లక్ష మంది ఆకలి తీర్చింది!
close
Updated : 21/07/2021 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్ష మంది ఆకలి తీర్చింది!

పెద్ద సంస్థలు, ఆకర్షించే భవనాలు, అందివస్తున్న అవకాశాలు.. భవిష్యత్‌ నిర్మించుకోవచ్చనుకుంది. కానీ ఇంకోవైపు కాలే కడుపులు, ఒక్క పూట తిండి కోసం ఎదురుచూసే చిన్నారులుండటం గమనించింది. వాళ్ల మొహాల్లో వృథా చేస్తున్న ఆహారం కనిపించింది. దాన్ని సేకరిస్తే వీళ్ల కడుపు నింపొచ్చనుకుంది. సనా అరోరాకి వచ్చిన ఆ ఆలోచన.. నాలుగేళ్లలో లక్షకుపైగా పేదల ఆకలి తీర్చింది.

సనా అరోరా కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌లో ఎంబీఏ చేసింది. ఈమెది చండీగఢ్‌. ముంబయి తన కలల నగరం. అక్కడ ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ, ఆకర్షణీయమైన నగర జీవితాన్ని గడపాలన్నది ఆమె కల. అది 2012.. అనుకున్నట్టుగానే బ్రాండ్‌ మేనేజర్‌గా ఉద్యోగం సాధించింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. సరదాగా నగర వీధుల్లో తిరిగొద్దామనుకుని బయల్దేరింది. పెద్ద భవంతులు, విలాస జీవితం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓ చోట కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది పిల్లలను గమనించింది. ఒక పిల్లాడు ఆకలేస్తోందని పొట్ట చూపుతూ సైగలు చేయడం ఆమెను కదిలించింది. తన దగ్గరున్న వాటిని వాళ్లకి ఇచ్చేసింది.

ఆరోజు నుంచి ఆఫీసుకి వెళ్లి వచ్చే దారిలో తరచూ ఆకలితో అలమటించే ఎంతోమంది పిల్లల్ని చూసేది. అప్పుడే ఓవైపు తళుకుమని మెరిసే నగర జీవితంతోపాటు ఒక్కపూట గడవని జీవితాలూ ఉన్నాయని అర్థమైంది. ఆకలేస్తోందని చెప్పలేక కడుపులు చూపించే చిన్నపిల్లల్ని చూస్తే బాధేసేది. ఓపక్క ఆహారం ఎక్కువై పడేసే వారుంటే ఒక్కపూట తిండి కోసం తపన పడుతుండటం ఆమెను కదిలించింది. వాళ్ల మొహాల్లో ఆ వృథా చేస్తున్న ఆహారమే కనిపించేది. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆ వృథా అవుతున్న ఆహారాన్నే సేకరించి వీళ్లకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. రోజూ తన, పక్క ఇళ్లలో రాత్రి మిగిలిన ఆహారాన్ని సేకరించి, వారికివ్వడం మొదలుపెట్టింది. కానీ అది ఎంతో మంది కడుపు నింపలేకపోతోందని సనాకి అర్థమైంది.
స్నేహితుల సాయంతో తను నివసించే చోటుతో పాటు కొన్ని రెస్టరెంట్లతో మాట్లాడి ఆహారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. మొదట చాలామంది వింతగా చూసేవారు. తర్వాత్తర్వాత అర్థం చేసుకుని, వండి మరీ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఎన్నాళ్లిలా అని ఆలోచించింది. రోజూ ఇవ్వడమంటే అందరికీ ఇబ్బందే. పైగా రోజూ ఆహారం మిగులుతుంటుందని చెప్పలేం. వాతావరణం బాగా లేని సందర్భాల్లో సేకరణ, పంచడం రెండూ ఇబ్బందయ్యేవి. వంట సామగ్రిని వారికే అందజేస్తే అవసరాన్నిబట్టి వాళ్ల ఆహారాన్ని వాళ్లే ప్లాన్‌ చేసుకుంటారనిపించింది. 2017లో ‘ఫీడెమ్‌’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా వేల మంది నిస్సహాయులు, ఇల్లు లేనివారు, రాత్రి బడుల్లో చదివేవారికి, వృద్ధులకు వంట సామగ్రిని రేషన్‌గా ఇవ్వడం ప్రారంభించింది. రాత్రి బడుల్లో హాజరు బాగున్న వారికి రివార్డులనూ ఇచ్చేది. వీటికి నిధులను తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి సేకరించింది. అప్పుడప్పడూ ఫుడ్‌ డ్రైవ్‌లను నిర్వహించి, సేకరించేది. అలా ఇప్పటివరకూ 100కుపైగా డ్రైవ్‌లను నిర్వహించింది.  
ఓపక్క ఉద్యోగం చేస్తూనే వీటినీ నిర్వహిస్తోంది. భర్త ఓంకార్‌ భట్‌ కూడా ఆమెకు తోడుగా నిలుస్తున్నారు. సనా ప్రస్తుతం మహీంద్రా రైజ్‌లో ఇన్నొవేషన్‌ మేనేజర్‌గా చేస్తోంది. ఈమె సేవలను గుర్తించి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం 2018 నుంచి గ్లోబల్‌ షేపర్‌గా ఎంపిక చేస్తోంది. సనా స్ఫూర్తితో వెయ్యిమందికి పైగా వాలంటీర్లూ ఆమెకు తోడయ్యారు. కొంతమంది డ్రైవ్‌ల నిర్వహణలోనూ మరికొంతమంది పేదలను గుర్తించి వాటిని పంచడంలోనూ సాయపడుతున్నారు. అలా తన సంస్థ ప్రారంభమైన ఈ నాలుగేళ్లలో లక్షమందికి  పైగా ఆహారాన్ని అందించింది. ‘ఆకలి విలువ నాకు తెలుసు. ఎవరైనా ఒక ముద్ద పెట్టకపోతారా అని చూసే వారి జాలి చూపులే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేలా చేశా’యంటుంది సనా. ఆమె అర్థం చేసుకోవడంతోపాటు మరెందరికో దాని విలువను తెలియజేసి.. సాయానికి ముందుకు రప్పించడం అభినందనీయమే కదూ!అనుకున్నది సాధించేంతవరకూ ప్రయత్నిస్తూనే ఉంటాను. అంతవరకూ ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మధ్యలో జరిగే పొరపాట్లు కూడా నాకు పాఠాలే.
- శిఖా శర్మ, ఆర్థికవేత్త


 


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని