కలిసి పుట్టారు.. కలిసి రాణిస్తున్నారు
close
Published : 10/08/2021 03:16 IST

కలిసి పుట్టారు.. కలిసి రాణిస్తున్నారు

శ్రీరమ్య, శ్రీలిఖిత.. కవలలు. కలిసి పుట్టడమే కాదు.. జీవితంలోనూ కలిసే రాణిస్తున్నారు. ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ చదువుతోపాటు కళలు, క్రీడల్లోనూ ప్రావీణ్యం చూపుతున్నారు.

విజయనగరం కొత్తవలస శ్రీరమ్య, శ్రీలిఖిత వాళ్లది. నాన్న పప్పు అప్పలరాజు చిరుద్యోగి, అమ్మ భాగ్యలక్ష్మి గృహిణి. ఇప్పుడు ఈ కవలలు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీలో ఎంఎస్‌సీ చివరి సంవత్సరం చదువుతున్నారు. చిన్నప్పటి నుంచీ చదువుతోపాటు ఇతర విభాగాల్లోనూ రాణించాలనుకున్నారు. దీనికి అమ్మానాన్నల ప్రోత్సాహం తోడైంది. అలా  క్రీడలు, కళల్లోకి ప్రవేశించారు. 7వ తరగతిలో కరాటే శిక్షణలో చేరారు. ఆరెంజ్‌, గ్రీన్‌ బెల్టులు సాధించారు. క్రమంగా వేరే రంగాల్లోకీ వెళ్లాలన్న ఆసక్తి కలిగింది. భరతనాట్యం, కూచిపూడిల్లో శిక్షణ తీసుకున్నారు. కళాశాల స్థాయిలో యోగాపై దృష్టి మళ్లింది. చిన్నచిన్న ఆసనాలతో మెదలుపెట్టి కఠినమైనవి వేసే స్థాయికి చేరారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలనే లక్ష్యంతో పీజీ చేస్తూనే మహిళా వర్సిటీలో యోగాలో డిప్లొమానీ పూర్తి చేశారు.

దేనిలోనైనా ఒకరు నెమ్మదించినా మరొకరు చేయూతనిచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌నూ సాధించారు. లాక్‌డౌన్‌లో కర్రసాము, కత్తిసాముల్లో శిక్షణ తీసుకున్నారు. ఎన్‌సీసీ సభ్యులు కూడా. దీనిలో సి సర్టిఫికెట్‌ ఉంది. సంప్రదాయ నృత్య ప్రదర్శనలూ ఇస్తున్నారు. విశ్వవిద్యాలయం తరఫున జానపద నృత్య పోటీల్లో పాల్గొని జోన్‌, జాతీయ స్థాయిల్లో ద్వితీయ స్థానం పొందారు. అంతర్జాతీయ పోటీకి కురుక్షేత్రకు వెళ్లారు. అక్కడ దక్షిణాసియా నుంచి 9 దేశాల వర్సిటీలు పోటీ పడితే వీరిది ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. కరాటే, యోగా, నృత్య విభాగాల్లో పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో 20కిపైగా పతకాలను గెలుచుకున్నారు. 

పోటీలు, కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా... కరాటే, నృత్యం, యోగా... వీటి సాధన ఏ రోజూ ఆపరు. ఉదయం, సాయంత్రం రోజూ అన్ని అంశాల్లోనూ సాధన చేస్తుంటారు. ఆసక్తి, పట్టుదల, ప్రణాళికబద్ధ సాధన ఉంటే ఏకకాలంలో వేర్వేరు రంగాల్లో కూడా విజయాలు సాధించవచ్చని అంటున్నారీ అక్కాచెల్లెళ్లు. భవిష్యత్తులో ఏ  ఉద్యోగంలో ఉన్నా వీటిని కొనసాగిస్తామంటున్నారు. అంతేకాదు... ఆసక్తి ఉన్న వారికి తర్ఫీదునిచ్చే ఆలోచనా ఉందట.

- గుడికోన కృష్ణకుమారి, తిరుపతిమరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని