నా పేరు మీనాక్షి... అసలు పేరు నవ్యస్వామి!
close
Updated : 14/08/2021 04:43 IST

నా పేరు మీనాక్షి... అసలు పేరు నవ్యస్వామి!

పుట్టి పెరిగింది కర్ణాటక. తెలియని భాషలో అడుగుపెట్టినా.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. మాట నుంచి చీరకట్టు వరకు అన్నీ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతున్నా మధ్యలో తెలుగు పదాలే వచ్చేస్తాయ్‌! అంతలా తెలుగమ్మాయిలా మారిపోయింది. ‘నా పేరు మీనాక్షి’లో కథానాయిక నవ్యస్వామి గురించే ఇదంతా! వసుంధరతో తను బోలెడు విశేషాలను పంచుకుంది...

పుట్టి, పెరిగింది మైసూరు. చదివిందేమో బెంగళూరు. నాన్న పుట్టస్వామి రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి, అమ్మ సరస్వతి గృహిణి, అన్న వినయ్‌ వ్యాపారం చేస్తున్నాడు. వదిన ఐశ్వర్య కూడా సీరియళ్లలో చేస్తుంది.

అలా మొదలైంది... తెలుగులోకొచ్చి ఎనిమిదేళ్లు. ఇంటర్‌ సెలవుల్లో టీవీ యాంకర్‌ కావాలన్న ప్రకటన చూసి ప్రయత్నిస్తే ఎంపికయ్యా. చదువుకీ ప్రాధాన్యం ఇవ్వాలన్న నాన్న మాటతో యాంకరింగ్‌ చేస్తూనే బీబీఎం పూర్తి చేశా. కన్నడంలో ఓ సినిమా కూడా చేశా. తర్వాత ధారావాహికలు. అలా.. కన్నడ, తమిళం.. తర్వాత తెలుగుకొచ్చా.

నిత్యం నేర్చుకుంటా... ఇక్కడ నా మొదటి సీరియల్‌ ‘ఆహ్వానం’. తర్వాత ‘నా పేరు మీనాక్షి’తో మంచి గుర్తింపొచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలు, నటులు ఇష్టమే కానీ ఈ రంగంలోకి రావాలన్న ప్రత్యేక కోరికేమీ లేదు. స్కూలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా నటనని నేర్చుకోలేదు. ఓ తమిళ సీరియల్‌లో రాధికా శరత్‌ కుమార్‌తో కలిసి పని చేశా. దాంట్లో తండ్రి చనిపోయినపుడు ఏడ్చే సీన్‌ చూసి ప్రశంసించారు. ఆమె త్వరగా ఎవరినీ మెచ్చుకోరట. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం. షూటింగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంత మంది ఎంతో దూరం ప్రయాణించి మరీ వస్తారు కలవడానికి. చాలామంది మెసేజ్‌లూ పెడుతుంటారు. ఇవన్నీ చూసినపుడు చాలా ఆనందమేస్తుంది. అందుకే నన్ను నేను మెరుగుపరచుకుంటూ ఉంటా. నేను చేసిన సీన్లను చూసుకుని మార్చుకోవాల్సినవి నోట్‌ చేసుకుంటా. మా అమ్మ నా విమర్శకురాలు. మంచి సలహాలూ ఇస్తుంటుంది. అవన్నీ పాటిస్తా. ఆడవాళ్లు ఎక్కువగా నా డ్రెసింగ్‌ బాగుందంటారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఫ్యాషన్‌, మేకప్‌ల గురించి ఇంతకు ముందు పెద్దగా తెలీదు. అందరినీ గమనిస్తూ మెరుగుపరచుకున్నా.

అల్లరి పిల్లనే...! ఇంటర్‌ అమ్మాయిల కాలేజ్‌లో చదివా. మాస్‌ బంక్‌, స్నేహితులతో సినిమాలూ మామూలే. ఇంట్లో తెలిసి తిట్లూ తినేదాన్ని. ఓసారి స్నేహితులందరం కాఫీడేలో కలుద్దాం అనుకున్నాం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బండి తీసుకెళ్లా. వచ్చేటపుడు యాక్సిడెంట్‌ అయింది. ఫ్రెండ్స్‌, తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు పోగు చేసి, రిపేర్‌ చేయించేశా. అయినా గుర్తు పట్టేసి బాగా కోప్పడ్డారు.  

ఖాళీ దొరికితే... షాపింగ్‌ చేస్తా. అన్ని భాషల సినిమాలూ చూస్తా. వంట చేస్తా. ఇల్లు శుభ్రం చేయడం, సర్దుకోవడం నాకో వ్యసనం. స్వీట్స్‌, చాక్‌లెట్లు, ఐస్‌క్రీమ్‌ లాగించేస్తా. అందుకు తగ్గట్టుగా వ్యాయామమూ చేస్తాననుకోండి.

తిరిగొస్తుంది... సరదాలే కాదు, జీవితాన్నీ సీరియస్‌గా తీసుకుంటా. ఏదీ సులువుగా రాదని నా నమ్మకం. నాన్న ఓ మాట చెప్పే వారు.. ‘ఏది చేస్తే అదే తిరిగొస్తుందని’. మైసూరులో దసరా సమయంలో ఏటా ఎగ్జిబిషన్‌ పెడతారు. ఓసారి దాంట్లో సెంటెడ్‌ ఎరేజర్‌లు జేబులో వేసుకొచ్చేశా. నాన్నకి గొప్పగా చూపించా. ‘నువ్విప్పుడు ఇలా తీశావ్‌ కదా! చూడు.. నీవీ పోతాయి’ అన్నారు. నిజంగానే నా వస్తువులు కొన్ని పోయాయి. అప్పట్నుంచి మంచి చేస్తే అదే తిరిగొస్తుందని బాగా నమ్ముతా, పాటిస్తా.

తెలుగమ్మాయినైపోయా! నాది సూటిగా మాట్లాడే మనస్తత్వం. నావాళ్లు అనుకుంటే ఏదైనా చేస్తా. ఆ మధ్య కొవిడ్‌ వల్ల చాలా ఇబ్బందిపడ్డా. ఆ సమయంలో కొన్ని విషయాలు జీవితంలో ఎప్పుడూ లేనంతగా బాధపెట్టాయి. కానీ త్వరగానే బయటపడ్డా.  నా అదృష్టమో ఏమో  కానీ పరిశ్రమలో ఇబ్బందులేమీ పడలేదు. అందరం ఒక కుటుంబంలా ఉంటాం. అందుకే మొదట్లో నాతోపాటే ఉండే అమ్మ ఇప్పుడు అప్పుడప్పుడూ మాత్రమే వస్తోంది. హరితేజ ఇక్కడ మంచి స్నేహితురాలు. బెంగళూరులో ఎలా సౌకర్యవంతంగా ఉంటానో ఇక్కడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కన్నడ మాట్లాడినా అందులో తెలుగు పదాలే దొర్లుతుంటాయి. మా దగ్గరా చేసినా ఇక్కడి ఉగాది పచ్చడే నా ఫేవరెట్‌. తెలుగు సినిమాల్లో అవకాశాలూ వస్తున్నాయి. ప్రాధాన్యమున్న పాత్ర దొరికితే చేస్తా.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని