మన షణ్ముఖ ప్రియ కోట్ల మనసుల్ని గెలిచింది
close
Published : 16/08/2021 01:11 IST

మన షణ్ముఖ ప్రియ కోట్ల మనసుల్ని గెలిచింది

షణ్ముఖ ప్రియ... పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటక సంగీతంలో ఓ రాగం పేరుని పెట్టుకున్న ఈ అమ్మాయి శాస్త్రీయ సంగీతంతో పాటు వెస్ట్రన్‌, రాక్‌, పాప్‌, జాజ్‌, జానపదం... ఏదైనా తన మధుర గాత్రంతో కట్టిపడేస్తుంది. సోనీ ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-12’లో ఫైనల్స్‌కి వచ్చిన తొలి తెలుగు అమ్మాయిగా నిలిచింది. ఓడినా... ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నీరాజనాలు అందుకుంది.

మూడేళ్ల వయసులో పాట మొదలుపెట్టిన షణ్ముఖ ప్రియ దాన్నే తన ఆటగా మార్చుకుంది. మెలోడీ, మాస్‌, క్లాస్‌... తేడా లేకుండా అన్ని వర్గాలనీ సుస్వరాలతో కట్టి పడేస్తుంది. అందుకే ఇండియన్‌ ఐడల్‌ వేదిక మీద ప్రశంసలతో పాటు అవకాశాలూ వెల్లువెత్తాయి. జయప్రద షణ్ముఖకు ఇష్టమైన సాంబారు అన్నాన్ని బాక్సులో తెచ్చి వేదికపైనే తినిపించి తన మమకారాన్ని చాటారు. మరో ప్రముఖ నటి రేఖ ‘అద్భుతంగా పాడావు’ అంటూ ఆలింగనం చేసుకున్నారు. బప్పిలహరి, కవితా కృష్ణమూర్తి, ఏఆర్‌ రెహమాన్‌... ఒకరేమిటి అందరితోనూ అదరహో అనిపించుకుంది. తాజాగా షణ్ముఖ అభిమాన నటుడు విజయ్‌ దేవరకొండ ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెప్పడమే కాదు... ‘హైదరాబాద్‌ వచ్చీ రాగానే నన్ను కలవబోతున్నావు.... నా సినిమాకు పాటలు పాడబోతున్నా’వు’ అని వీడియోలో చెప్పాడు... ఇవి చాలదా ఆమె ప్రతిభ గురించి చెప్పడానికి!

యోడ్లింగ్‌ అంటే పాడుతూ మధ్యలో విచిత్ర శబ్దాలు చేయడం, కూనిరాగాలు తీయడం. ఇది ఆడపిల్లలకు ఒకింత కష్టమే అయినా... హిందీ గాయకుడు కిశోర్‌ కుమార్‌ని చూసి సాధన చేసిందామె. ఆమె ప్రతిభను గుర్తించిన వాళ్లబ్బాయి అమిత్‌ షణ్ముఖను లేడీ కిశోర్‌ కుమార్‌గా వర్ణించడమే కాదు... వాళ్ల నాన్నకిష్టమైన రబ్డీని తినిపించి ఆశీర్వదించారు. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన గాయకులకు ఇచ్చే గోల్డైన్‌ మైకులు రెండింటిని అందుకున్నది మన షణ్ముఖే.

సంగీతమే ప్రాణం...

షణ్ముఖప్రియ అమ్మానాన్న శ్రీనివాస్‌, రత్నమాల సంగీత విద్వాంసులు. శ్రీనివాస్‌ వీణ, వయొలిన్‌, మాండొలిన్‌, గిటార్‌, కీబోర్డ్‌లను అద్భుతంగా వాయించగలరు. ఆయన పంచముఖి సంగీత అవధానం కూడా చేశారు. అమ్మ రత్నమాలకు గాత్రంలో మంచి పట్టుంది. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న షణ్ముఖ ఇండియన్‌ ఐడల్‌ షోలోనూ ఎన్నో ప్రయోగాలు చేసి అందరి మన్ననలు అందుకుంది. ఊహ తెలియని వయస్సులోనే అమ్మ చేతిలోని మైక్‌ను లాక్కొని కూనిరాగాలు తీసేది చిన్నారి షణ్ముఖ. అలారం సౌండ్‌ని అచ్చంగా అలానే పలికిస్తోన్న కూతురి బలాన్ని గుర్తించారా అమ్మానాన్నలు. సంగీతంలో శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు. దీంతో నాలుగేళ్లకే విశేష ప్రతిభ కనబరిచింది.  వీణ, గిటార్‌, వయొలిన్‌, కీబోర్డ్‌ తదితర వాయిద్యాలను వాయించడంలోనూ ఆమె దిట్ట. వెస్ట్రన్‌, యోడ్లింగ్‌, పాప్‌, రాక్‌, జాజ్‌, బ్లూస్‌, ఓపెరాటిక్‌, అరబిక్‌, స్పానిష్‌, యాడ్లిప్స్‌, వెస్ట్రన్‌ ఫ్యూజన్‌ తదితర ప్రక్రియల్లోనూ పట్టు సాధించింది.

స్టూడియోలే లోకం...

చిన్నప్పటి నుంచే పోటీల్లో విశేష ప్రతిభ చూపిన షణ్ముఖకు 2008 నుంచి స్టూడియోలే లోకమంటే అతిశయోక్తికాదు. ఇండియన్‌ ఐడల్‌ పోటీ ఆమెకు 12వ రియాల్టీ షో. ఇప్పటివరకు పాల్గొన్న వాటిల్లో ఆరింటిలో విజయం సాధించింది. 2013లో ఈటీవీ ‘పాడుతా తీయగా’ పోటీలో రన్నరప్‌ తను. ఓ తమిళ ఛానెల్‌ కార్యక్రమంలో తమిళ గాయకులతో పోటీపడి విజేతగా నిలిచింది. ఆ పోటీ కోసం షణ్ముఖ తమిళం నేర్చుకుంది. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిషుల్లోనూ అలవోకగా పాడగలదు. అంతర్జాతీయ గాయకుల ఆల్బమ్‌లను చూడటం తన అలవాటు. ఫలితంగా తనకూ అంతర్జాతీయ ప్రమాణాలతో పాడటం అలవాటైపోయింది.

చదువులోనూ మేటే!

షణ్ముఖప్రియ చదువులోనూ రాణిస్తోంది. పదిలో 9.5, ఇంటర్లో 9.7 స్కోరును సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన శ్రీచైతన్య విద్యాసంస్థలు మూడో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచితంగా చదివించాయి. ఇప్పుడు బీఎస్సీ మొదటి సంవత్సరం శ్రీకాశ్యప్‌ కళాశాలలో చదువుతోంది. ఆ కళాశాల యాజమాన్యం ఆమెకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది.

మైఖేల్‌ జాక్సన్‌ పాడిన వేదికపై...

షణ్ముఖ లండన్‌లోని ప్రఖ్యాత ‘ఒ2 ఆడిటోరియం’లో పాడింది. మైఖేల్‌ జాక్సన్‌ పాడిన ఆ ప్రతిష్ఠాత్మక వేదికపై అవకాశం పొందిన అతికొద్ది మందిలో తనూ ఒకరు. అమెరికా, హాలెండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్‌, ఉత్తరకొరియా వంటి దేశాల్లోనూ పాడింది. అంతర్జాతీయ గాయనిగా ఎదగాలన్న తన ఆశయం ఎంతో దూరంలో లేదు.


* నా సినిమాలో షణ్ముఖకు ఓ పాట ఇవ్వాలనుకున్నా. తను పాడటం ప్రత్యక్షంగా చూశాక పాటలన్నీ తనతోనే పాడించాలి అనుకుంటున్నా. - ఒమంగ్‌ కుమార్‌, ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత

* నా తర్వాత సినిమాకు నువ్వే పాడుతున్నావ్‌. - శ్రద్ధాకపూర్‌, బాలీవుడ్‌ నటి

* ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఆక్టోపస్‌’ షణ్ముఖతో ఆల్బమ్‌కి ఒప్పందం కుదుర్చుకుంది.

* బాలీవుడ్‌ సంగీత దర్శకులు అజయ్‌, అతుల్‌లు తనతో కొన్ని పాటలు రికార్డు కూడా చేశారు. - బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం




మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని