. ముఖ్యంగా వలస కూలీల జీవితాలు చితికిపోయాయి. ఆనందంగా గడపాల్సిన చిన్నారులు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో ఉండటం కౌర్‌ను కదిలించింది. లాక్‌డౌన్‌లో ఆంగన్‌ను మూసినా భోజన ఏర్పాటు ఆగలేదు. అధికారులు, పోలీసుల సాయంతో పదివేల మందికి భోజనం, మాస్కులు, శానిటైజర్లు అందించింది.  ఇది అనుకున్నంత సులువేమీ కాదంటుందామె. సంచార జీవితానికి అలవాటు పడిన చిన్నారులు ఒకచోట కూర్చోడానికి ఇష్టపడక పారిపోవడానికి చూస్తారు. క్రమశిక్షణ ముఖ్యమని లాలనతోనే కట్టిపడేస్తుంది. తల్లిదండ్రులు తమ కష్టనష్టాలు చెప్తుంటారు. ఒక ఐదేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు లైంగికంగా వేధించాడు. ఇలాంటి అమానవీయ ఘటనలతో తల్లులు భీతిల్లి ఉంటారు. ఆంగన్‌ వీలైనంత వరకూ వాటిని పరిష్కరిస్తుంది. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషిచేస్తుంది. చిన్నారులకు కళలూ, యోగా కూడా నేర్పిస్తూ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తోంది. వీళ్లకోసం వసతిగృహం ఏర్పాటుచేసి పూర్తి భద్రత కల్పించాలని, చురుగ్గా ఉన్న పిల్లల్ని పై చదువులు చదివించాలని ప్రయత్నిస్తోంది హ్యారీ.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని