ఒలింపిక్స్‌లో.. చెరగని సంతకాలు!
close
Published : 23/07/2021 06:09 IST

ఒలింపిక్స్‌లో.. చెరగని సంతకాలు!

వాళ్ల రికార్డులని తిరగరాయడం అంత సులభం కాదు...  మగవాళ్లతో పోటీపడ్డారు... వైకల్యాన్ని జయించారు... కష్టాలకు ఎదురీదారు...  గెలుపుకోసం పరితపించి తిరుగులేని విజయాలని సొంతం చేసుకున్నారు. 125 ఏళ్ల ఒలింపిక్‌ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాలు లిఖించుకున్న క్రీడా జ్యోతుల్లో కొందరి కొందరి మననం ఇదీ...

ఒలింపిక్‌ కోలాహలం ఇవాళే మొదలు...  1900 సంవత్సరంలో 2.2తో మొదలైన మహిళా ప్రాతినిథ్యం 49శాతానికి చేరుకునేటప్పటికి 2021 వచ్చింది. ఆకాశంలో సగమని చెప్పే మనం ఈ విశ్వ క్రీడల్లో సగానికి చేరుకునేటప్పటికి 125 ఏళ్లు పట్టింది!! ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో మొదలయ్యాయి. వీటిలో పాల్గొనే అవకాశాన్ని మహిళలకు ఇవ్వలేదు.  రెండోది అంటే... 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో మొదటి మహిళ కాలుమోపింది. ‘హెలెన్‌ డి పౌర్టాలస్‌’ యాట్‌ బృందంలో సభ్యురాలిగా పాల్గొంది. అంతే కాదు ఒలింపిక్‌ పతకాన్ని గెలిచిన తొలి మహిళగానూ నిలిచింది. ఈమె బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది.

3 పోటీలు, 18 పతకాలు

లారిసా లాటినినా సోవియట్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్ట్‌. తనకు 11 నెలల వయసులో తండ్రి ఈమెనీ, తల్లినీ వదిలేసి వెళ్లిపోయాడు. నిరక్షరాస్యురాలైన తల్లే పెంచింది. ఆసక్తి మేరకు బ్యాలే నేర్చుకుని, తర్వాత జిమ్నాస్ట్‌గా మారింది. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. 1956లో, 21 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో మొదటిసారిగా పాల్గొని బంగారు పతకాన్ని గెల్చుకుంది. మొత్తంగా మూడు ఒలింపిక్‌ పోటీల్లో 18 పతకాలను గెల్చుకుని అత్యధిక పతకాల రికార్డును నెలకొల్పింది. 2012లో అమెరికన్‌ స్విమ్మర్‌ మైఖేల్‌ ఫెల్ఫ్స్‌ ఈమె రికార్డును బద్దలుకొట్టాడు. అంటే.. లారిసా ఘనతను మరొకరు అందుకోవడానికి 48 ఏళ్లు పట్టిందన్నమాట!

మగవాళ్లతో పోటీపడి..

బేబ్‌ డిడ్రిక్సన్‌ జహారియాస్‌... ముద్దుపేరు బేబ్‌. పుట్టింది టెక్సాస్‌లో. చిన్నప్పుడు ఇరుగుపొరుగు మగపిల్లలతో కొట్లాడి గెలిచిన అనుభవమే ఆమె క్రీడల్లోకి రావడానికి కారణమయ్యిందట. క్రీడారంగం ‘లెజెండ్‌’గా కీర్తించే గొప్ప క్రీడాకారిణి ఈమె. సాధారణంగా ఏదో ఒక ఆటలో రాణించే వాళ్లని చూస్తుంటాం. బేబ్‌ అలాకాదు. బాస్కెట్‌బాల్‌, ట్రాక్‌, గోల్ఫ్‌, బేస్‌బాల్‌, ఈత, డైవింగ్‌, బాక్సింగ్‌, బిలియర్డ్స్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, స్కేటింగ్‌ ఇలా ఆమె అడుగుపెట్టని ఆటంటూ లేదు. 1932 ఒలింపిక్స్‌లో ఆమె అడుగుపెడుతూనే సాధించిన విజయాలు సంచలనం సృష్టించాయి. అవకాశం ఇచ్చిన ప్రతి ఈవెంట్‌లోనూ పతకాలు గెల్చింది. మగవాళ్లతో పోటీపడి వాళ్ల రికార్డులనీ బద్దలుకొట్టింది. 2021 ఒలింపిక్స్‌లో ఎవరైనా ఆమె రికార్డులని బద్దలుకొడతారేమో చూడాలి.

వైకల్యాన్ని గెలిచిన టోర్నడో

విల్మా రుడాల్ఫ్‌ని ట్రాక్‌లో కనిపించే ‘టోర్నడో’ అని పిలుస్తారంతా. భూమ్మీద అత్యంత వేగంగా పరుగెత్తే మహిళగా పేరున్న విల్మా... 22 మంది సంతానంలో ఒకరు. పేదరికం... ఆకలి కారణంగా బాల్యంలో అనారోగ్యం పాలై కాలికి అమర్చిన పరికరాల సాయంతో నడిచేది. ‘డాక్టర్‌ నన్ను జీవితంలో నడవలేవు అన్నాడు. అమ్మ మాత్రం నువ్వు పరుగుపెడతావు అంది. నాకు అమ్మ మాటపైనే గురి. అందుకే వైకల్యాన్ని గెలిచాను’ అనే విల్మా... తర్వాత ఒలింపిక్స్‌ పరుగులో స్వర్ణాలు గెల్చుకుని టోర్నడో అనిపించుకుంది.

మన మల్లీశ్వరి!

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా అథ్లెట్‌ నీలిమ ఘోష్‌. 1952 హెల్సింకీ లో జరిగిన ఈ పోటీలకు ఎంపికైనప్పుడు తన వయసు 17 ఏళ్లే! తరువాత చాలా మంది మహిళలు పాల్గొన్నా పతకం తెచ్చింది మాత్రం... కరణం మల్లీశ్వరే. తనది ఆంధ్రప్రదేశ్‌లోని వూసవాని పేట అనే చిన్న పల్లెటూరు. 12 ఏళ్ల వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రారంభించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలను గెలుచుకుంది. 2000 సిడ్నీలో కాంస్యాన్ని గెలిచింది. దేశం తరఫున ఒలింపిక్‌ పతకాన్ని సాధించిన తొలి మహిళగానూ నిలిచింది. ‘ఐరన్‌ లేడీ’గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ దేశానికి పతకాన్ని సాధించిన ఏకైక విమెన్‌ వెయిట్‌ లిఫ్టర్‌గా రికార్డు ఆమెదే! తరువాత... సైనా నెహ్వాల్‌, మేరీ కోం, పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు వారి క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిపెట్టారు. వీరి విజయాలు ఎందరో అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన జట్టులో 56 మంది మహిళలు. వీలైనంత ఎక్కువ మంది పతకాలు సాధించాలని మహిళా లోకం ఆకాంక్షిస్తోంది.

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని