కూరగాయలతో కోటి వ్యాపారం
close
Published : 29/07/2021 01:57 IST

కూరగాయలతో కోటి వ్యాపారం

కోటి ఆశలతో మొదలుపెట్టిన వ్యాపారం నష్టాలు మిగిల్చింది... ప్రేమపెళ్లి చేసుకుందని అమ్మానాన్నల ప్రోత్సాహమూ లేదు... ఉన్నదల్లా గుండెలనిండా ఆత్మవిశ్వాసమే! ఆ ధైర్యమే చిన్నవóŸసులోనే అర్చనని వ్యాపారవేత్తని చేసింది. మహిళలకు మిద్దెతోటల్ని పరిచయం చేస్తూ, సేంద్రియ ఉత్పత్తుల్ని అందిస్తూ... మరోపక్క వందలాది రైతన్నలకు అండగా నిలుస్తున్న అర్చన స్టాలిన్‌ గెలుపు కథ ఇది...
కష్టానికీ... నష్టానికీ దూరంగా ఉండటానికే మనమంతా ఇష్టపడతాం. కానీ అర్చన అలా కాదు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కాలేజీలో జియో ఇన్ఫర్మేటిక్స్‌ చదివింది తను. సహాధ్యాయి స్టాలిన్‌ కాళిదాసును ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దూరం పెట్టారు. అప్పుడే తనేంటో నిరూపించుకోవాలనుకుంది అర్చన. 2012లో ‘జియోవెర్జ్‌’ అనే పరికరాల సంస్థని భర్తతో కలిసి ప్రారంభించింది. తన నగలు అమ్మి, స్నేహితుల చేబదుళ్లతో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టింది. రెండేళ్లలోనే ఆ వ్యాపారం నష్టాల్లోకి జారుకొంది. అప్పటికి తన వయసు 22. మరొకరయితే మళ్లీ వ్యాపారం మాటెత్తే వారు కాదేమో. కానీ అర్చన నష్టాల నుంచి గెలుపు పాఠాల్ని నేర్చుకుంది.

రెండెకరాలతో మొదలు...

అప్పులు తీర్చడానికి ఉద్యోగంలో చేరింది అర్చన. మరోపక్క మార్కెటింగ్‌లో అనుభవాన్నీ సంపాదించింది. ఈసారి తన దృష్టి సేంద్రియ, పట్టణ వ్యవసాయంపై పడింది. కానీ లోతు తెలియకుండా అడుగుపెట్టకూడదనేది అనుభవం నేర్పిన పాఠం. అందుకే ఆ రంగంలో అనుభవజ్ఞులనీ, రైతులను కలుసుకుంది. ఏ సీజన్లలో, ఏయే పంటలను పండించొచ్చు, సాగులో సాధక బాధకాలు వంటి వాటిని అధ్యయనం చేసింది. ఆ తర్వాతే 2016లో ‘మై హార్వెస్ట్‌’ సంస్థను ప్రారంభించింది. ‘ఇది వ్యాపారం అనుకోలేదు. అందరికీ ఉపయోగపడే ఓ మంచి పని అనుకున్నా. బాల్కనీల్లో, మిద్దెపైన కాయగూరలు, ఆకుకూరలను పండించుకోవడంలో శిక్షణనిస్తాం. కావాల్సినవీ సమకూరుస్తాం. సొంతంగా పండించి, వండుకోవడంలోని సంతోషమే వేరు. ఇదే చాలామంది మహిళలను ఈ బాల్కనీ వ్యవసాయంవైపు ముందుకొచ్చేలా చేసింది. మొదట నా మెట్టినిల్లైన విరుదునగర్‌లో ప్రారంభించా. తర్వాత 10 పాఠశాలల్లో సేంద్రియ పద్ధతుల్లో కాయగూరలు పండించడం నేర్పించే దాన్ని. తిరువళ్లూరులో రెండు ఎకరాలను ఏడాదికి రూ.25 వేలకు అద్దెకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించా. ఏడాది అయ్యేసరికి మా కాయగూరలని చెన్నైలోని ప్రముఖ సేంద్రియ ఉత్పత్తుల దుకాణాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టా. ఆసక్తి ఉన్న వారికి మా పొలంలో కూరగాయలను పండించి ఇస్తామని చెప్పాం. నెలకు రూ.3 వేలు కడితే ప్రతి వారం వారి స్థలంలో కూరగాయలను వారే తీసుకెళ్లొచ్చు. 18 కుటుంబాలతో మొదలై ఇప్పుడు 10 వేల కుటుంబాలకు మా ఉత్పత్తులు అందిస్తున్నాం. మీకు కాయగూరలు పండించి ఇస్తాం అని చెప్పినప్పుడు చాలామంది నన్ను వింతగా, అపనమ్మకంగా చూశారు. తర్వాత వారే ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అందుకే వెంబు ఫార్మ్స్‌ పేరుతో చుట్టుపక్కల రైతులను కూడా కలుపుకొన్నా. మొదటి ఏడాదిలో రూ.8 లక్షల వ్యాపారాన్ని చేశాం. రెండో ఏడాదికి రూ.44 లక్షలకు చేరింది. గతేడాది కోటి రూపాయల వ్యాపారం చేశా. ప్రస్తుతం 500 మందికిపైగా రైతులతో కలిసి పనిచేస్తున్నా’ అని వివరించింది అర్చన.

సవాళ్లను దాటుకుని..

గతేడాది లాక్‌డౌన్‌లో అధికారుల అనుమతి తీసుకుని మరీ వినియోగదారులకు కూరగాయలను అందించింది. వాటి నాణ్యత బాగుండటంతో బియ్యం, పప్పు, నూనె వంటివీ కావాలనే వారు. చిరుధాన్యాల స్నాక్స్‌నూ అడిగే వారు కొందరు. అవన్నీ అర్చన వ్యాపారం విస్తరించడానికి సహకరించాయి. ఇప్పుడు కూరగాయలతోపాటు... నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేస్తున్న అర్చన పలువురు ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంటోంది. టెడెక్స్‌ వంటి వేదికలపైనా అనుభవాలను పంచుకుని యువత మనసు దోచుకుంటోంది.


కష్టానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. ఎటువంటి ఛాలెంజ్‌లెదురైనా నీ కలలను మాత్రం వదిలేయకుండా పోరాడు. సాధించేవరకు వాటిని వెంటాడుతూనే ఉండు. ఓ మహిళగా ఆత్మవిశ్వాసంతో నువ్వు సాధించే విజయం ఎంతో తృప్తినిస్తుంది.

  - సాక్షిమాలిక్‌, ఇండియన్‌ రెజ్లర్‌

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని