Tokyo Olympics: మాకే ఎందుకు?
close
Updated : 27/07/2021 09:55 IST

Tokyo Olympics: మాకే ఎందుకు?

ఇంకెన్నాళ్లు?

ఒలింపిక్స్‌లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతామని, 49 శాతం మహిళలు పాల్గొనేలా చూస్తామని... ఆ మేరకు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కొన్ని నిబంధనలు మహిళలపై వివక్ష ఇంకా తొలగలేదని రుజువు చేస్తున్నాయి.

క్యాప్‌ ధరించకూడదా?

టోక్యో ఒలింపిక్‌లో ఆఫ్రికాకు చెందిన స్విమ్మింగ్‌ క్రీడాకారిణులు తలకు టోపీలు ధరించకూడదని తాజాగా ఓ నిబంధన వెలువడింది. ఈతకొట్టేటప్పుడు ఆఫ్రికా క్రీడాకారిణులు ధరించే సోల్‌క్యాప్‌ను తిరస్కరిస్తున్నట్లు ‘ద ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఫర్‌ కాంపిటేషన్స్‌ ఇన్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ (ఫినా)’ ప్రకటించింది. ఇకపై స్విమ్మింగ్‌లో ఈ క్యాప్‌కు స్థానం లేదని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరిగేటప్పుడు ముందుగా స్విమ్మింగ్‌ క్రీడాకారులు ధరించే దుస్తులు, టోపీ వంటి వాటి డిజైన్‌ను ఫినా వద్ద తయారీ సంస్థలు అనుమతి తీసుకోవాలి. గతేడాది రూపొందించిన  సోల్‌క్యాప్‌ డిజైన్‌ను ది బ్రిటిష్‌ సంస్థ అనుమతి కోసం ఫినాకు పంపగా, పరిమాణంలో పెద్దగా ఉందంటూ దాన్ని నిరాకరించి, క్రీడాకారిణులందరినీ నిరాశకు గురిచేసింది. ఆఫ్రికా మహిళా స్విమ్మర్స్‌ తమ వంకీల జుట్టును సోల్‌క్యాప్‌లో ఉంచి ఈతకొలనులోకి దిగుతారు. ఇలా అయితే వీరికి ఏ ఆటంకమూ ఉండదు. తాజా నిబంధన వల్ల క్రాఫ్‌ లేదా  స్ట్రెయిట్‌నింగ్‌ చేయించుకోవాలి. క్రీడల్లో పాల్గొనాలంటే హెయిర్‌స్టైల్‌ను మార్చుకోవడం తప్పనిసరి అనే భావం ప్రస్తుతం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఈ తరహా పద్ధతి అందరినీ నిరుత్సాహానికి గురి చేసిందని, భవిష్యత్తులో ఈ రంగంలోకి అడుగుపెట్టే యువక్రీడాకారిణులకు ఇదొక అవరోధంగా మారొచ్చని ద బ్లాక్‌ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అంతేకాదు  స్ట్రెయిట్‌నింగ్‌కు వాడే రసాయనాల వల్ల క్యాన్సర్‌, ఆస్తమా వంటి అనారోగ్యాలకు గురిచేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఎన్నాళ్లీ వివక్ష అంటూ పలువురు ప్రముఖ క్రీడాకారిణులు ప్రశ్నిస్తున్నారు.

దుస్తులకూ పాయింట్లా!

సాధారణంగా మగ జిమ్నాస్ట్‌లు వదులుగా ఉండే షార్ట్‌ లేదా కాళ్లు కూడా కవర్‌ అయ్యేలా ప్యాంట్‌లను వేసుకుంటారు. కానీ అమ్మాయిల దగ్గరిచ్చేసరికి బోలెడన్ని షరతులు. వీళ్లు కాళ్లు మొత్తం కనిపించేలా లియోటార్డ్‌ దుస్తులనే ధరించాలి. అలా కాకుండా మొత్తం కప్పుతూ ఉండేలాంటివి వేసుకుంటే పాయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. జిమ్నాస్టిక్స్‌ చేసే క్రమంలో దుస్తులు పక్కకు తొలగుతాయన్న భయమే కాకుండా మగ జడ్జిల ముందు ప్రదర్శించడానికి ఇబ్బందిపడే జిమ్నాస్ట్‌లూ ఎంతోమంది. లైంగిక వేధింపుల సమస్యల తార్కాణాలూ లేకపోలేదు. ఈ సమస్యతోపాటు మతపరమైన అంశాల దృష్ట్యా నచ్చిన దుస్తులు వేసుకునే వీలు కల్పించమంటే గతంలో అనుమతివ్వలేదు. దీంతో చాలామంది మహిళలు జిమ్నాస్టిక్‌ చేసే క్రమంలో దుస్తులను బంకతో ఒంటికి అతికించుకునేవారు. దీని వల్ల చర్మ సంబంధమైన సమస్యలెదురైనా ఈ విధానానికే మొగ్గు చూపేవారు. కానీ ఈ ఒలింపిక్స్‌లో జర్మనీ జిమ్నాస్ట్‌లు సెక్సువలైజేషన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈసారి మడమల వరకూ కప్పేసేలా ఉండే దుస్తులను ధరించారు. అలా హై కట్‌ బికినీ బాటమ్స్‌కు వ్యతిరేకంగా నిలిచారు. దుస్తుల ఎంపిక లైంగిక వేధింపులకూ ఆస్కార మివ్వదంటున్నారు. ఈ మార్పు ఏ దిశగా వెళుతుందో చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి!

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని