178 మందిలో టాపర్‌...నాన్న స్ఫూర్తితోనే సివిల్స్‌
close
Updated : 05/08/2021 06:09 IST

178 మందిలో టాపర్‌...నాన్న స్ఫూర్తితోనే సివిల్స్‌


వైఫల్యం ఆ ఇద్దరమ్మాయిలనీ వెక్కిరించింది. ఒకట్రెండుసార్లు కాదు.. ఒకరిని నాలుగుసార్లయితే ఇంకొకరిని అయిదుసార్లు. కానీ విఫలమైన ప్రతిసారీ వాళ్లు మరింత గట్టిగా ప్రయత్నించారు. కల నెరవేర్చుకోవాలన్న పట్టుదల ఒకరిదైతే.. తండ్రి నింపిన స్ఫూర్తితో ముందుకుసాగిందింకో అమ్మాయి. దేశంలోనే అత్యుత్తమ సర్వీస్‌.. సివిల్స్‌ శిక్షణ పూర్తిచేసుకుని ఐపీఎస్‌ బాధ్యతలను చేపట్టనున్న రంజితా శర్మ, రష్మి పెరుమాళ్‌ల గురించే ఇదంతా. వారి స్ఫూర్తిగాథల్ని వసుంధరతో పంచుకున్నారిలా!

ప్రధాని ఆ సలహా ఇచ్చారు

 రంజితా శర్మ, రాజస్థాన్‌ కేడర్‌

పోలీస్‌ యూనిఫాం ధరించాలన్నది తన కల. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అయిదుసార్లు విఫలమయ్యారు.ఆరో ప్రయత్నంలో విజయాన్నే కాదు.. ఐపీఎస్‌ శిక్షణ అందుకున్న 178 మందిలో టాపర్‌గానూ నిలిచారు. అంతేకాదు..ప్రతిష్ఠాత్మక స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌నీ అందుకోనున్నారు. ఏడు దశాబ్దాల అకాడమీ చరిత్రలో ఒక అమ్మాయి బెస్ట్‌ అవుట్‌డోర్‌ ప్రొబేషనర్‌గా ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాక పరేడ్‌లో అందించే 50 ట్రోఫీల్లో ఎనిమిదింటినీ రంజితానే గెల్చుకోవడం విశేషం. ‘మాది హరియాణలోని ఫరీదాబాద్‌. రేవడి నా స్వస్థలం. నాన్న సతీష్‌కుమార్‌ శర్మ, అమ్మ సవితాశర్మ. సివిల్స్‌ దిశగా ప్రోత్సహించింది నాన్నే. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో బీఏ ఆనర్స్‌, ఆపై దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూÆÆట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ నుంచి పీజీ చదివా. పీఆర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. చాలామంది ‘ఎందుకు సమయం వృథా చేసుకుంటావ్‌? ఉద్యోగంపై దృష్టిపెడితే ప్రమోషన్‌ వస్తుందిగా!’ అనేవారు. లక్ష్యాన్ని చేరుకోలేక బాధపడినప్పుడూ, ఒత్తిడిని జయించడానికీ అమ్మా, వదినలు అండగా నిలిచారు. ఐపీఎస్‌ శిక్షణ కఠినంగానే ఉంటుంది. కానీ అది నా గురించి నాకే తెలియని ఎన్నో విషయాలని నేర్పింది. అవుట్‌ డోర్‌లో 40 కి.మీ. దూరాన్ని జయించానంటే శిక్షణ వల్లే. పోలీసులకు ధైర్యం తర్వాత ఉండాల్సిన సహనాన్నీ నేర్పింది. స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌, బెస్ట్‌ ఆల్‌రౌండ్‌  ఐపీఎస్‌ ప్రొబేషనర్‌గా ప్రధానమంత్రి బేటన్‌ వంటివి అందుకోవడం సంతోషంతో పాటు బాధ్యతనూ పెంచాయి. ప్రధాని మోదీ.. ‘నీ విజయం తర్వాత సమాజంలో గమనించిన మార్పేంట’ని అడిగారు. ఎంతోమంది ఆడపిల్లలు ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని చెప్పా. ‘నువ్వు దేశంలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా వారంలో ఒక గంట బాలికల పాఠశాలకు వెళ్లు. వాళ్లతో మాట్లాడు, వాళ్లు చెప్పింది విను. నీలాంటి వాళ్లే ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి’ అని సలహా ఇచ్చారు. చాలా సంతోషమేసింది. నాలాగే మీరూ సాధించొచ్చు. కాకపోతే సమయాన్ని తెలివిగా వాడుకోవాలి.. ఇదే అమ్మాయిలకు నేనిచ్చే సలహా’ అంటున్నారు రంజిత.


నాలుగు సార్లు విఫలమైనా..
- రష్మి పెరుమాళ్‌, తెలంగాణ కేడర్‌

రష్మి పెరుమాళ్‌ది సైనిక కుటుంబం. తండ్రి కర్నల్‌ డాక్టర్‌ మాధవ పెరుమాళ్‌ విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్‌ యుద్ధంలోనూ పాలొన్నారు. ఆయన మరణం లక్ష్యసాధన పట్ల తన పట్టుదలను మరింత దృఢతరం చేసింది అంటారు రష్మి. ‘నాన్న తెలుగువారే. ఆయన ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగినా.. సికింద్రాబాద్‌తో నాకు అనుబంధం ఎక్కువ. చిన్నతనం నుంచీ చదువులో ముందుండటంతో స్కూల్‌ రోజుల నుంచే అమ్మ నన్ను సివిల్స్‌ రాయమని ప్రోత్సహించింది. నేను దెహ్రాదూన్‌లో లా రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. డిగ్రీ తర్వాత నల్సార్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీజీ చేశాను. అన్నయ్య నాన్న బాటలో ఆర్మీలోకి వెళ్లాడు. మనకు బాధ కలిగినప్పుడో, కష్టం వచ్చినప్పుడో ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తేలికే. కానీ అందులో భాగమైనప్పుడే కదా.. సమస్య మూలాలు తెలిసేది? అందుకే సివిల్స్‌ రాయాలనుకున్నాను. నాలుగుసార్లు విఫలమైనా ఈసారి విజయం సాధించాను. మొదటి రెండుసార్లూ అంత సీరియస్‌గా ప్రయత్నించలేదు. మూడోసారి దిల్లీలో శిక్షణ తీసుకున్నాను. ఓటమి ఎదురైన ప్రతిసారీ బాధనిపించేది. ఆ సమయంలో ‘అసలు నేనీ పరీక్షలు ఎందుకు రాయాలనుకుంటున్నాను?’ అని ప్రశ్నించుకునేదాన్ని. అప్పుడు నాన్న మాటలు గుర్తుకొచ్చేవి. వాటితోపాటు ఆయన మరణం నా లక్ష్యాన్ని మర్చిపోకుండా చేయడమే కాక, సాధించి తీరాలనే పట్టుదలనీ నింపాయి. అమ్మ ప్రోత్సాహమూ తోడైంది. ఫలితమే ఇప్పటి నేను. విధి నిర్వహణలో నేను చదివిన లా ఒక సమస్యని అన్ని కోణాల్లో పరిశీలించి, పరిష్కరించడంలో సాయపడుతుందని నమ్ముతున్నా’ అంటున్నారు రష్మి.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని