అడవి బిడ్డ... అంతర్జాతీయ పోటీలకు...
close
Published : 13/08/2021 00:57 IST

అడవి బిడ్డ... అంతర్జాతీయ పోటీలకు...

ఆ ఊరికి వెళ్లాలంటే... అభయారణ్యంలో పది కిలోమీటర్లు నడవాలి. అలా అడవిలో ఆ పాదాలే ఆమెకు పరుగుని నేర్పాయి. క్రీడారంగాన్ని పరిచయం చేశాయి. తన తపనకు, కఠోర సాధనకు దాతల సాయం తోడైంది... ఇప్పుడు అండర్‌-20 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా నిరూపించుకునేందుకు కెన్యాకు పయనమైంది. ఆమే కుంజా రజిత. అడవి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరిన తన జీవన పయనాన్ని వసుంధరతో పంచుకుంది.

‘అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే... మన కోసం అవకాశాల్ని సృష్టించుకోగలిగితేనే గుర్తింపు’ అని నమ్ముతా. అడవిలో పుట్టి పెరిగిన నాకు కష్టం అంటే ఏంటో తెలుసు. ఆకలి బాధలు ఎలా ఉంటాయో చూశా. అలాంటి నేను అడవి దాటి, విమానం ఎక్కి... విదేశీ గడ్డపై కాలుమోపడం... మన దేశం తరఫున ఆడటం... ఇదంతా ఇప్పటికీ కలగానే అనిపిస్తోంది.

నలభై ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని ఛత్తీస్‌గఢ్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని ఆదివాసీ గ్రామానికి వచ్చింది మా కుటుంబం. చుట్టూ అడవి, అక్కడక్కడా విసిరేసినట్లు ఉండే ఇళ్లు. చిమ్మచీకట్లో మిణుకుమిణుకుమంటూ వెలిగే సౌరదీపాలు... బాహ్యప్రపంచంతో కలవాలంటే... కనీసం ఆరు కిలోమీటర్లు నడిస్తేనే కానీ చేరుకోలేం. అలాంటి చోటే నా బాల్యం గడిచింది. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ భద్రమ్మ, ముగ్గురన్నయ్యలు, నేను... కట్టెలు కొట్టి, కూలికి వెళ్లి సంపాదిస్తేనే ఇల్లు గడిచేది. మా తలరాతలు మారాలంటే చదువుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆదివాసీ గొత్తికోయ తెగలకు ఇక్కడ ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో కుల ధ్రువీకరణ రాలేదు. అది లేకపోతే ఉచిత విద్యావకాశాలు, ప్రభుత్వ రాయితీలు... ఏవీ వర్తించవు. నా తపన చూసిన అన్నయ్య జోగయ్య నన్ను ఎలాగైనా బడిలో చేర్చాలనుకున్నాడు. చింతూరు మండలంలోని కాటుకపట్టి మిషనరీ పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పిస్తారని తనకు తెలిసిన వారెవరో చెప్పారు. అక్కడ చేరా. అడవిలో ఆడుతూ, పాడుతూ తిరిగిన నాకు తోటి విద్యార్థులతో కలిసి ఆటలాడటం భలే ఇష్టంగా ఉండేది. అక్కడ పరుగులో నా వేగాన్ని టీచర్లు గమనించారు. ప్రత్యేకంగా ప్రోత్సహించారు. క్రమంగా మండల, జిల్లా పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టా. కాకినాడలో జోనల్‌ క్రీడలకు ఎంపిక కావడం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మరింత సాధన చేస్తే... మరిన్ని విజయాలు సాధించగలనని నమ్మారు అక్కడి పాస్టర్లు. మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు నెల్లూరులోని సుబ్బారెడ్డి పాఠశాలో చేర్చారు. అక్కడ శిక్షణ తీసుకుంటూనే ఎనిమిది, తొమ్మిది తరగతులు పూర్తి చేశా. ఆపై మంగళగిరిలో జేకే జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతూనే నెల్లూరులో అథ్లెటిక్‌ కోచ్‌లు వంశీ, కిరణ్‌, కృష్ణమోహన్‌ల దగ్గర శిక్షణ తీసుకున్నా. అదే సమయంలో గుంటూరులో జమైకా కోచ్‌ మైక్‌ రసెల్‌ దగ్గర సాధన చేశా. ఓ పక్క చదువూ, సాధన చేస్తూనే పోటీల్లో పాల్గొనేదాన్ని. అక్కడ నా ఆటలోని బలాలు, బలహీనతలు తెలుసుకుంటూ మెరుగుపరుచుకునేదాన్ని.

పుల్లెల గోపీచంద్‌ సాయంతో...

నా ఆట అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే ఉన్నత శిక్షణ అవసరం అని భావించారు అంతా. అప్పుడే ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగుబండి రమేష్‌ గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదిస్తే  శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. నా పరిస్థితి చూసి... పుల్లెల గోపీచంద్‌ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్‌కి చెప్పడంతో వారు ఫిజియోథెరపీ, అవసరమైన దుస్తులు, బూట్లు వంటివన్నీ అందిస్తున్నారు. మెరుగైన ఆటకు శారీరక దారుఢ్యమూ ఎంతో అవసరం. ముఖ్యంగా ఖరీదైన ప్రొటీన్‌ ఫుడ్‌ బాగా తీసుకోవాలి. నా ఆటతీరు, కుటుంబ పరిస్థితి గమనించిన లెక్కల మాస్టారు నాగేంద్ర నెలకు పదివేల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు.

గతేడాదిగా జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ఒక రజత పతకం, రెండు కాంస్య పతకాలు అందుకున్నా. తాజాగా కెన్యాలో జరుగుతోన్న అండర్‌-20 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రిలే పరుగు పందెం పోటీల్లో దేశం తరఫున ఐదుగురు పాల్గొంటుంటే...అందులో తెలుగమ్మాయిని నేనొక్క దాన్నే. పరుగుల రాణి పీటీ ఉష నాకు ఆదర్శం. దేశం గర్వించే విజయాలను సాధించాలన్నది నా లక్ష్యం. అప్పుడు అందరి దృష్టీ మా ఊరి మీద, మా ఆదివాసీల మీద పడుతుంది. అప్పుడైనా మావీ, మా తోటి వారివీ జీవితాలు మారతాయన్నది ఆశ. అందుకోసమే ఈ కష్టమంతా.

- ఉప్పలపాటి వీరవెంకట రమేష్‌, కూనవరం.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని