చెవిలో భయంకర శబ్దాలు వినిపించేవి..
close
Updated : 12/08/2021 04:28 IST

చెవిలో భయంకర శబ్దాలు వినిపించేవి..

ఇంటర్‌ చదువుతున్న సౌమ్యకు క్లాసులో పాఠం వినిపించలేదు. అనుకోకుండా వచ్చిన ఆ సమస్య జీవితాంతం ఉంటుందని వైద్యులు చెప్పినప్పుడు ఆమె కుంగిపోలేదు. న్యాయవాద కోర్సులో ఉన్నప్పుడే యూపీఎస్సీకి సిద్ధమైంది. పరీక్షల్లో తీవ్ర జ్వరం... ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరుకున్న కలెక్టరు సౌమ్యాశర్మ స్ఫూర్తి కథనమిది...

సౌమ్య అమ్మానాన్నలు లీనాశర్మ, అశోక్‌శర్మ వైద్యులు. సోదరుడు అభిషేక్‌కు అమ్మానాన్నలా డాక్టరునవ్వాలని ఉంటే, సౌమ్య మాత్రం న్యాయవాదిగా స్థిరపడాలనుకుంది. వాళ్లది దిల్లీ. ఇంటర్‌ చదివేటప్పుడు తరగతిలో అందరికన్నా అత్యధిక మార్కులు తెచ్చుకునేది. అలాంటి సౌమ్యకు అనుకోకుండా వచ్చిందీ సమస్య.

భయంకర శబ్దాలొచ్చేవి..

‘ఇంటర్‌ రెండో ఏడాదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన శబ్దాలతో నా చెవుల్లో ఏదో జరిగిపోతున్నట్లుగా అనిపించేది. ఎందుకలా జరుగుతుందో అర్థమయ్యేది కాదు. రెండు రోజులకి నా మాటలు నాకే వినిపించడం మానేసింది. చాలా భయపడ్డా. అమ్మానాన్నలు మరింత ఆందోళనకు గురయ్యారు. నిపుణులకు చూపించి, ఎన్నో పరీక్షలు చేయించేవారు. ఇంటర్‌ రెండో ఏడాది కాలేజీకి వచ్చిందాని కన్నా ఆసుపత్రులకు తిరగడమే ఎక్కువ. ఓవైపు ఈ సమస్య, మరో వైపు బాగా చదువు కోలేకపోతున్నాననే వేదన నన్ను కుంగదీసేవి. అయితే నా స్నేహితులు నోట్స్‌ ఇస్తూ సాయం చేసేవారు. చివరకు వైద్యపరీక్షల్లో నాకు చెవులు శాశ్వతంగా వినిపించవని చెప్పారు. ఎందుకంటే.. చెవుల్లోని సున్నిత కణాలు అకస్మాత్తుగా దెబ్బ తిన్నాయట. దీనివల్ల శబ్దతరంగాలను నాడీ స్పందన తరంగాలుగా మార్చే లోపలి చెవిభాగం (కాక్లియా) శాశ్వతంగా పనిచేయదని తేల్చారు. దీన్నే నెర్వ్‌ డెఫ్‌నెస్‌ అని పిలుస్తారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించింది ఓ హియిరింగ్‌ ఇంప్లాంట్‌ కంపెనీ. అది చేసిచ్చిన హియిరింగ్‌ ఎయిడ్స్‌ ద్వారా నాకు వినిపించడం మొదలైంది. వీటిని ప్రతీ క్షణం చెవిలో ఉంచుకోవాలి. ఏదైతేనేం సమస్య తీరడం నాలో ఉత్సాహాన్ని నింపింది. తిరిగి చదువు కొనసాగించి ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నా’ అని వివరించింది సౌమ్య.

తీవ్ర జ్వరంతో...

దిల్లీ నేషనల్‌ లా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన సౌమ్య, తర్వాత  జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 2018లో ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో చేరింది. రెండో ఏడాది చివర్లో యూపీఎస్‌సీకు ప్రవేశపరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకుంది. అప్పటికి కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉందామెకు. న్యాయ వాద కోర్సులో పలు సామాజిక అంశాలు తనను ఈ దిశగా అడుగులేసేలా చేశాయి అంటుంది సౌమ్య. ‘మానవహక్కులు, సామాజిక సమస్యలు వంటివి సివిల్‌ సర్వీసెస్‌పై ఆసక్తిని పెంచాయి. ఎంఏ రెండో ఏడాది చివర్లో ఉన్నా. దాంతోపాటు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకూ పగలూ రాత్రీ చదివా. ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా, సొంతగానే ప్రిపేరై పరీక్షలు రాశా. మెయిన్స్‌కు వెళ్లేటప్పుడూ మరో సమస్య. కాలు కింద పెట్టలేనంత జ్వర తీవ్రత. అమ్మా నాన్నా డాక్టర్లు కదా. వారి చేయూతతో పరీక్ష హాలుకు వెళ్లగలిగా. జీఎస్‌ పేపర్స్‌ రాసేటప్పుడు మధ్యాహ్న భోజన సమయంలో కారులో కూర్చోబెట్టి నాకు డ్రిప్స్‌ ఎక్కించేవారు. జ్వరంతో అంతగా బలహీనపడ్డా. జీఎస్‌2 పేపరు పూర్తి చేస్తున్నప్పుడైతే కళ్లు తిరిగి  పడిపోయా. ఎలాగో పరీక్షలు రాయగలిగా. ఇన్ని ఇబ్బందుల్లో రాసినా మొదటిసారే మంచి ర్యాంకు వచ్చింది. ప్రజాసేవ చేయాలనే నా ఆశయం నెరవేరింది. సౌత్‌ వెస్ట్‌ దిల్లీ, డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా 2019లో శిక్షణలో చేరా. గత ఆగస్టులో శిక్షణ పూర్తై, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఎన్సీటీ ఆఫ్‌ దిల్లీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నా. ప్రజావసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నా’ అని చెబుతున్న సౌమ్య కథ నిజంగా స్ఫూర్తిదాయకమే కదూ.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని