తెలుగు, తమిళం నేర్పించే బెంగాలీ భామ
close
Published : 26/07/2021 01:22 IST

తెలుగు, తమిళం నేర్పించే బెంగాలీ భామ

తెలుగువాళ్లు తెలుగు కంటే ఆంగ్లం మాట్లాడ్డానికి మోజు చూపుతుంటే బెంగాలీ యువతి అభిలాషా ఛటర్జీ మాత్రం తెలుగు నేర్చుకోవడమే కాదు, నేర్పిస్తూ పిల్లల్నీ, పెద్దల్నీ కూడా ఆకట్టుకుంటోంది...

శ్చిమ బంగలో పుట్టిపెరిగిన అభిలాషా ఛటర్జీ ‘హాట్‌స్టార్‌’లో రిక్రూటర్‌గా ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది. నగరం నలుమూలల నుంచీ వచ్చినవాళ్లతో పరిచయాలయ్యాయి. ముఖ్యంగా తమిళులు, తెలుగువాళ్లతో అనుబంధం ఏర్పడింది. అంతకుమించి తెలుగు, తమిళ పాటలు తెగ నచ్చేయడంతో ఆ భాషలంటే ఇష్టం ఏర్పడింది. ఇక రెండింట్లోంచీ కొన్ని పదాల చొప్పున నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒకేసారి ఎక్కువెక్కువ కానందున భారమనిపించక సరదా సరదాగా నేర్చేసుకుంది.

లాక్‌డౌన్‌లో ఏదైనా మంచిపని చేయాలని ఆలోచిస్తున్నప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ప్రాథమిక సూత్రాలు ఇతర భాషలవాళ్లకి నేర్పిస్తే బాగుంటుంది.. అనుకుంది. పైగా తాను బెంగాలీ అయ్యుండి పరభాష నేర్పడం ఆసక్తి కలిగిస్తుంది అనిపించింది.  వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘భాష విత్‌ అభిలాష’ పేజీ క్రియేట్‌ చేసింది. ఆమె అంచనా తప్పకపోగా, ఆశ్చర్యకరంగా మర్నాటికే 46 వేలమంది ఫాలోవర్స్‌ వచ్చారు.

‘తెలుగు, తమిళాల్లో నా ఉచ్చారణ గొప్పగా నిర్దుష్టంగా ఉంటుందని నేను చెప్పను. ఇప్పటికీ సుదీర్ఘ సంభాషణలు సాగించాలంటే కొంచెం కష్టమే. నేనింకా నేర్చుకోవాల్సి ఉన్నా వచ్చినంతలో స్వచ్ఛంగా, స్పష్టంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది. చాలామంది తెలుగువాళ్లతో స్నేహం ఉన్నందున అది నేర్చుకున్నాను. ఇక తమిళం ఎందుకంటే అది వినసొంపుగా ఉంటుంది. తెలుగు-కన్నడ, తమిళం-మలయాళం దగ్గరగా ఉన్నప్పటికీ ఆ రెండు భాషలూ రావు. ముఖ్యంగా మలయాళం నేర్చుకోవడం చాలా క్లిష్టమనిపిస్తుంది’ అంటోంది.

మూడు నెలల క్రితం తన వీడియో ఒకటి 17 లక్షల వీక్షణలు దాటడం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అని గిల్లి చూసుకుంది. కేవలం వ్యూస్‌ పెరగడమే కాదు ఎందరో పెట్టే మెసేజ్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఒక తమిళమ్మాయి తన అత్తగారిని ఆకట్టుకోడానికి తెలుగు నేర్చుకుంటోంది. 56 ఏళ్ల గుజరాతీ మహిళ తన కొడుకు చేసుకోబోయే అమ్మాయితో మనసులో మాటలు పంచుకోడానికి తెలుగు నేర్చుకుంటోంది. ఇంకా చిన్నచిన్న పదాలు కూడా రాని తమ పాపాయి ఈ వీడియోలు చూస్తూ అచ్చం అలా పలుకుతోంది. ఇలాంటి సందేశాలు చూసి మురిసిపోయే అభిలాష.. ‘నేను చెప్పేదల్లా ఒక్కటే.. నా వీడియోలతో మీకు తెలుగు, తమిళం అద్భుతంగా వచ్చేస్తాయని, పండితులైపోతారని చెప్పను. కానీ ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పనిమనిషి, వంటమనిషి, ఆటో డ్రైవర్లతో తేలిగ్గా మాట్లాడగలరు. షాప్‌కి  వెళ్లి అవసరమైనవి అడగగలరు’ అంటుంది. లాక్‌డౌన్‌లో పనికొచ్చే పనే చేసింది కదూ!

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని