ఔషధ టీలతో... ఔరా అనిపిస్తూ!
close
Published : 09/08/2021 01:09 IST

ఔషధ టీలతో... ఔరా అనిపిస్తూ!

మాంఛి ఘుమఘుమలాడే టీ పెట్టడం ఆమెకు ఇష్టం. ఆ రుచులను అందరికీ పంచడం మరింత ఇష్టం. తాతయ్య నేర్పిన ఈ తేనీటి రుచులను చుట్టుపక్కల వారికే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసింది. న్యాయవాద వృత్తిని వదిలి ఛాయ్‌వాలీగా మారింది.

పమా విర్ది చంఢీగఢ్‌లో పుట్టింది. పెరిగింది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో. 2013లో న్యాయవిద్యను పూర్తిచేసి అత్యున్నత న్యాయ స్థానంలో న్యాయవాదిగానూ సేవలందించింది. విర్ది తాతయ్య ప్రీతమ్‌ సింగ్‌ విర్ది హోమియో, ఆయుర్వేద వైద్యులు. ఆయన చాలా అనారోగ్యాలకు ఆయుర్వేద టీలతో చెక్‌ పెట్టే వాళ్లు. ఔషధ గుణాలుండే సహజ ఉత్పత్తులతో టీలను ఎలా చేయాలో విర్ది ఆయన దగ్గరే నేర్చుకుంది. అది తనకు విపరీతంగా నచ్చేసింది. వీలున్నప్పుడల్లా కుటుంబ సభ్యులు, బంధువులకు తన ఛాయ్‌ల రుచి చూపించడం అంటే విర్దికి చాలా ఇష్టం. తన అన్నయ్య పెళ్లిలో వేల మంది అతిథులకు ఒంటిచేత్తో టీలను అందించి అందరినీ ఫిదా చేసింది.

కాఫీ తాగే ఆస్ట్రేలియన్లకు ఔషధ గుణాలున్న మన తేనీటిని పరిచయం చేయాలనుకుంది విర్ది. ‘ద ఆర్ట్‌ ఆఫ్‌ ఛాయ్‌’ పేరుతో సెమినార్లను మొదలుపెట్టింది. ఈ సెమినార్లలో టీలోని ఔషధగుణాలు, తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ఈ వీడియాలను సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్‌ చేసింది. చిన్న చిన్న దుకాణాలకూ తన టీని సరఫరా చేసింది. ప్రస్తుతం ఆమె ఆన్‌లైన్‌ స్టోర్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. 2014లో ‘ఛాయ్‌ వాలీ’ పేరుతో సంస్థను ప్రారంభించింది. నాలుగేళ్లలో ఆమె టీకి బోలెడంత మంది అభిమానులయ్యారు.

అడ్డంకులనే... పునాది రాళ్లుగా!

టీ వ్యాపారం గురించి చెప్పినప్పుడు విర్ది కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. స్నేహితులూ వద్దన్నారు. ‘న్యాయవాదిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటున్న సమయంలో టీ వ్యాపారంలోకి అడుగు పెడతావా.. వద్దు కష్టం’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొదట రెండు రకాల టీలతో మొదలుపెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు 15 ఆయుర్వేద మిశ్రమాలతో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని కెఫెలు, స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్స్‌కి హెర్బల్‌ టీ పొడులను సరఫరా చేస్తోంది. కెఫిన్‌ ఫ్రీ ఛాయ్‌, బ్లాక్‌ మసాలా ఛాయ్‌, ఆర్గానిక్‌ బ్లాక్‌ మసాలా ఛాయ్‌ లాంటి వాటిని అసోం నుంచి దిగుమతి చేసుకుంటుంది. టీపొడిని, అల్లం, దాల్చిన చెక్క, బెల్లం, సోంపు.... లాంటి సుగంధ ద్రవ్యాలను ఇతర దినుసులను భారతదేశంలోని రైతుల నుంచే నేరుగా దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల అన్నదాతలకు మేలు కలుగుతుందనేది తన నమ్మకం.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని